Home Film News Tanikella Bharani: ఏంటి.. ఆ సినిమా చూశాక ఆడ‌వాళ్లు త‌నికెళ్ల భ‌ర‌ణిని కొట్ట‌డానికి వ‌చ్చారా..!
Film News

Tanikella Bharani: ఏంటి.. ఆ సినిమా చూశాక ఆడ‌వాళ్లు త‌నికెళ్ల భ‌ర‌ణిని కొట్ట‌డానికి వ‌చ్చారా..!

Tanikella Bharani: సీనియర్ నటుడు, రచయిత తనికెళ్ల భరణి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఎన్నో వైవిధ్య‌మైన పాత్ర‌లు పోషించి మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించుకున్నారు. గాయ‌కుడిగా కూడా త‌నికెళ్ల భ‌ర‌ణికి మంచి పేరు ఉంది. అయితే ఆయ‌న‌కి ఓ యూట్య‌బ్ ఛానెల్ ఉండ‌గా, దీనిని తొమ్మిదేళ్ల క్రితం  మొదలుపెట్టారు. ఇటీవ‌ల ఈ ఛానెల్‌ల‌లో సినీ ప్ర‌ముఖుల గురించి, సినిమా షూటింగ్ స‌మ‌యంలో జ‌రిగిన కొన్ని సంఘ‌ట‌న‌ల గురించి చెప్పుకొస్తున్నారు. ఈ క్ర‌మంలోనే త‌న‌ని కొట్ట‌డానికి ఆడవాళ్లు వ‌చ్చార‌ని తెలియ‌జేశారు త‌నికెళ్ల‌భ‌ర‌ణి.

సినిమాల‌లో చాలా క‌ఠినంగా, భ‌యంక‌రంగా కనిపించే త‌నికెళ్ల భ‌ర‌ణి బ‌య‌ట మాత్రం చాలా సున్నిత‌మైన మ‌నిషి.ఆయ‌న ఏ పాత్ర చేసిన ఆ పాత్రకి ప్రాణం పోసేవారు. మాతృదేవోభవ వంటి సూప‌ర్ హిట్ సినిమా లో హీరోయిన్ ని ఏడిపించే  కిరాతకమైన విలన్ పాత్రలో త‌నికెళ్ల భ‌ర‌ణి నటించారు. ఈ చిత్రం భారీ విజ‌యాన్ని న‌మోదు చేసుకోగా, ఎక్క‌డ చూసిన ఈ సినిమా గురించే చ‌ర్చ‌లు న‌డిచేవి. మ‌హిళా ప్రేక్ష‌కులు ఈ మూవీని బాగా ఆద‌రించారు. సాధార‌ణంగా సినిమా ప్ర‌భావం ప్రేక్ష‌కుల‌పై త‌ప్ప‌క ఉంటుంది. కాని ఈ ప్ర‌భావం మ‌రింత ఎక్కువ‌గా ఉండ‌డంతో చిత్రంలో విల‌న్ గా చేసిన  తనికెళ్ళ భరణి పై మహిళలు కొంత మంది కోపం పెంచుకున్నారట.

సినిమా రిలీజైన చాలా రోజుల త‌ర్వాత త‌నికెళ్ల భ‌ర‌ణి బ‌య‌ట క‌నిపించ‌గా, ఆయ‌న‌ని కొట్ట‌డానికి వెళ్లార‌ట మ‌హిళ‌లు. సినిమాలో ఆయ‌న చూపించిన క్రూర‌త్వం త‌ట్టుకోలేక కొంద‌రు మ‌హిళ‌ల‌కు కొట్టడానికి వెళ్లార‌ట‌. ఈ విష‌యం స్వ‌యంగా త‌నికెళ్ల భ‌ర‌ణి చెప్పుకొచ్చారు.  త‌నికెళ్ల భ‌ర‌ణి సినిమాలలో ఎప్పుడు విలన్ గా క‌నిపించి మెప్పించేవారు. ఆయ‌న ఇప్పుడు చాలా త‌గ్గించారు. అడ‌పాద‌డ‌పా మాత్ర‌మే సంద‌డి చేస్తున్నారు.  దాదాపు 30 ఏళ్లుగా తెలుగు సినీ పరిశ్రమలో ఓ వెలుగు వెలిగిన‌ తనికెళ్ళ భరణి. రైటర్ గా తన ప్రస్థానం మొదలు పెట్టి.. ఆ త‌ర్వాత‌ నటుడిగా ఎన్నో పాత్రలకు జీవం పోసి.. దర్శకుడిగా, రచయితగా తన ప్రత్యేకతను చాటుకున్నారు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...