Home Film News Mega 154 : ‘బాక్సాఫీస్ వేటకు లంగరు తయారు’.. సంక్రాంతికి చిరు సినిమా
Film News

Mega 154 : ‘బాక్సాఫీస్ వేటకు లంగరు తయారు’.. సంక్రాంతికి చిరు సినిమా

Mega 154
Mega 154

Mega 154: మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో ఫుల్ స్పీడ్ మీదున్నారు. ‘ఆచార్య’ తర్వాత ముచ్చటగా మూడు సినిమాల షూటింగ్స్‌లో పాల్గొంటున్నారాయన. మలయాళీ బ్లాక్ బస్టర్ ‘లూసిఫర్’ రీమేక్ ‘గాడ్ ఫాదర్’, బాబీ దర్శకత్వంలో ఓ సినిమాతో పాటు తమిళ్ సూపర్ హిట్ ‘వేదాళం’ రీమేక్ ‘భోళాశంకర్’ మూవీస్‌తో సందడి చెయ్యబోతున్నారు.

కె.ఎస్.రవీంద్ర (బాబీ) డైరెక్షన్‌లో చిరు, శృతి హాసన్ జంటగా.. మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కిస్తున్న యాక్షన్ మాస్ ఎంటర్‌టైనర్ ‘వాల్తేరు వీరయ్య’.. చిరంజీవి నటిస్తున్న 154వ సినిమా ఇది. ఇప్పటివరకు టైటిల్ గురించి వార్తలు వచ్చాయి. స్వయంగా బాబీనే ఫ్యాన్స్ మీట్‌లో చెప్పాడు కానీ అఫీషియల్‌గా టైటిల్ పోస్టర్ రిలీజ్ చెయ్యలేదు.

శుక్రవారం ఉదయం Mega 154కి సంబంధించి క్రేజ్ అప్‌డేట్ ఇచ్చింది టీం. ‘కలుద్దాం సంక్రాంతికి’.. ‘బాక్సాఫీస్ వేటకు లంగరు తయారు’ అంటూ 2023 సంక్రాంతి బరిలోకి చిరు సినిమా దిగబోతుందని కన్ఫమ్ చేశారు. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...