Home Film News Allu Arjun-Chiranjeevi: పుష్ప 2 డైలాగ్ లీక్ చేసిన అల్లు అర్జున్.. చిరంజీవిని స్ఫూర్తిగా తీసుకున్నాడా ఏంటి?
Film News

Allu Arjun-Chiranjeevi: పుష్ప 2 డైలాగ్ లీక్ చేసిన అల్లు అర్జున్.. చిరంజీవిని స్ఫూర్తిగా తీసుకున్నాడా ఏంటి?

Allu Arjun-Chiranjeevi: అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేష‌న్‌లో వచ్చిన చిత్రాలు అన్నీ కూడా మంచి విజ‌యం సాధిస్తున్న విష‌యం తెలిసిందే. రీసెంట్‌గా పుష్ప అనే చిత్రం తెర‌కెక్కి పెద్ద విజ‌యం సాధించింది. ఈ సినిమాతో బన్నీ గ్లోబ‌ల్ స్టార్‌గా మారాడు. ఇక ఇప్పుడు పుష్ప చిత్రానికి సీక్వెల్‌గా పుష్ప‌2 చిత్రాన్నిరూపొందిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ చిత్ర షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుండ‌గా, బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ తోపాటు వేర్ ఈజ్ పుష్ప‌ అనే వీడియోని మేక‌ర్స్ రిలీజ్ చేశారు. ఈ వీడియోకి దేశ వ్యాప్తంగా మాసీవ్ రెస్పాన్స్ దక్కింది.

పుష్ప‌2 గ్లింప్స్ త‌ర్వాత ఈ సినిమాపై అంచ‌నాలు మ‌రింత పెరిగాయి. ఈ సినిమాకి సంబంధించిన అప్‌డేట్ కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న స‌మ‌యంలో అల్లు అర్జున్ ఏకంగా డైలాగ్ లీక్ చేసి షాకిచ్చాడు. ‘బేబీ’ మూవీ టీమ్ నిర్వహించిన అప్రిసియేషన్ మీట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బ‌న్నీ చిత్రంలో ప్ర‌ధాన పాత్రల్లో మెప్పించిన ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్యతో పాటు దర్శకుడు సాయి రాజేశ్ ను అభినందించారు. ఆ తర్వాత ఫ్యాన్స్ కోరిక మేరకు ‘పుష్ప2’ నుంచి పవర్ డైలాగ్ ను వదిలి ఆశ్చర్య‌ప‌రిచారు. ‘వెర్ ఈజ్ పుష్ప’ వీడియో చివర్లో ‘ఇది పుష్పగాడి రూల్’ అంటూ ఓ డైలాగ్ ఉంటుంది.

 

దానికి సంబంధించిన పూర్తి డైలాగ్‌ని ఇప్పుడు లీక్ చేసి సినిమాపై మ‌రిన్ని అంచ‌నాలు పెంచారు. పుష్ప2 గురించి అప్డేట్ ఇవాల్సి వస్తుందని నేను అనుకోలేదు.. చిరు లీక్స్ లాగే నేను కూడా ఓ డైలాగ్ లీక్ చేస్తున్నాను. ‘ఈడంతా జరిగేది ఒక్కటే రూల్ మీద జరుగుతండాది.. పుష్ప గాడి రూల్’ అంటూ పవర్ ఫుల్ గా డైలాగ్ చెప్ప‌డంతో ఆడిటోరియం ద‌ద్ద‌రిల్లింది.కాగా, పెద్ద ఫంక్షన్ పెడితే అభిమానులు ఎక్కువ మంది వస్తారు, సినిమా అప్డేట్స్ అడుగుతారని తెలుసు. అందుకే చిన్నగా ‘బేబీ’ ఫంక్షన్ చేయమని చెప్పినట్లు అల్లు అర్జున్ స్ప‌ష్టం చేశారు. రెండో పార్ట్‌కి సంబంధించిన గ్లింప్స్ లో ‘అడవిలో జంతువులు రెండు అడుగులు వెనక్కి వేశాయంటే పులి వచ్చిందని అర్థం. అదే పులి రెండు అడుగులు వెనక్కి వస్తే పుష్ప వచ్చాడని అర్థం’ అని కేశవ చెప్పే డైలాగుతో పుష్ప ముఖాన్ని చీకటిలో చూపించారు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...