Home Film News Kriti Sanon: మీరు అనుకున్న‌ది అబ‌ద్ధం.. ప్ర‌భాస్ అలాంటి వాడంటూ కృతి స‌న‌న్ షాకింగ్ కామెంట్స్
Film NewsGossips

Kriti Sanon: మీరు అనుకున్న‌ది అబ‌ద్ధం.. ప్ర‌భాస్ అలాంటి వాడంటూ కృతి స‌న‌న్ షాకింగ్ కామెంట్స్

Kriti Sanon: బాలీవుడ్ బ్యూటీ కృతి స‌న‌న్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్కర్లేదు. ఈ హిందీ భామ తెలుగులో వ‌న్ నేనొక్క‌డినే, దోచేయ్ వంటి చిత్రాలు చేసింది. ఈ రెండు చిత్రాలు కూడా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర నిరాశ‌ప‌రిచాయి. దీంతో కొన్నాళ్ల పాటు హిందీలోనే సినిమాలు చేసుకుంటూ వ‌చ్చింది. ఇక ఇప్పుడు ఆదిపురుష్ చిత్రంతో మ‌రోసారి తెలుగు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించ‌బోతుంది. చిత్రంలో ఈ అమ్మ‌డు జాన‌కి పాత్ర‌లో క‌నిపించి మెప్పించ‌నుంది. అయితే తాజాగా జరిగిన ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చీర‌క‌ట్టుతో మెరిసిన కృతి త‌న అందంతో పాటు మాట‌లతో ప్ర‌తి ఒక్క‌రిని ఆకర్షించింది.

కృతి స‌న‌న్ మాట్లాడుతూ.. నా కెరీర్ తెలుగులోనే మొదలైంది అని చెప్పింది. 9 ఏళ్ల తర్వాత మ‌ళ్లీ తెలుగులో సినిమా చేస్తున్నాను. జానకి పాత్ర చేసే అవకాశం దొర‌క‌డం గొప్ప అదృష్టం. ఇందుకుగాను ఓం రౌత్, ప్రభాస్ లకు ధన్యవాదాలు. ఆ పాత్ర నన్ను ఎంచుకుంది అని నేను భావిస్తున్నాను. నా జీవితంలో ఆదిపురుష్ ప్రత్యేక చిత్రంగా నిలిచిపోతుంది అని కృతి స‌న‌న్ స్ప‌ష్టం చేసింది. ఇక ఆదిపురుష్ సెట్లో ఒక ప్రశాంత వాతావరణం అయితే ఉండేది. సాధారణంగా సినిమా సెట్స్ లో గోల గోలగా ఉంటుంది కాని, ఆదిపురుష్ మూవీ సెట్ మాత్రం దానికి పూర్తి భిన్నం. రామాయణం చేస్తున్నామన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉండ‌డంతో అంద‌రు నిశ్శబ్దంగా ఉండేవారు అని కృతి స‌న‌న్ తెలియ‌జేసింది.

 

ప్ర‌భాస్ గురించి మాట్లాడ‌మ‌ని యాంకర్ ప్రదీప్ కృతి సనన్ కి కోర‌డంతో.. ప్రభాస్ స్వీట్ అండ్ కైండ్ పర్సన్ అని సింపుల్‌గా తేల్చేసింది.ఆయ‌న ఫుడ్ బాగా ఇష్టపడతారు. ప్ర‌భాస్ పెద్దగా మాట్లాడరని అందరూ అంటుంటారు. కాని అది నిజం కాదు. ప్రభాస్ చాలా మంచిగా మాట్లాడతారు. ఆయన కళ్ళల్లో ఓ ప్రశాంతత అయితే ఉంటుంది. రాఘవుడు పాత్ర ప్రభాస్ తప్ప మరొకరు చేయలేరని కృతి స‌న‌న్ ప్రశంసలు కురిపించారు. కాగా కృతి సనన్, ప్రభాస్ మధ్య ఎఫైర్ ఉందని కొన్నాళ్లుగా వార్త‌లు వినిపిస్తున్న నేప‌థ్యంలో కృతి చేసిన కామెంట్స్ ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.

 

Related Articles

Hizli mobil odeme canli bahis siteleri 2023

Hizli mobil odeme canli bahis siteleri 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...