Home Special Looks స్టార్స్ కి వాయిస్ ఇచ్చిన ఈ డబ్బింగ్ ఆర్టిస్ట్ లు మీకు తెలుసా…?
Special Looks

స్టార్స్ కి వాయిస్ ఇచ్చిన ఈ డబ్బింగ్ ఆర్టిస్ట్ లు మీకు తెలుసా…?

Are You Aware Of These Lesser Known Dubbing Artists

సినిమాల్లో నటీనటుల నటనను మనం ఎంతగా ఎంజాయ్ చేస్తామో.. వాళ్ళ voices కి కూడా మనం అలాగే mesmerize అవుతాం. వాళ్ళ నటన మనల్ని ఎంతలా ప్రభావితం చేసి.. వాళ్ళని గుర్తుంచుకునేలా చేస్తుందో వాళ్ళ voices కూడా మనపై అలాంటి ప్రభావమే చూపిస్తాయి. కానీ మనకు screen మీద నటించే వాళ్ళు మాత్రమే కనిపిస్తారు. వాళ్ళకు తమ voice తో డబ్బింగ్ ఇచ్చేవాళ్ళు కనిపించకపోగా వాళ్ళ పేర్లు కూడా మనకి తెలిసి ఉండవు. సొంత భాషలో నటించే కొందరు నటులు తమ roles కి తామే డబ్బింగ్ చెప్పుకుంటూ ఉంటారు. కానీ చాలామందికి వేరే వాళ్ళే చెప్తూ ఉంటారు. ముఖ్యంగా ఇతర భాషల నుండి ఇక్కడికి వచ్చి నటించే వాళ్ళకి డబ్బింగ్ తప్పనిసరి అవుతుంది. Bilingual, trilingual and dubbed films లలో నటీనటులుగా వాళ్ళ success and popularity వెనక ఎవరూ గుర్తించని శ్రమ డబ్బింగ్ ఆర్టిస్ట్ లది. సో.. మన favourite stars డబ్బింగ్ ఇచ్చిన ఆ ఆర్టిస్ట్ ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం…

  • సవితా రెడ్డి
    జీన్స్ లో ఐశ్వర్యరాయ్ కి చెప్పడంతో ఎంతో పాపులర్ అయింది సవిత. ఖుషిలో భూమికకి ఇచ్చిన డబ్బింగ్ తో తెలుగులో కూడా ఒక sensation అయింది. కలిసుందాం రా లో సిమ్రన్ కి డబ్బింగ్ చెప్పడం మొదలుపెట్టిన ఆమె ఆ తర్వాత సిమ్రన్ నటించిన అన్ని సినిమాలకి తానే డబ్బింగ్ చెప్పింది. నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో ఆర్తి అగర్వాల్ ఇచ్చిన డబ్బింగ్ తో ఆమెకి నంది అవార్డ్ వచ్చింది. వర్షం సినిమాలో Trisha కి, నువ్వే కావాలి లో Richa కి , అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి లో Asin కి, చంద్రముఖిలో జ్యోతిక కి కూడా ఆమే డబ్బింగ్ చెప్పింది. అలా 2012 వరకు ఎంతో మంది హీరోయిన్లకి ఆమె డబ్బింగ్ చెప్పింది. ఆమె ఈ dubbings కి గాను అటు తమిళనాడు, ఇటు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల నుండి రాష్ట్రస్థాయి అవార్డులు అందుకుంది.
  • శిల్ప
    సౌందర్య నటించిన అన్ని సినిమాలకి ఆమే డబ్బింగ్ చెప్పేవారు. సౌందర్య స్వయంగా నా డబ్బింగ్ శిల్పనే చెప్పాలి అని అడిగేవారట. అంతలా డబ్బింగ్ లో పాపులర్ అయిన శిల్ప గారు.. లైలా, ఆమని, సిమ్రాన్ ఇలా చాలామంది హీరోయిన్స్ కి డబ్బింగ్ చెప్పారు. పాతతరం హీరోయిన్స్ మాత్రమే కాదు.. ప్రస్తుత నటి అనుష్కకి కూడా ఆమే డబ్బింగ్ చెప్తారు. అరుంధతి సినిమాలో అనుష్కకి ఇచ్చిన వాయిస్ ఎంత పాపులర్ అయిందో మనకి తెలుసు. ఇంకా సీరియల్స్ లో పెద్ద పాత్రలకి కూడా ఆమె డబ్బింగ్ చెప్తుంటారు. ఆమె కూడా ఒకప్పుడు సీరియల్స్ లో నటించారు.
  • సౌమ్య
    అనుష్క, అమలా పాల్, కాజల్, నయనతార, భావన వంటి హీరోయిన్స్ కి ఈమె డబ్బింగ్ చెప్పారు. ముఖ్యంగా లక్ష్యం సినిమాలో అనుష్కకి ఇచ్చిన వాయిస్ తో ఒక నంది అవార్డ్, మహాత్మా సినిమాలో భావనకి ఇచ్చిన వాయిస్ తో మరో అవార్డ్ గెలుచుకుంది సౌమ్య శర్మ. Screen play writer కూడా అయిన ఆమె ఒకప్పుడు రేడియో మిర్చీ లో RJ గా కూడా చేసారు.
  • హరిత
    సవితా రెడ్డికి competition ఇచ్చిన మరో డబ్బింగ్ ఆర్టిస్ట్. రకుల్ ప్రీత్ సింగ్, రాశి ఖన్నా, ఇలియానా, లెజెండ్ సినిమాలో రాధికా ఆప్టే కి, సోనాల్ చౌహాన్ ఇద్దరికీ హరితే డబ్బింగ్ చెప్పింది. మాధవీలతకి కూడా డబ్బింగ్ తానే చెప్తుంది.

