Home Film News KGF 2 : ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే!
Film News

KGF 2 : ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే!

KGF 2 - 100 DAYS
KGF 2 - 100 DAYS

KGF 2: యావత్ భారతదేశం చూపు కన్నడ సినీ పరిశ్రమ వైపు తిప్పేలా చేసిన సినిమా ‘కె.జి.యఫ్’. అప్పటివరకు ప్రపంచానికి పెద్దగా తెలియని శాండల్ వుడ్ ఇండస్ట్రీ పేరు ఒక్కసారిగా మార్మోగిపోయేలా చేసిన సినిమా.. 2018 డిసెంబర్‌లో వచ్చిన ఫస్ట్ పార్ట్ చూసిన ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు.

ఇంతకుముందెన్నడూ తెరమీద చూడని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ బ్యాక్ డ్రాప్‌లో, అమ్మ సెంటిమెంట్, అదిరిపోయే హీరోయిజం, రోమాలు నిక్కబొడుచుకునే యాక్షన్ సీన్స్‌కి అంతా ఫిదా అయిపోయారు. పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసిందీ సినిమా. రాకింగ్ స్టార్ యశ్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు.

ఇక దర్శకుడు ప్రశాంత్ నీల్ సొంతం చేసుకున్న పేరు గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఆకాశాన్నంటే అంచనాలతో 2022 ఏప్రిల్ 14న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా ‘కె.జి.యఫ్ 2’ రిలీజ్ అయ్యింది. ఆ ఆంచనాలను మించి బొమ్మ బ్లాక్ బస్టర్ అయ్యింది. వందలకోట్ల కలెక్షన్లతో బాక్సాఫీస్ దుమ్ముదులిపి సౌత్ సినిమా సత్తా ఏంటనేది మరోసారి నిరూపించింది.

https://twitter.com/prashanth_neel/status/1550359505116221441

జూలై 22 నాటికి ‘కె.జి.యఫ్ 2’ విజయంతంగా 100 రోజులు పూర్తి చేసుకుంటోంది. ఇప్పటికే డైరెక్టర్ సీక్వెల్ గురించి కొన్నిసార్లు చెప్పుకొచ్చారు. త్వరలో ‘కె.జి.యఫ్’ ఫ్రాంఛైజీలో థర్డ్ పార్ట్ అనౌన్స్ చేసే అవకాశముందని తెలుస్తోంది. అమ్మ, రాకీ భాయ్, గరుడ, అధీరా, ఇనాయత్ ఖలీల్, రమికా సేన్ ఇలాంటి క్యారెక్టర్లు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...