Home Film News పూజా హెగ్డే తో జతకట్టనున్న నితిన్!
Film News

పూజా హెగ్డే తో జతకట్టనున్న నితిన్!

Pooja Hegde To Act In Nitin New Film

హీరో నితిన్ కి స్టార్ హీరోయిన్స్ తో జత కట్టటం కొత్తేమీ కాదు.. ఇప్పటిదాకా మంచి ఫామ్ లో ఉన్న హీరోయిన్స్ చాలా మందితోనే జత కట్టాడు. ఇలియానా, జెనీలియా వంటి భామలతో జోడీగా మంచి హిట్ లు కూడా కొట్టాడు. ఇష్క్ సినిమాలో నిత్యా మీనన్ తో చేసిన తర్వాత మళ్ళీ పెద్దగా పెద్ద హీరోయిన్స్ వైపు చూడలేదు అనిపించింది.

కానీ, ఆ సస్పెన్స్ కి ఇప్పుడు తెర వేయబోతున్నాడు నితిన్. ఈ మధ్య రిలీజ్ అయిన ‘చెక్’ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ తో.. ఆ తర్వాత తమిళ్ లో మంచి హిట్లు కొడుతున్న కీర్తి సురేష్ కి జంటగా రంగ్ దే సినిమాలో నటించాడు. ఇప్పుడు వాళ్ళ కన్నా మంచి ఫామ్ లో, క్రేజీ ఫాలోయింగ్ తో దూసుకుపోతున్న పూజా హెగ్డేకి జంటగా నటించబోతున్నాడు నితిన్.

వక్కంతం వంశీ ఈ సినిమాని డైరెక్ట్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. నితిన్ కి ఒక స్వంత బ్యానర్ కూడా ఉంది. అదే శ్రేష్ట్ మూవీస్. ఆ బ్యానర్ కిందనే ఈ సినిమా చేయబోతున్నట్లు.. ఇందుకోసం పూజాని సంప్రదించినట్లు కూడా తెలిసింది. ఐతే, ఈ మూవీ కోసం పూజా చాలా పెద్ద మొత్తం రెమ్యూనరేషన్ కింద తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. పూజ కాస్త అడ్వాన్స్ తీసుకుని ఈ ప్రాజెక్ట్ కి సైన్ కూడా చేసిందట!

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...