ఇక పాటలు పాడేవాళ్ళకి వారి గొంతే plus కాబట్టి.. డబ్బింగ్ ఆర్టిస్ట్ లుగా కూడా పనిచేయడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. అలా పాడుతూ డబ్బింగ్ చెప్పే వాళ్ళలో వీళ్ళున్నారు…

  • హేమచంద్ర
    ముఖ్యంగా తమిళ్ నుంచి తెలుగుకి డబ్బింగ్ అయ్యే హీరోలకి హేమచంద్రనే డబ్బింగ్ చెప్తూ ఉంటాడు. స్నేహితుడు సినిమాలో విజయ్ కి డబ్బింగ్ తానే చెప్పాడు. ఆర్య, అరవింద స్వామి, శివ కార్తికేయన్, మాధవన్ లకి డబ్బింగ్ ఇచ్చేది హేమచంద్రనే.
  • శ్రావణ భార్గవి
    గబ్బర్ సింగ్, రామయ్యా వస్తావయ్యా సినిమాల్లో శృతి హాసన్ కి డబ్బింగ్ ఈమే చెప్పారు. ఈగ సినిమాలో సమంత కి కూడా తానే డబ్బింగ్ చెప్పింది.
  • సునీత
    సింగర్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న సునీత డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా ఎన్నో సినిమాలకి పనిచేశారు. సోనాలి బింద్రే, శ్రియ, స్నేహ, సన, ఛార్మిలకి తన వాయిస్ ఇచ్చింది. చూడాలని ఉంది సినిమాలో సౌందర్యకి ఇచ్చిన వాయిస్ హీరోయిన్ గా ఆమెకు తెలుగులో గుర్తింపుని తీసుకువచ్చింది.
  • లిప్సిక
    హెబ్బా పటేల్ కి డబ్బింగ్ చెప్తుంది. హెబ్బా అన్ని సినిమాలకి లిప్సికానే డబ్బింగ్ చెప్పింది. ఇంకా సాయేషా, మెహ్రీన్ వంటి కొత్త actresses కి కూడా తానే డబ్బింగ్ చెప్తోంది.
  • చిన్మయి
    మనం సినిమాలో సమంతకి డబ్బింగ్ ఇచ్చి ఎంతో గుర్తింపు తెచ్చుకున్న చిన్మయి పూజ హెగ్డే, లావణ్య త్రిపాఠి, సమీరా రెడ్డికి కూడా డబ్బింగ్ చెప్పారు. ఏ మాయ చేసావే లో సమంతకి ఇచ్చిన డబ్బింగ్ తో ఆమె నంది అవార్డ్ కూడా గెలుచుకున్నారు.

