Home Film News పుష్ప టీం నుంచి ఒక కీలకమైన అప్డేట్!
Film News

పుష్ప టీం నుంచి ఒక కీలకమైన అప్డేట్!

An Important Update From Pushpa Team

అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమాల్లో సుకుమార్ మూవీ పుష్ప కూడా ఒకటని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఈ మూవీ రెండు భాగాలుగా రాబోతుందన్న వార్త బయటికి వచ్చింది. ముందుగా మొదటి భాగాన్ని పూర్తి చేసి తర్వాత రెండో పార్ట్ గురించి ఆలోచించే పనిలో ఉన్నారు. అందుకే తొందర తొందరగా ఈ మూవీని పూర్తి చేయాలన్న తొందరలో ఉన్నట్లు తెలుస్తోంది సుకుమార్ టీం.

పాన్ ఇండియా సినిమాగా వస్తున్న ఈ మూవీ ఒకేసారి ఐదు భాషల్లో విడుదల ఔతున్న విషయం తెలిసిందే. ఎలాగైనా ఈ సంవత్సరం ముగిసేలోగా మూవీని రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. కానీ, ఇంతలోనే ఒక అనుకోని సంఘటన జరిగింది. అదే.. మూవీ డైరెక్టర్ సుకుమార్ గారికి డెంగ్యూ జ్వరం రావడం. ఇలా జరుగుతుందని ఊహించకపోవడంతో.. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత మూవీ చాలా వేగవంతంగా పూర్తవుతుంది అనుకున్నప్పటికీ అవదేమోనన్న భయం పట్టుకుంది నిర్మాతలకి.

కానీ, కొన్ని రోజుల్లోనే ఒక గుడ్ న్యూస్ కూడా బయటికి వచ్చేసింది. అదే సుకుమార్ ఇప్పుడు పూర్తిగా తన సిక్నెస్ నుంచి బయటపడ్డారని ఇప్పుడు మూవీ షూటింగ్ వేగంగా చేసుకోవచ్చన్న నమ్మకం మళ్ళీ అందరికీ కలిగింది. ఫహాద్ ఫాసిల్ కూడా కీలకపాత్ర పోషిస్తున్న ఈ మూవీ సంచలనం సృష్టిస్తుంది అన్న అంచనాలు ఉన్నాయి. బాహుబలితో ప్రభాస్ సౌత్ లో పెద్ద స్టార్ గా ఎదిగిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ప్రభాస్ సరసన అల్లు అర్జున్ చేరే ప్రయత్నంలో ఉన్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...