Home Film News Twins Always: రెండు సార్లు క‌వల పిల్ల‌లు.. ఆ లోపం వ‌ల్ల‌నే ఇలా జ‌రిగిందంటున్న హీరోయిన్
Film News

Twins Always: రెండు సార్లు క‌వల పిల్ల‌లు.. ఆ లోపం వ‌ల్ల‌నే ఇలా జ‌రిగిందంటున్న హీరోయిన్

Twins Always: ఎంత  పెద్ద స్టార్ హీరోయిన్ స‌రే ఎప్పుడో అప్పుడు పెళ్లి చేసుకొని పిల్ల‌ల‌ని క‌నాల్సిందే. చాలా త‌క్కువ మంది పెళ్లి చేసుకోకుండా ఉంటున్నారు. మీకు మంచు విష్ణు హీరోయిన్ సెలీనా జైట్లీ తెలిసే ఉంటుంది. అనేక బాలీవుడ్ చిత్రాల‌లో న‌టించిన ఈ అమ్మ‌డు మంచు విష్ణు కెరీర్ ఆరంభంలో నటించిన సూర్యం చిత్రంలో క‌థానాయిక‌గా న‌టించింది. అయితే ఈ సినిమా ఫ్లాప్ కావ‌డంతో సెలీనాకి పెద్ద‌గా అవ‌కాశాలు రాలేదు. బాల‌వుడ్‌లో కూడా పెద్ద‌గా అవ‌కాశాలు త‌లుపు త‌ట్ట‌లేదు. దీంతో 2011లో సెలీనా జైట్లీ.. పీటర్ హాగ్ అనే బిజినెస్ మ్యాన్ ని వివాహం చేసుకుని విదేశాల‌లో సెటిల్ అయింది. అప్పుడ‌ప్పుడు మాత్రం సోష‌ల్ మీడియా ద్వారా త‌న ఫ్యాన్స్‌ని ప‌ల‌క‌రిస్తూ ఉంటుంది.

తాజాగా ఫ్యాన్స్‌తో చాట్ సెష‌న్ నిర్వ‌హించిన ఈ భామ త‌న  శరీరంలో ఉన్న అరుదైన లోపం గురించి బయట పెట్టి అంద‌రికి షాక్ ఇచ్చింది.  కాగా సెలీనా  పీటర్ దంపతులకు 2012లో కవల పిల్లలు జన్మించ‌గా,  2017లో కూడా మ‌ళ్లీ  సెలీనా గర్భవతి కావ‌డం,  అప్పుడు కూడా ఆమెకి కవల పిల్లలే జన్మించ‌డం జ‌రిగింది. ఇలా రెండు సార్లు కవలపిల్లలు జన్మించడం చాలా అరుదు కాబ‌ట్టి ఓ నెటిజన్ మీకు సహజంగానే కవలపిల్లలు పుట్టారా లేక ఏదైనా చికిత్స చేయించుకోవడం వల్ల ఇలా జరిగిందా అని ఆమెని ప్రశ్నించారు. దీనికి ఆమె బ‌దులిస్తూ త‌న బాడీలో ఉన్న లోపం గురించి చెప్పుకొచ్చింది. నాకున్న జన్యు సమస్య వల్ల ఓవిలేషన్ స‌మ‌యంలో మల్టిపుల్ ఎగ్స్ రిలీజ్ అవుతుంటాయి. ఆ కార‌ణం వ‌ల్ల‌నే నేను గర్భవతిని అయిన ప్రతి సారి నాకు కవలలే జన్మిస్తారు అని  చెప్పుకొచ్చింది.

నా కేస్ లో నాకు నాన్ ఐడెంటికల్ ట్విన్స్ జన్మిస్తారు అని సెలీనా తన జన్యు లోపం గురించి వివరించి అంద‌రిని ఆశ్చర్యపరిచింది సెలినా. ఆమె కామెంట్‌పై కొంద‌రు  ఇది లోపం కాదు.. దేవుడు మీకిచ్చిన గొప్ప వరం అని చెప్పుకొస్తున్నారు.. అయితే తన పిల్లల విషయంలో సెలీనా, పీటర్ దంపతులకి గుండె కోత మిగిలింది . రెండవసారి జన్మించిన కవలలు హార్ట్ సంబంధిత సమస్యలతో పుట్టగా, ఇందులో  ఒక పిల్లాడు కొన్ని రోజులకే మరణించాడు. రెండవ పిల్లాడు క్ర‌మంగా  కోలుకుని ఆరోగ్యంగా ఆన్నాడు.. ఇప్పుడు  సెలీనా తన ముగ్గురు పిల్లలు, భర్తతో హ్య‌పీగా ఉంటుంది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...