Home Film News Bunny: ఆర్య కన్నా ముందు 96 క‌థ‌లు విన్న బ‌న్నీ.. విని విని నీర‌సించిపోయాడ‌ట‌..!
Film News

Bunny: ఆర్య కన్నా ముందు 96 క‌థ‌లు విన్న బ‌న్నీ.. విని విని నీర‌సించిపోయాడ‌ట‌..!

Bunny: ప్ర‌స్తుతం టాలీవుడ్ టాప్ హీరోల‌లో ఒక‌రిగా అల్లు అర్జున్ ఉన్న విష‌యం తెలిసిందే. గంగోత్రి సినిమాతో సినీ ప‌రిశ్ర‌మ‌కి హీరోగా ప‌రిచ‌యం అయిన అల్లు అర్జున్ ఆ త‌ర్వాత వైవిధ్య‌మైన సినిమాలు చేస్తూ స్టార్ హీరోగా ఎదిగారు.  పుష్ప‌తో బ‌న్నీ పాన్ ఇండియా స్టార్‌గా మారారు. ఇప్పుడు పుష్ప‌2 చిత్రంతో బిజీగా ఉన్నాడు. అయితే అల్లు అర్జున్‌కి సంబంధించిన ఓ విష‌యం ఇప్పుడు నెట్టింట తెగ హ‌ల్చ‌ల్ చేస్తుంది. గంగోత్రి త‌ర్వాత బ‌న్నీ చేసే సినిమాకి ముందు చాలా పెద్ద కథే జరిగింది. గంగోత్రితో ఓ మోస్త‌రు హిట్ అందుకున్న అల్లు అర్జున్ తన రెండవ సినిమాగా మాస్ సినిమా చెయ్యాలా?, లేదా లవ్ స్టోరీ చెయ్యాలా..? , అనే సందిగ్ధం లో ఉన్నాడు. ఆ క్ర‌మంలోనే ఆయన దాదాపుగా 96 కథలను విన్నాడట.
గంగోత్రి చిత్రం తర్వాత 96 కథలు విని విసిగిపోయిన బ‌న్నీకి దిల్ రాజు ఆఫీస్ నుండి కాల్ వ‌చ్చింది.  దిల్ రాజు తన దగ్గర ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్స్ లో ఒకరి దగ్గర మంచి కథ ఉందని, ఆ క‌థ నీకు బాగా సూట్ అవుతుంద‌ని చెప్పాడ‌ట‌. అప్ప‌టికే క‌థ‌లు విని విసిగిపోయిన బ‌న్నీ దిల్ రాజు మాటకి గౌరవం ఇచ్చి   కథని విన్నాడు. క‌థ విన్న వెంటనే సుకుమార్ ని కౌగలించుకొని ఈ సినిమా మనం చేస్తున్నాం అని అన్నాడట అలా ప్రారంభమైన ఆర్య  సినిమా ఎంత సెన్సేష‌న్ క్రియేట్ చేసిందో మ‌నంద‌రికి తెలిసిందే. చిత్ర క‌థ‌లో అల్లు అరవింద్  కొన్ని మార్పులు చెప్పగా ఆ మార్పులు చేయడానికి సుకుమార్ అంగీకరించారు. చిరంజీవికి కూడా ఆర్య సినిమా కథ  చాలా బాగా న‌చ్చింది.
సినిమా ఓకే కాగానే సంగీత ద‌ర్శ‌కుడిగా దేవి శ్రీని ఎంపిక చేశారు. త‌క్కువ స‌మ‌యంలోనే  ఆయ‌న  ఈ సినిమాకు సంబంధించిన ట్యూన్లను సిద్ధం చేశారు. 120 రోజుల పాటు ఈ సినిమా షూట్ జరగ‌గా, మొద‌ట ఈ చిత్రానికి  నెగిటివ్ టాక్ వ‌చ్చింది. కాని త‌ర్వాత త‌ర్వాత  ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతోనే బన్నీకి స్టైలిష్ స్టార్ ఇమేజ్ దక్క‌గా, అక్క‌డ నుండి దూసుకుపోయాడు.. 4 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా కళ్లు చెదిరే స్థాయిలో కలెక్షన్లను సాధించి  ఔరా అనిపించింది. ఈ సినిమా క‌థ ముందుగా  ర‌వితేజ‌, నితిన్, ప్ర‌భాస్ ల ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌గా  వారు రిజెక్ట్ చేయ‌డంతో అది బ‌న్నీ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చింది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...