Home Film News Sreeleela KGF Hero: శ్రీలీల‌కి కేజీఎఫ్ హీరో వ‌రుస‌కి బావ అవుతాడా.. అదెలా అంటే..!
Film News

Sreeleela KGF Hero: శ్రీలీల‌కి కేజీఎఫ్ హీరో వ‌రుస‌కి బావ అవుతాడా.. అదెలా అంటే..!

Sreeleela KGF Hero: ప్ర‌స్తుతం టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో ఒకే ఒక్క హీరోయిన్ బాగా వినిపిస్తుంది. ఏ సినిమా చూసిన కూడా ఆ సినిమాలో ఆమె త‌ప్ప‌క ఉంటుంది. చిన్న హీరోలు, పెద్ద హీరోలు అంద‌రిని క‌వర్ చేస్తూ ఇప్పుడు 10 నుండి 12 సినిమాల‌తో బిజీగా ఉంది అందాల ముద్దుగుమ్మ శ్రీలీల‌. కర్ణాటకలోని బెంగుళూరులో పుట్టి పెరిగిన ఈ అమ్మ‌డు డాక్ట‌ర్  చ‌దివింది. కిస్ అనే క‌న్న‌డ మూవీతో సినీ కెరియర్ ప్రారంభించిన  శ్రీలీల‌ తెలుగులో పెళ్లి సందDతో టాలీవుడ్ కు ప‌రిచ‌యం అయింది. తొలి సినిమా ఓ మోస్త‌రు విజ‌యం సాధించ‌గా, రెండో సినిమాకి ర‌వితేజ న‌టించిన ధ‌మాకాలో క‌థానాయిక‌గా న‌టించే అవ‌కాశం ద‌క్కించుకుంది.
ధ‌మాకి చిత్రంతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న శ్రీలీల ఇందులో త‌న‌ నటనతో, డ్యాన్స్ తో మంచి మార్కులు వేయించుకుంది. ఈ సినిమా త‌ర్వాత శ్రీలీలకి ఆఫ‌ర్స్ క్యూ క‌ట్టాయి.  ప్ర‌స్తుతం తెలుగులో శ్రీ‌లీల మ‌హేష్ బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్, బాలకృష్ణ వంటి స్టార్ హీరోల‌తో నటిస్తునే.. యంగ్ హీరోలతో కూడా న‌టిస్తుంది.అయితే తాజాగా శ్రీలీల‌కి సంబంధించిన ఓ వార్త నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. కేజీయఫ్ సిరీస్ తో నేషనల్ వైడ్ పాపులర్ అయిన కన్నడ స్టార్ హీరో యశ్ కు, శ్రీలీల మ‌ర‌ద‌లు అవుతుంద‌ని అంటున్నారు.
నిజానికి వీరిద్ద‌రి బంధుత్వం కాదు కాని, యశ్ కుటుంబం, శ్రీలీల కుటుంబం మధ్య సన్నిహిత్యం వ‌ల‌న య‌ష్‌ని శ్రీలీల బావ అని పిలుస్తుంద‌ట‌. శ్రీ‌లీల త‌ల్లి స్వర్ణలత బెంగళూరులో ఫేమస్ గైనకాలజిస్ట్ కాగా, ఆమెకి  వైద్య రంగంలో మంచి పేరుంది. శ్రీలీల పుట్టిన త‌ర్వాత భ‌ర్త‌తో విబేధాల వ‌ల‌న విడిపోయిన స్వ‌ర్ణ‌ల‌త  బెంగ‌ళూరులో వైద్య వృత్తిని కొనసాగిస్తూ వ‌స్తుంది. అయితే య‌ష్   భార్య  రాధిక పండిత్.. తను గర్భిణిగా ఉన్న సమయంలో స్వర్ణలత ద‌గ్గ‌ర‌ వైద్య పరీక్షలు చేయించుకొని ఆమె చేత‌ డెలివరీ చేయించుకున్నార‌.ట ఈ క్ర‌మంలో వారి మ‌ధ్య‌ స‌న్నిహితం ఏర్ప‌డ‌డం, అప్పటి నుంచి రాధికను అక్కా అని యష్ ను బావ అని శ్రీలీల పిలుస్తుందట. ఇలా యష్ శ్రీలీలకు బావ, మ‌ర‌ద‌ళ్లు అయిపోయారు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...