Home Film News Niharika Divorce: ఆ స్టార్ హీరోయిన్ వ‌ల్ల‌నే నిహారిక విడాకులు తీసుకుందా?
Film News

Niharika Divorce: ఆ స్టార్ హీరోయిన్ వ‌ల్ల‌నే నిహారిక విడాకులు తీసుకుందా?

Niharika Divorce: మెగా ఫ్యామిలీలో ఇటీవ‌ల విడాకులు కామ‌న్ అయ్యాయి. చిరంజీవి చెల్లెలు నుండి మొద‌లు పెడితే నిహారిక వ‌ర‌కు పెళ్లైన కొద్ది సంవ‌త్స‌రాల‌కే విడాకులు తీసుకున్నారు. నిహారిక విడాకుల విష‌యంపై కొన్నాళ్లుగా అనేక ప్ర‌చారాలు న‌డుస్తుండ‌గా, ఎవ‌రు స్పందించ‌క‌పోవ‌డంతో అవ‌న్నీ అవాస్త‌వాలు అనుకున్నారు. కాని జూలై 4 సాయంత్రం ఆమె దరఖాస్తు చేసుకున్న పిటీష‌న్ ఒక‌టి బ‌య‌ట‌కు రావ‌డంతో అకారికంగా ఇద్దరూ విడిపోయారు అని అన్న విషయం బయటకి తెలిసింది.ఈ క్ర‌మంలో నిహారిక‌,చైత‌న్య‌లు త‌మ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్పందించారు. త‌న ఇన్‌స్టాలో ఒక పోస్ట్ పెట్టిన నిహారిక‌.. ప‌లు విషయాలు చెప్పి ఇక ఈ వార్తలకి ముగింపు ఇవ్వమన్నట్టుగా తెలియ‌జేసింది.

జొన్న‌ల‌గ‌డ్డ చైతన్య, తాను పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా నిహారిక తెలిపింది. ఇలాంటి క‌ఠిన‌మైన‌ సమయంలో తమను ఎవ‌రు కూడా ఇబ్బంది పెట్టకూడదని ఆమె కోరింది. తామిద్దరం కొత్తగా ప్రారంభించే వ్యక్తిగత జీవితం విషయంలో కాస్త‌ ప్రైవసీని కోరుకుంటున్నామని.. దీన్ని అందరూ త‌ప్ప‌క‌ గౌరవించాలని విజ్ఞప్తి చేసింది నిహారిక.ఇక చైత‌న్య కూడా సేమ్ పోస్ట్ పెట్టారు. ఇంతకాలం తమకు మద్దతుగా నిలిచిన కుటుంబసభ్యులు, స్నేహితులకు థ్యాంక్స్ అని వారిద్దరు త‌మ పోస్ట్‌లో తెలిపారు.

 

అయితే నిహారిక విడాకులు తీసుకోవ‌డం వెన‌క ఒక స్టార్ హీరోయిన్ ఉంద‌ని వార్త‌లు గుప్పుమంటున్నాయి. కొన్ని సంవ‌త్స‌రాల క్రితం నాగ చైత‌న్య నుండి విడాకులు తీసుకున్న స‌మంత‌ని ఇన్సిపిరేష‌న్‌గా తీసుకునే నిహారిక త‌న భ‌ర్త‌కి విడాకులు ఇచ్చింద‌ని అంటున్నారు. నిహారిక మొదటి నుంచి సమంతాను చాలా దగ్గరగా ఫాలో అవుతూ ఆమె షేర్ చేసే ప్ర‌తి పోస్ట్‌ని లైక్ చేస్తుంటుంది. ఇదే క్ర‌మంలోనే స‌మంత మ్యారీడ్ లైఫ్ లో వచ్చిన రిజల్ట్ ని కూడా నిహారిక త‌న జీవితంలో ఇన్సిపిరేష‌న్‌గా తీసుకుంద‌ని అంటున్నారు. అయితే అంత అట్ట‌హాసంగా పెళ్లి చేసుకొని నూరేళ్ల పాటు క‌లిసి ఉండాల్సిన వారు చిన్న చిన్న విష‌యాల‌కి విడిపోవ‌డం ఏ మాత్రం బాగోలేంద‌టూ కొంద‌రు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

Related Articles

Cómo apostar al tenis mexicano Pin Up

Cómo apostar al tenis mexicano Pin Up

Betper bahis sitesi guncel giris 2023

Betper bahis sitesi guncel giris 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...