Home Film News Rakesh Master Wife: రాకేష్ మాస్టర్ మూడో భార్య‌పై దాడి.. తీవ్ర గాయాల‌తో పోలీస్ స్టేష‌న్‌ని వెళ్లి కంప్లైంట్
Film News

Rakesh Master Wife: రాకేష్ మాస్టర్ మూడో భార్య‌పై దాడి.. తీవ్ర గాయాల‌తో పోలీస్ స్టేష‌న్‌ని వెళ్లి కంప్లైంట్

Rakesh Master Wife: టాలీవుడ్ ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్ రాకేష్ మాస్ట‌ర్ కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో క‌న్నుమూసిన విష‌యం తెలిసిందే. ఆయ‌న మృతి చాలా మందికి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అయితే కెరీర్ మొద‌ట్లో మంచి పేరు తెచ్చుకున్న రాకేష్ మాస్ట‌ర్ త‌ర్వాత త‌ర్వాత చాలా వివాదాలు సృష్టిస్తూ హాట్ టాపిక్ అయ్యాడు. అయితే ఇప్పుడు ఆయ‌న మ‌ర‌ణం త‌ర్వాత ఆయ‌న ఆస్తులు, యూట్యూబ్ ఛానెల్స్ ఎవ‌రికి చెందుతాయి అనే దానిపై కొద్ది రోజులుగా చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయ‌ట‌.అయితే రాకేష్ మాస్టర్ బ్ర‌తికి ఉన్న‌ప్పుడు తన వద్దకు వంట చేయడానికి వచ్చిన లక్ష్మీ ని తన భార్యగా పరిచయం చేసాడు.మూడేళ్ల పాటు వీరిద్ద‌రు స‌హ‌జీవ‌నం చేసి త‌ర్వాత విడిపోయారు.

అయితే రాకేష్ మూడో భార్య ల‌క్ష్మీపై కొంద‌రు యూట్యూబ‌ర్లు దాడికి పాల్ప‌డ్డారు. స్కూటీపై వెల్తున్న ఆమెని  లల్లీ అనే యూట్యూబర్ మరో నలుగురు మహిళలు అడ్డుకొని జుట్టు ప‌ట్టుకొని న‌డిరోడ్డుపై చిత‌క‌బాదారు. అయితే అందుకు కార‌ణం కూడా చెప్పింది. ల‌ల్లీ.  మైనర్ అయిన తన కూతురుపై లక్ష్మీ అసభ్యంగా మాట్లాడిందని ఆమె ఆరోపించింది. మరోవైపు లక్ష్మీ మాట్లాడుతూ యూట్యూబ్ విడిచి వెళ్లాలని త‌న‌ను  బెదిరిస్తున్నారని,   అంతమొందించాలని కూడా చూస్తున్నారని, దానిలో భాగంగానే ఇలా దాడికి పాల్పడ్డారని  చెప్పుకొచ్చింది. అయితే  తనపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ల‌క్ష్మీ పంజాగుట్ట‌ పోలీసులను కోరింది.

ఇద్దరి నుంచి ఫిర్యాదులు తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. మ‌రోవైపు   రాకేష్ మాస్టర్ యూట్యూబ్ ఛానల్ లక్ష్మి స్వాధీనం చేసుకుంద‌ని, ఈ క్ర‌మంలోనే ఇన్ని గొడవలు జ‌రుగుతున్నాయి అని విశ్వసనీయ సమాచారం. రాకేష్ మాస్ట‌ర్ యూట్యూబ్  ఛానల్ విషయంలోనే లక్ష్మికి ,లల్లీ వర్గానికి గొడవలు జరుగుతున్నాయనే టాక్  కూడా వినిపిస్తుంది. నాలుగు గోడ‌ల మ‌ధ్య చ‌ర్చించుకొని సాల్వ్ చేసుకోవ‌ల్సిన వీరు గొడ‌వ‌ల‌ని యూట్యూబ్ వ‌రకు తీసుకెళ్లారు. బండ‌బూతులు తిట్టుకుంటూ ఆ వీడియోల‌ని యూట్యూబ్ లో పెట్టారు. ఇక ఇప్పుడైతే ఏకంగా రోడ్డు పైనే కొట్టుకున్నారు. మరి ఈ వివాదం ఇంకెంత ముందుకు  వెళుతుందో చూడాలి.

Related Articles

ఇప్పటికీ జక్కన్న నాకు ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు.. తమన్నాసెన్సేషనల్ కామెంట్స్ వైరల్..!

మిల్కీ బ్యూటీ తమన్నా చిత్ర పరిశ్రమలో ఈ పేరుకి ఎలాంటి క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో...

1000 కోట్లు ఇచ్చినా సరే అలా చేయను అంటూ తెగేసి చెప్పేస్తున్న ప్రభాస్.. ఎందుకో తెలుసా..!?

ప్రస్తుతం ఇండియన్ సినిమా చిత్ర పరిశ్రమలో భారీ స్టార్‌డంతో దూసుకుపోతున్న ప్రభాస్ పెళ్లి వయసు దాటుతున్న...

మహేష్ కోసం అవతార్ డైరెక్టర్ ను తీసుకొస్తున్న రాజమౌళి.. జక్కన్న స్కెచ్ మామూలుగా లేదుగా..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సినిమా రాబోతున్నట్టు ఇప్పటికే అధికార...

రామ్ చరణ్ ఫోన్ లో ఎన్టీఆర్ నెంబర్ ఏమని ఉంటుందో తెలుసా.. భ‌లే సిల్లిగా లేదు..!

మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా రామ్ చరణ్ టాలీవుడ్ లో అడుగుపెట్టి ప్రస్తుతం పాన్ ఇండియా...