Home Film News SSMB 28 : సమ్మర్‌లో సెన్సేషన్ క్రియేట్ చెయ్యడానికి సిద్ధమవుతున్న సూపర్ స్టార్..
Film News

SSMB 28 : సమ్మర్‌లో సెన్సేషన్ క్రియేట్ చెయ్యడానికి సిద్ధమవుతున్న సూపర్ స్టార్..

SSMB 28
SSMB 28

SSMB 28: ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న తన అభిమానులకు శుభవార్త చెప్పారు సూపర్ స్టార్ మహేష్ బాబు. మహేష్, స్టార్ రైటర్ కమ్ డైరెక్టర్ త్రివిక్రమ్‌లది ఎవర్ గ్రీన్ కాంబినేషన్. వీళ్ల కలయికలో వచ్చిన ‘అతడు’ ఏ రేంజ్ హిట్ అయిందో కొత్తగా చెప్పక్కర్లేదు.

టీవీలో టెలికాస్ట్ చేసిన ప్రతిసారీ రికార్డ్ రేంజ్ టీఆర్పీ రేటింగ్ వచ్చేది. అప్పట్లో డీవీడీలు అత్యధికంగా అమ్ముడుపోయిన రికార్డ్ కూడా ‘అతడు’కి ఉంది. తర్వాత వచ్చిన ‘ఖలేజా’ మహేష్‌లోని కామెడీ యాంగిల్‌ని చూపించింది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి సెన్సేషన్ క్రియేట్ చెయ్యడానికి రెడీ అవుతుందీ క్రేజీ కాంబో.

మహేష్, పూజా హెగ్డే జంటగా.. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న SSMB 28 మూవీ ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన సంగతి తెలిసిందే. పూజా హెగ్డే మీద చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి మహేష్ సతీమణి నమ్రత క్లాప్ నిచ్చారు. ఆగస్టులో షూటింగ్ స్టార్ట్ చేసి.. వచ్చే ఏడాది వేసవిలో విడుదల చెయ్యనున్నట్లు ప్రకటించారు టీం. సంగీతం : థమన్, కెమెరా : పి.ఎస్.వినోద్, ఎడిటింగ్ : నవీన్ నూలి, ఆర్ట్ : ఏ.ఎస్.ప్రకాష్.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...