అలాగే… ఒకప్పటి స్టార్ హీరోయిన్ సరిత ఇతర హీరోయిన్స్ రమ్యకృష్ణ, సౌందర్య, విజయశాంతి, నగ్మా లకి డబ్బింగ్ చెప్పింది. హీరో నితిన్ కి మరో హీరో శివాజీనే డబ్బింగ్ చెప్పేవారు.

Lion King లో Simba గా నాని…
2019 లో 3D animated film గా విడుదలైన lion king సినిమా తెలుగు version లో ‘Simba’ అనే సింహం పాత్రకి natural star నాని డబ్బింగ్ చెప్పారు. ‘Scar’ అనే విలన్ పాత్రకి versatile artist జగపతిబాబు డబ్బింగ్ చెప్పగా, ‘Timon ‘ అనే ముంగిస పాత్రకి ఆలీ, ‘Pumba’ అనే అడవిపంది పాత్రకి బ్రహ్మానందం డబ్బింగ్ చెప్పారు. మణిరత్నం దర్శకుడిగా తీసిన ఓకే బంగారం సినిమాలో దుల్కర్ సల్మాన్ కి నాని నే డబ్బింగ్ ఇచ్చారు.

Frozen 2 లోనూ…
2019 లోనే release అయిన మరో Disney animated film Frozen 2 మూవీకి కూడా డబ్బింగ్ చెప్పారు మన స్టార్స్. ఇందులో lead role ‘Elsa’ కి నిత్యా మీనన్ డబ్బింగ్ చెప్తే.. Baby elsa కి మహేష్ బాబు daughter సితార డబ్బింగ్ చెప్పింది. ఇదే మూవీలో Olaf అనే మరో పాత్రకి ‘పెళ్ళిచూపులు’ ఫేం ప్రియదర్శి పులికొండ డబ్బింగ్ చెప్పాడు.

ఈ మధ్యే విడుదలైన Soorarai Pottru తెలుగు version ఆకాశం నీ హద్దురా లో సూర్య కి సత్యదేవ్ డబ్బింగ్ చెప్పారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

ప‌ట్టుమ‌ని ప‌ది హిట్లు కూడా లేని రామ్ చ‌ర‌ణ్ గ్లోబ‌ల్ స్టార్ ఎలా అయ్యాడు.. చ‌ర‌ణ్ రిజెక్ట్ చేసిన సినిమాలేవో తెలుసా?

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ అంటే తెలియ‌ని సినీ ప్రియులు ఉండ‌రు. సామాన్యుడి నుంచి...

హీరో తేజ స‌జ్జ త‌ల్లిదండ్రులు ఎవ‌రు.. సినిమా ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. !?

తేజ స‌జ్జ‌.. ప్ర‌స్తుతం ఈ యువ హీరో పేరు మారుమోగిపోతోంది. 2024లో సంక్రాంతి పండుగ కానుక‌గా...

ఎన్టీఆర్ ను అగ్ర‌హీరోగా మార్చిన అడ‌వి రాముడు అప్ప‌ట్లో ఎంత వ‌సూల్ చేసింది.. అడవి రాముడు పేరిట ఉన్న రికార్డులు ఏంటి?

విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, తెలుగువారి గుండెల్లో నిలిచిన మహా నేత స్వర్గీయ నందమూరి తారక రామారావు...

సినిమాల్లోకి రాక‌ముందు నాగ శౌర్య ఏం చేసేవాడు.. ఆ హీరోయిన్ల‌తో ఎఫైర్‌ నిజ‌మేనా..!?

టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ హ్యాండ్స‌మ్ హీరోల్లో నాగ శౌర్య ఒక‌రు. ఊహలు గుసగుసలాడే సినిమాతో...