Home Film News Sumanth : సుమంత్ లుక్ అదిరిందిగా..
Film News

Sumanth : సుమంత్ లుక్ అదిరిందిగా..

Sita Ramam
Sita Ramam

Sumanth: యంగ్ వెర్సటైల్ యాక్టర్‌ దుల్కర్ సల్మాన్.. ‘మహానటి’ తర్వాత స్ట్రైట్ తెలుగు సినిమా చేస్తున్నారు. ‘అందాల రాక్షసి, ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’, ‘పడిపడిలేచే మనసు’ వంటి విభిన్నమైన ప్రేమకథా చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న హను రాఘపూడి దర్శకత్వంలో.. వైజయంతి మూవీస్ సమర్పణలో, స్వప్న సినిమా బ్యానర్ మీద అశ్వనీదత్ నిర్మిస్తున్న బ్యూటిఫుల్ ఫిల్మ్ ‘సీతా రామం’ (యుద్ధంతో రాసిన ప్రేమకథ)..

మృణాల్ ఠాకూర్ కథానాయిక. ప్రేమకీ యుద్ధానికీ ముడిపెడుతూ అపురూప దృశ్యకావ్యంగా తెరెకెక్కిస్తున్న ఈ సినిమాలో సుమంత్, రష్మిక మందన్న కీలకపాత్రల్లో కనిపించబోతున్నారు. ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రోమోస్, సాంగ్స్ మంచి అనుభూతి కలిగించడమే కాక సినిమా మీద అంచనాలు పెంచాయి.

శనివారం సుమంత్ క్యారెక్టర్ లుక్ రిలీజ్ చేశారు. సుమంత్ బ్రిగేడియర్ జనరల్ విష్ణు శర్మ పాత్రలో కనిపించబోతున్నట్లు రివీల్ చేశారు. సరికొత్త గెటప్‌లో సుమంత్ లుక్ ఆకట్టుకుంటుంది. ఆగస్టు 5న తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో ‘సీతా రామం’ విడుదలవుతోంది.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...