Home Film News Rajamouli: ట్రెండ్ మార్చిన రాజ‌మౌళి.. యాడ్స్‌కి ఎంత పారితోషికం తీసుకుంటున్నాడంటే..!
Film News

Rajamouli: ట్రెండ్ మార్చిన రాజ‌మౌళి.. యాడ్స్‌కి ఎంత పారితోషికం తీసుకుంటున్నాడంటే..!

Rajamouli: తెలుగు సినిమా ఖ్యాతిని ద‌శ‌దిశ‌ల‌కి పాకేలా చేసిన ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి. ఆయ‌న కెరీర్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క ఫ్లాప్ కూడా లేదు. ఇటీవ‌ల ట్రిపుల్ ఆర్ సినిమా తీసి ఆ సినిమాలోని సాంగ్‌కి ఆస్కార్ అవార్డ్ కూడా ద‌క్కేలా చేశాడు. రాజ‌మౌళి ఏదైన సినిమా టేకాఫ్ చేశాడంటే  అది హిట్ అవ్వాల్సిందే… బాక్సాఫీస్ ద‌గ్గ‌ర‌ కలెక్షన్ల వర్షం కురవాల్సిందే. స్టార్ హీరోలు సైతం ఆయనతో సినిమా చేయాలని క‌ళ్ల‌ల్లో ఒత్తులు వేసుకొని మ‌రీ ఎదురు చూస్తున్నారు. ప్ర‌స్తుతం సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుతో ఓ సినిమా చేయనుండ‌గా, ఈ సినిమా కోసం రాజ‌మౌళి ఎన్ని సంవ‌త్సరాల స‌మ‌యం తీసుకుంటాడో చెప్ప‌డం క‌ష్ట‌మే. మ‌హేష్ బాబు త‌ర్వాత రాజ‌మౌళి.. ఎన్టీఆర్, ప్ర‌భాస్‌ల‌తో మ‌ళ్లీ సినిమాలు చేయ‌నున్నార‌ని అంటున్నారు.

రాజ‌మౌళి ఖ్యాతి ఖండాంతరాలు దాట‌గా, ఆయ‌న క్రేజ్‌ని ఉప‌యోగించుకునేందుకు ప‌లు యాడ్ కంపెనీలు పోటిప‌డుతున్నాయి. ఇటీవ‌ల రాజ‌మౌళి.. ఒప్పో కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా మారడం మ‌నం చూశాం.  తొలిసారిగా కమర్షియల్ యాడ్ లో నటించి వావ్ అనిపించాడు. సాదార‌ణంగా రాజ‌మౌళి చాలా సింపుల్ గా క‌నిపిస్తారు. కాని యాడ్ లో మాత్రం అల్ట్రా స్టైలిష్ లుక్ లో క‌నిపించి అబ్బుర‌ప‌రిచాడు. రాజ‌మౌళి హీరోగా కూడా చేయ‌వ‌చ్చు అని ప‌లువురు కామెంట్ చేశారు.  ఒప్పో కొత్త మోడల్ రెనో 10 సిరీస్ ఫోన్  కోసం రాజమౌళి ఆ యాడ్ చేయ‌గా, 45 సెకన్ల నిడివి ఉన్న ఈ యాడ్ కోసం రాజమౌళి రూ.3 కోట్లు తీసుకున్నాడని టాక్ వినిపిస్తోంది.

రాజ‌స్తాన్‌లో యాడ్ షూటింగ్ జ‌ర‌గ‌గా, దీని కోసం కుటుంబంతో కలిసి అక్క‌డికి వెళ్లారు రాజ‌మౌళి. రాజ‌స్తాన్‌లో  యాడ్ షూట్ తో పాటు వెకేషన్ ను కూడా ఫుల్‌గా ఎంజాయ్ చేశారు. ఇక రాజ‌మౌళి త‌న సినిమాల కోసం ఇప్పుడు దాదాపు రూ.150 కోట్లు పారితోషికం  తీసుకుంటారని ఫిల్మ్ నగర్ లో వార్తలు వ‌స్తున్నాయి. మ‌హేష్ సినిమా కోసం రాజ‌మౌళి త‌న రెమ్యున‌రేష‌న్‌ని మ‌రింత పెంచిన‌ట్టుగా టాక్. చిత్రాన్ని రెండు భాగాలుగా రాజ‌మౌళి తెర‌కెక్కించ‌నున్నార‌ని,  సినిమా క్లైమాక్స్ కూడా అందుకు సపోర్ట్ చేస్తోందని రచయిత విజయేంద్రప్రసాద్ ఇటీవ‌ల బాలీవుడ్ మీడియాకు తెలిపారు.

Related Articles

దివంగత శ్రీదేవికి.. ఎన్టీఆర్ దేవర సినిమాకు ఉన్న లింక్ ఏంటో తెలుసా..? కొరటాల స్కెచ్ మామూలుగా లేదుగా..!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్లో ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ దేవర.. పాన్ ఇండియా...

అది నాకు ఎప్పుడో తెలుసు.. నాగచైతన్య హీరోయిన్ సాయి పల్లవి గురించి సమంత హాట్‌ కామెంట్స్..!

ప్రస్తుతం ఇదే వార్త చిత్ర పరిశ్రమలో ఎంతో వైరల్ గా మారింది. ఇన్ని రోజులు ఎంతో...

బిగ్ బ్రేకింగ్: “షణ్ముఖ్” కేసులో బయటపడ్డ కొత్త కోణం.. అన్నిటికీ కారణం “యాంకరే” నా..?

షణ్ముఖ్ జస్వంత్ ఈ పేరు గురించి అందరికీ ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. యూట్యూబ్లో వచ్చిన...

హీరో తేజ స‌జ్జ త‌ల్లిదండ్రులు ఎవ‌రు.. సినిమా ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. !?

తేజ స‌జ్జ‌.. ప్ర‌స్తుతం ఈ యువ హీరో పేరు మారుమోగిపోతోంది. 2024లో సంక్రాంతి పండుగ కానుక‌గా...