Home Film News RamCharan Upasana Daughter Name: రామ్ చ‌ర‌ణ్‌- ఉపాస‌న‌ల కూతురికి భ‌లే వెరైటీ పేరు పెట్టారుగా.!
Film News

RamCharan Upasana Daughter Name: రామ్ చ‌ర‌ణ్‌- ఉపాస‌న‌ల కూతురికి భ‌లే వెరైటీ పేరు పెట్టారుగా.!

RamCharan Upasana Daughter Name: రామ్ చ‌ర‌ణ్ ఉపాస‌న‌ల కూతురు ఈ నెల20న పుట్టిన విష‌యం తెలిసిందే. చిన్నారి పుట్టిన‌ప్ప‌టి నుండి ఆ పాప‌కి సంబంధించి అనేక విష‌యాలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. పాప జాత‌కం చాలా బాగుంద‌ని, వారి ఫ్యామిలీకి మంచి కీర్తి ప్ర‌తిష్ట‌లు తీసుకొచ్చి పెడుతుంద‌ని ప‌లువురు జాత‌కం చెప్పారు. ఇక పాప‌కి ఏ పేరు పెడ‌తారా అని కొద్ది రోజులుగా చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. అయితే ఎవ‌రు ఊహించని విధంగా పేరు పెట్టారు. చాలా మంది మెగా మనవరాలిని ‘లిటిల్ మెగా ప్రిన్సెస్’ అంటూ  పిలుచుకుంటూ వ‌స్తున్నారు. అయితే నేడు బార‌సాల వేడుకులో చిన్నారికి పేరు ఫిక్స్ చేసి ఆ పేరేంటో చిరంజీవి త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు.

రామ్ చ‌ర‌ణ్ ఉపాస‌న‌ల కూతురికి   ‘క్లిన్ కారా కొణిదెల అని ఫిక్స్ చేసిన‌ట్టు చిరు తెలియ‌జేశారు. అయితే ఈ పేరు వినడానికి కాస్త విచిత్రంగా ఉన్నప్పటికీ  చాలా ట్రెండీగా కూడా ఉంది. అయితే ఈ పేరుని సాంప్రదాయ బద్దంగా చూసి ఫిక్స చేశార‌ట‌. మ‌న‌కు  ఎంతో పవిత్రమైన, శక్తివంతమైన అమ్మవారి లలితా సహస్రనామ స్తోత్రం నుంచి పేరుని తీసుకున్నార‌ని తెలుస్తుంది. క్లిన్ కారా అంటే ప్రకృతి మరో రూపం అని అర్థం వస్తుంది అని అంటున్నారు.  మహాశక్తి స్వరూపిణి శక్తి  పాపకి అందేలా ఈ నామకరణం చేసి ఉంగరం కూడా తొడిగినట్లు చిరు త‌న ట్విట్ట‌ర్‌లో తెలియ‌జేశారు. ఆ అమ్మ‌వారి శక్తితో పాప ఎదుగుతుందని చిరు తెలియ‌జేశారు. చిరు ట్వీట్‌కి భారీ ఎత్తున స్పందన వ‌స్తుంది.

పేరు చాలా బాగుంద‌ని ప‌లువురు త‌మ కామెంట్స్ లో తెలియ‌జేస్తున్నారు. ఈ కార్య‌క్ర‌మం ఉపాస‌న త‌ల్లిగారింట్లో జ‌రిగిన‌ట్టు తెలుస్తుంది. ఇక వేడుక జరిగే ప్రదేశాన్ని ఈవెంట్ ప్లానర్స్ అత్యంత సుందరంగా అలంక‌రించారు. పచ్చని ఆకులు, తెల్లటి పూలు మధ్యలో ఓ పెద్ద చెట్టును సైతం ఏర్పాటు చేసి చాలా నాచురల్ గా ఉండేటట్లు డెకరేట్  చేశారు. ఇప్ప‌టికే ఈ వేడుక ఏర్పాట్లకు సంబంధించిన వీడియోలను ఉపాసన తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయ‌డంతో పాటు వాటికి  ‘‘మా ముద్దుల కూతురు పేరు పెట్టే కార్యక్రమం’’ అంటూ క్యాప్ష‌న్ పెట్టింది. ఏదేమైన మ‌రోసారి మెగా ప్రిన్సెస్ పేరు ఇప్పుడు ట్రెండింగ్‌గా మారింది.

Related Articles

Betper bahis sitesi guncel giris 2023

Betper bahis sitesi guncel giris 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...