Home Film News Keerthy Suresh: లిప్ లాక్ ఇచ్చేది అత‌నొక్కడికే.. తేల్చి చెప్పేసిన కీర్తి సురేష్
Film News

Keerthy Suresh: లిప్ లాక్ ఇచ్చేది అత‌నొక్కడికే.. తేల్చి చెప్పేసిన కీర్తి సురేష్

Keerthy Suresh: మ‌ల‌యాళీ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ త‌న న‌ట‌న‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కి చాలా ద‌గ్గ‌రైంది. మ‌హాన‌టి చిత్రంలో ఈ అమ్మ‌డి న‌ట‌న‌ను ఎవ‌రు మ‌ర‌చిపోలేరు. సావిత్రి పాత్ర‌లో కీర్తి సురేష్ క‌న‌బ‌ర‌చిన న‌ట విశ్వ‌రూపం న‌భూతో న‌భ‌విష్య‌త్ అని చెప్పాలి. అయితే కీర్తి సురేష్‌కి మంచి క్రేజ్ వ‌చ్చాక  ప్రయోగాత్మక సినిమాలు చేసింది. ఇవి ఏ మాత్రం వ‌ర్క‌వుట్ కాలేదు.  తెలుగులో ‘నేను శైలజ’ అనే సినిమాతో ఇండ‌స్ట్రీకి ఆరంగేట్రం చేసిన కీర్తి సురేష్ తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది. ఆ తర్వాత ‘మహానటి’ సినిమాతో స్టార్ స్టేట‌స్ సంపాదించుకుంది. ఈ క్ర‌మంలోనే  కీర్తి సురేష్‌..టాలీవుడ్ స్టార్ హీరోలు  పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది.

స‌క్సెస్ ట్రాక్‌లో వెళుతున్న స‌మ‌యంలో కీర్తి సురేష్‌..   పలు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసింది . ఇవి  తమిళంతో పాటు తెలుగులోనూ విడుద‌ల‌య్యాయి.  కీర్తి చేసిన లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు అయిన . ‘పెంగ్విన్’, ‘మిస్ ఇండియా’, ‘గుడ్ లక్ సఖి చిత్రాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర దారుణంగా నిరాశ‌ప‌రిచాయి. అప్పుడు చాలా మంది కీర్తి సురేష్‌కి లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేయోద్దని స‌ల‌హా ఇచ్చారు.  కీర్తి సురేష్ ఇప్పుడు క‌థానాయిక‌గానే కాకుండా సోద‌రి పాత్ర‌ల‌లో న‌టిస్తూ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. ర‌జ‌నీకాంత్ సోద‌రిగా న‌టించి మెప్పించిన కీర్తి సురేష్‌.. ఇప్పుడు చిరంజీవి భోళా శంక‌ర్ చిత్రంలో ఆయ‌న‌కు సోద‌రి పాత్ర‌లో క‌నిపించి సంద‌డి చేయనుంది.

కీర్తి సురేష్ అందరి హీరోయిన్స్ మాదిరి పెద్ద‌గా గ్లామ‌ర్ షో చేయ‌దు. చాలా ప‌ద్ద‌తిగా సినిమాల‌లో క‌నిపిస్తుంది. అయితే స‌ర్కారు వారి పాట చిత్రం నుండి ఈ అమ్మ‌డు గ్లామ‌ర్ డోస్ పెంచింది. సోష‌ల్ మీడియాలోను అడ‌పాద‌డ‌పా పొట్టి బట్ట‌ల‌లో కనిపిస్తూ సంద‌డి చేస్తుంది. అయితే ఈ అమ్మ‌డు త‌న‌కి  ఎన్ని కోట్ల రూపాయిల పారితోషికాలు ఇచ్చిన పెట్టుకున్న నియ‌మ‌ నిబంధలను అస్స‌లు బ్రేక్ చేయ‌నంటుంది.  త‌నే చేసే ఏ సినిమాల్లో కూడా  లిప్ లాక్ సన్నివేశాల్లో న‌టించ‌కూడ‌ద‌ని ముందుగానే ఫిక్స్ అయింద‌ట‌. పేరెంట్స్ కి కూడా ఈ విష‌యం చెప్పి సినిమా ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టింద‌ట కీర్తి. తాను త‌న భ‌ర్త‌తో త‌ప్ప ఎవ‌రికి లిప్ లాక్ ఇవ్వ‌నంటుంది. మొత్తానికి కీర్తి సురేష్ తీసుకున్న  నిర్ణయం పై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  గతంలో చూస్తే త‌మ‌న్నా కూడా ఇలానే చెప్పింది కాని ఇప్పుడు మాత్రం రెచ్చిపోయి న‌టిస్తుంది.. మ‌రి కీర్తి .. త‌మ‌న్నా రూట్‌లో వెళుతుందా లేదా అనేది రాబోవు రోజుల‌లో తెలియ‌నుంది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...