Home Film News Amala: బాలీవుడ్ హీరోతో స‌న్నిహితంగా అమ‌ల‌.. అన్నీ అనుకున్న‌ట్టు జ‌రిగితే..
Film News

Amala: బాలీవుడ్ హీరోతో స‌న్నిహితంగా అమ‌ల‌.. అన్నీ అనుకున్న‌ట్టు జ‌రిగితే..

Amala: అక్కినేని నాగార్జున స‌తీమ‌ణి, ప్ర‌ముఖ సినీ న‌టి అమ‌ల ఒక‌ప్పుడు హీరోయిన్‌గా  అల‌రించిన విష‌యం మ‌నంద‌రికి తెలిసిందే.  నిర్ణయం, శివ సినిమాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన అమ‌ల ఆ త‌ర్వాత నాగార్జున‌ని వివాహం చేసుకొని సినిమాల‌కి పూర్తిగా దూర‌మైంది. కేవ‌లం కుటుంబ బాధ్య‌త‌లు చూసుకుంటూ మ‌రోవైపు సోష‌ల్ స‌ర్వీస్ చేస్తుంది. అమ‌ల ఐర్లాండ్‌కి చెందిన మ‌హిళ కాగా, ఆమె తండ్రి బెంగాల్ నేవీ ఆఫీస‌ర్ ముఖ‌ర్జీ.  త‌ల్లి ఐర్లాండ్‌కి చెందిన మ‌హిళ‌. వీరిద్ద‌రు ప్రేమించి పెళ్లి చేసుకోగా, ఆ దంప‌తుల‌కి అమ‌ల పుట్టింది. అమ‌ల పుట్టాక వారు వైజాగ్, చెన్నై వంటి ప్రాంతాల‌లో నివ‌సించారు.

అమ‌ల బాలీవుడ్‌లో చాలా చిత్రాలే చేసింది. చాలా మంది స్టార్ హీరోల‌తో క‌లిసి ప‌ని చేసింది. సంజ‌య్ క‌పూర్ డెబ్యూ మూవీలో అమ‌ల హీరోయిన్ కాగా, ఆ ప్రాజెక్ట్ అనుకోని కార‌ణాల వ‌ల‌న ఆగిపోయింది. రీసెంట్‌గా ఈ విష‌యాన్ని త‌న సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేశారు సంజయ్ క‌పూర్.  1995లో ప్రేమ్ అనే రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ తో హీరో అయిన‌ సంజయ్ కపూర్ అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేక‌పోయాడు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప‌లు సినిమాలు  చేస్తున్నాడు అయితే  1987లో ఓ ప్రాజెక్ట్ కోసం సంజయ్ కపూర్, అమలను హీరో హీరోయిన్స్ అనుకున్న మేక‌ర్స్ వారిద్ద‌రిపై ఫొటో షూట్ కూడా చేశార‌ట‌.

కాని ఆ ప్రాజెక్ట్ ప‌లు కారణాల వ‌ల‌న ఆగిపోయింది. ఆ త‌ర్వాత ప్రేమ్ అనే సినిమాతో హీరోగా మారాడు. అయితే అమ‌ల అప్ప‌టికే  త‌మిళంలో చాలా బిజీ యాక్ట్రెస్‌గా ఉంది. ఆమెతో చేయాల్సిన సినిమా ఆగిపోయింద‌ని చెప్పిన సంజ‌య్ క‌పూర్ అప్ప‌టి ఫొటో కూడా షేర్ చేశాడు.  1987లో బ్యూటిఫుల్ అమలతో నా ఫస్ట్ ఫోటో షూట్. నా డెబ్యూ మూవీ హీరోయిన్ అమల కావాల్సింది, కాని అది వ‌ర్కవుట్ కాలేద‌ని త‌న పోస్ట్‌కి కామెంట్ పెట్టాడు. ఈ పోస్ట్‌పై సంజ‌య్ క‌పూర్ భార్య‌.. మ‌హీప్ స్పందిస్తూ.. 1987లోనా… అప్పటికి నా వయసు కేవలం 14 ఏళ్ళు అని  చెప్పుకొచ్చింది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...