Home Film News Varsha: వాష్ రూమ్ బ‌య‌టే ప‌డుకున్నాను.. ప‌రిస్థితి చూసి చ‌నిపోదామ‌నుకున్నా: జ‌బ‌ర్ధ‌స్త్ వ‌ర్ష‌
Film News

Varsha: వాష్ రూమ్ బ‌య‌టే ప‌డుకున్నాను.. ప‌రిస్థితి చూసి చ‌నిపోదామ‌నుకున్నా: జ‌బ‌ర్ధ‌స్త్ వ‌ర్ష‌

Varsha: బుల్లితెర కామెడీ షో జ‌బ‌ర్ధ‌స్త్ ద్వారా ఎంతో మంది పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించుకున్న విష‌యం తెలిసిందే. వారిలో జ‌బ‌ర్ధ‌స్త్ వ‌ర్ష ఒక‌రు.త‌న  అందం, అభినయం, కామెడీతో ప్రేక్షకులను తెగ‌ అలరిస్తోన్న ఈ బ్యూటీ.. షోలు, ఈవెంట్లతో బుల్లితెరపై తెగ హడావిడి చేస్తూ ర‌చ్చ చేస్తుంది. ఇక  సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటూ ఓ రేంజ్‌లో రెచ్చిపోతూనే ఉంది. ఈ అమ్మ‌డి హాట్ పిక్స్ చూస్తే కుర్ర‌కారుకి పిచ్చెక్కిపోవ‌ల్సిందే. వ‌ర్ష ముందుగా మోడ‌లింగ్ రంగంలో  తనదైన అందాలతో సందడి చేసి బుల్లితెర‌పై అడుగుపెట్టింది. ఈ నేప‌థ్యంలోనే ‘అభిషేకం’ అనే సీరియల్‌లో నటించే అవకాశాన్ని అందిపుచ్చుకుంది. ఇందులో వ‌ర్ష‌కి మంచి పేరు రావ‌డంతో ఇక  ‘తూర్పు పడమర’, ‘ప్రేమ ఎంత మధురం’ వంటి సీరియళ్లు చేసి  ఫుల్ ఫేమ‌స్ అయింది.

బుల్లితెరపై సుదీర్ఘ కాలం పాటు ఎన్నో సీరియ‌ల్స్ చేసిన వ‌ర్ష  జబర్ధస్త్‌లోకి అడుగుపెట్టింది.ఇక ఈ వేదిక‌పై వ‌ర్ష త‌న గ్లామ‌ర్ షోతో పాటు ప‌ర్‌ఫార్మెన్స్ తో వెనక్కి తిరిగి చూడకుండా దూసుకుపోతూ మంచి మంచి ఆఫ‌ర్స్ అందిపుచ్చుకుంటుంది.  జబర్ధస్త్‌ షోలో  పర్మినెంట్ మెంబర్ అయిపోయిన వర్ష ఒక పక్క వరుసగా సీరియళ్లు చేస్తూనే  మ‌రోవైపు   స్పెషల్ ఈవెంట్లతో పాటు ‘శ్రీదేవీ డ్రామా కంపెనీ’ షోలోనూ భాగమై ప్రేక్షకులకు  మంచి వినోదం పంచుతుంది. ఇక త్వ‌ర‌లో న‌టిగా కూడా మారాల‌ని భావిస్తుంది. అయితే రీసెంట్‌గా ఓ ఇంట‌ర్వ్యూలో వ‌ర్ష మాట్లాడుతూ.. తాను ఒక పెద్ద రియాలిటీ షోలో పాల్గొన‌బోతున్న‌ట్టు తెలియ‌జేసింది. అందుకు అడ్వాన్స్ కూడా తీసుకున్న‌ట్టు పేర్కొంది.

ఆ షోలో త‌న‌కు సంబంధించిన అన్ని విష‌యాలు చెప్పుకొస్తానంది. అయితే వ‌ర్ష  రీసెంట్ ఇంట‌ర్వ్యూలో త‌న చిన్న‌య్య‌కి యాక్సిడెంట్ అయిన‌ప్పుడు ఎలా రియాక్ట్ అయిందో తెలియ‌జేసింది. త‌న‌కి తన చిన్న‌య్య అంటే పంచ ప్రాణాలు అని చెప్పిన ఈ భామ ఓ సారి త‌న‌కి యాక్సిడెంట్ జరిగి ఆసుప‌త్రిలో అడ్మిట్ అయ్యాడ‌ని పేర్కొంది. మెద‌డులో బ్ల‌డ్ క్లాట్ కావ‌డం వ‌ల‌న డాక్ట‌ర్స్
నాఅన్న‌య్య బ‌త‌క‌ర‌ని చెప్పారు. ఎంత‌ఖ‌ర్చైన స‌రే మా అన్న‌య్య‌ని బ్ర‌తికించండ‌ని డాక్ట‌ర్స్‌ని బ్ర‌తిమిలాడాను. వాష్ రూం ముందు రెండు రోజుల పాటు ప‌డుకున్నాను. ఆ స‌మ‌యంలో చ‌నిపోదామ‌ని అనుకున్నా. అంద‌రి ద‌య వ‌ల‌న మా అన్న‌య్య కోలుకున్నాడు అని వ‌ర్ష చెప్పుకొచ్చింది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...