Home Film News SIR Teaser : ‘విద్య అనేది దేవుడికి పెట్టే నైవేద్యంతో సమానం’..
Film News

SIR Teaser : ‘విద్య అనేది దేవుడికి పెట్టే నైవేద్యంతో సమానం’..

SIR Teaser
SIR Teaser

SIR Teaser: కోలీవుడ్ యంగ్ స్టార్, వెర్సటైల్ యాక్టర్ ధనుష్ ‘సార్’ (SIR) మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. తమిళ్‌లో ‘వాతి’ (Vaathi) పేరుతో తెరకెక్కిస్తున్నారు. యువ దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్షన్లో.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ సినిమాస్ బ్యానర్ల మీద సూర్యదేవర నాగ వంశీ – సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ధనుష్ లెక్చరర్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు.

జూలై 28 ధనుష్ పుట్టినరోజు.. ఈ సందర్భంగా ఒకరోజు ముందుగా ‘సార్’ ఫిలిం నుండి ధనుష్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా మంచి స్పందన వచ్చింది. గురువారం (జూలై 28) ఉదయం సెకండ్ లుక్ కూడా విడుదల చేశారు. సాయంత్రం ‘సార్’ & ‘వాతి’ టీజర్ రిలీజ్ చేశారు టీమ్.

టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. విద్యావ్యవస్థ గొప్పతనంతో పాటు అందులోని లోపాలను ఎత్తిచూపుతూ ఆకట్టుకునే కథ రాసుకున్నారు దర్శకుడు. ‘విద్య అనేది గుడిలో దేవుడికి పెట్టే నైవేద్యంతో సమానం సార్.. పంచండి.. ఫైవ్ స్టార్ హోటల్‌లో డిష్‌లాగా అమ్మకండి’ అనే డైలాగ్ అలరిస్తుంది.

యువరాజ్ విజువల్స్, జి.వి.ప్రకాష్ కుమార్ బ్యాగ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. ఈ టీజర్‌కి తెలుగు, తమిళ్ ఆడియన్స్ నుండి, ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ‘సార్’ చిత్రాన్ని అక్టోబర్‌లో విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు..

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...