Home Film News Prabhas-Rajamouli: మ‌రోసారి రాజ‌మౌళితో ప్ర‌భాస్ సినిమా.. ఆదిపురుష్ లైన‌ప్ మాములుగా లేదుగా..!
Film News

Prabhas-Rajamouli: మ‌రోసారి రాజ‌మౌళితో ప్ర‌భాస్ సినిమా.. ఆదిపురుష్ లైన‌ప్ మాములుగా లేదుగా..!

Prabhas-Rajamouli: బాహుబ‌లి సినిమాతో మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు పొందిన ప్ర‌భాస్ ఆ రేంజ్ హిట్ ఇంత‌వ‌ర‌కు అందుకోలేదు. ప్ర‌భాస్ న‌టించిన సాహో, రాధే శ్యామ్ చిత్రాలు బాక్సాఫీస్ ద‌గ్గర దారుణంగా నిరాశ‌ప‌రిచాయి. ఆదిపురుష్ అన్నా ప్ర‌భాస్‌ని గ‌ట్టెక్కిస్తుంది అనుకుంటే ఈ సినిమా మిక్స్ డ్ టాక్ తెచ్చుకోవ‌డంతో పాటు లేని పోని వివాదాల‌ని మూట‌గ‌ట్టుకుంటుంది. మ‌రోవైపు సినిమాకి కూడా వ‌సూళ్లు కూడా చాలా త‌గ్గాయి. బ్రేక్ ఈవెన్ అందుకోవ‌డం కూడా క‌ష్టం అనే ప‌రిస్థితి వచ్చింది. ఇక ప్ర‌భాస్ ప్ర‌స్తుతం న‌టిస్తున్న స‌లార్ పైనే అంద‌రు హోప్స్ పెట్టుకున్నారు. ఈ సినిమా కూడా ఫ్లాప్ అయితే ప్ర‌భాస్ రేంజ్ కాస్త త‌గ్గుతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

ఇక ప్ర‌భాస్ రాబోవు ఏడేళ్లలో  మైండ్ బ్లోయింగ్ లైన‌ప్‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రించేందుకు సిద్ధ‌మ‌య్యాడు ప్ర‌భాస్. స‌లార్ చిత్రంతో పాటు  నాగ్ అశ్విన్‌ డైరెక్షన్‌లో ప్రాజెక్ట్ కే చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని త్వ‌ర‌లోనే అల‌రించ‌నున్నాడు ప్ర‌భాస్. ఇక వీటి త‌ర్వాత అర్జున్ రెడ్డి డైరెక్టర్‌తో స్పిరిట్, మారుతి సినిమా రాజా డీలక్స్, పఠాన్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్‌తో సినిమా, ఆ త‌ర్వాత  దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళితో మ‌రో సినిమా కోసం పని చేయబోతున్నారని టాక్. గ‌తంలో ప్ర‌భాస్.. రాజమౌళితో మరో సినిమా ఉంటుంద‌ని తెలియ‌జేశాడు. అది బాహుబ‌లి 3 అయిన కావ‌చ్చు లేదంటే వేరు సినిమా అయిన అయి ఉండ‌వ‌చ్చు.

ఇలా వ‌రుస సినిమాల‌తో సంద‌డి చేయ‌బోతున్న ప్ర‌భాస్.. ఓ హాలీవుడ్ మూవీ కూడా చేసేందుకు సిద్ద‌మైన‌ట్టు టాక్. హాలీవుడ్‌‌లో భారీ చిత్రాల‌ను నిర్మించే యూనివ‌ర్స‌ల్ స్టూడియోస్ సంస్థ.. ఇప్పుడు ప్ర‌భాస్‌తో సినిమా చేసేందుకు సిద్ధంగా ఉంద‌ని టాక్ న‌డుస్తుంది. ప్ర‌భాస్ వంటి హీరోతో సినిమా చేస్తే..  ఆసియా మార్కెట్‌పై మంచి గ్రిప్ వస్తుందని హాలీవుడ్ సంస్థలు ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ట‌.ఇప్ప‌టికే ప్ర‌భాస్ తో చ‌ర్చ‌లు పూర్తి కాగా, త్వ‌ర‌లో దీనిపై ఓ క్లారిటీ అయితే రానుంద‌ని అంటున్నారు.

Related Articles

Как играть в слоты Pinup казино?

Как играть в слоты Pinup казино?

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...