Home Film News LIGER Trailer : సోషల్ మీడియాను షేక్ చేసున్న ‘లైగర్’ ట్రైలర్
Film News

LIGER Trailer : సోషల్ మీడియాను షేక్ చేసున్న ‘లైగర్’ ట్రైలర్

LIGER Trailer
LIGER Trailer

LIGER Trailer: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ సోషల్ మీడియాను షేక్ చేసేస్తున్నాడు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌తో ఫస్ట్ టైమ్ విజయ్ నటిస్తున్న క్రేజీ అండ్ ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ఫిలిం.. ‘లైగర్’ (సాలా క్రాస్ బీడ్).. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా అనౌన్స్ చేసిన దగ్గరినుండే మంచి అంచనాలున్నాయి.

ఇక బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ కరణ్ జోహార్ ఎంటరైనప్పటినుండి ప్రాజెక్ట్ షేపే మారిపోయింది. పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ల మీద పూరి, ఛార్మి, కరణ్ జోహార్, అపూర్వ మెహతా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్.

బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు. గురువారం ‘లైగర్’ ట్రైలర్ రిలీజ్ చేశారు. తెలుగు ట్రైలర్ మెగాస్టార్ చిరంజీవి, రెబల్ స్టార్ ప్రభాస్, మలయాళం ట్రైలర్ దుల్కర్ సల్మాన్ తదితరులు రిలీజ్ చేశారు. పూరి, విజయ్ కలిసి బాక్సాఫీస్ బరిలో సెన్సేషన్ క్రియేట్ చెయ్యబోతున్నారని హింట్ ఇచ్చారు.

పూరి మార్క్, కథ, కథనాలు, క్యారెక్టర్లు, ముఖ్యంగా హీరో క్యారెక్టర్ ఎప్పటిలానే ఆకట్టుకునేలా ఉన్నాయి. హీరో జర్నీ ఎక్కడినుండి ఎలా మొదలై, ‘లైగర్’ రేంజ్‌కి ఎదిగిందనేది క్లుప్తంగా చూపించారు. విజయ్ పర్ఫార్మెన్స్, అనన్యతో కెమిస్ట్రీ, విజువల్స్, ఆర్ఆర్ బాగున్నాయి. ‘లైగర్’ ట్రైలర్ ప్రస్తుతం ట్రెండింగ్‌లో టాప్ ప్లేస్‌లో కంటిన్యూ అవుతోంది. ఆగస్టు 25న సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...