Home Film News Nayanthara Couple: రెడ్ హ్యాండెడ్‌గా దొరిక‌న న‌య‌న‌తార దంప‌తులు.. కేసు న‌మోదు
Film News

Nayanthara Couple: రెడ్ హ్యాండెడ్‌గా దొరిక‌న న‌య‌న‌తార దంప‌తులు.. కేసు న‌మోదు

Nayanthara Couple: లేడి సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార కొన్నాళ్లుగా వివాదాల‌తో ఎక్కువ‌గా వార్త‌ల‌లో నిలుస్తుంది. విఘ్నేష్ శివ‌న్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్న న‌య‌న‌తార తన భ‌ర్త‌తో కలిసి తిరుమ‌ల మాడ వీధుల్లో చెప్పుల‌తో తిరిగింది.ఇది అప్ప‌ట్లో పెద్ద వివాదం అయింది. ఇక  సరోగ‌సి ద్వారా వీరు పిల్ల‌ల‌కు జ‌న్మ‌నివ్వ‌డం కూడా వారికి లేనిపోని చిక్కులు తెచ్చిపెట్టింది. ఇక ఇప్పుడు మ‌రోకేసు వీరిని  చుట్టుకుంది. విఘ్నేష్ శివన్ పూర్వీకులు తీర్చే జిల్లా లాల్కోడి గ్రామంలో ఉండేవారు. విఘ్నేష్ తండ్రి పేరు శివ కొళుదు కాగా, ఆయ‌న‌ తండ్రి పోలీస్ ఇన్ఫార్మర్ గా పని చేసాడు. అయితే కొన్నేళ్ల క్రితం క‌న్నుమూసారు మరణించారు.

శివ కొళుదు త‌న అన్న‌ద‌మ్ముల ఉమ్మ‌డి ఆస్తిని అమ్ముకున్నాడ‌ట‌. దీంతో ఇప్పుడు విఘ్నేష్ శివ‌న్ బాబాయిలు అయిన   మాణిక్యం, కుంచిత పాదం .. ఉమ్మడి ఆస్తి మాకు తెలియకుండా అమ్ముకున్న నేపథ్యంలో కొన్న వ్యక్తికి డబ్బులు చెల్లించి, తిరిగి ఆస్తి అప్పగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు తిరుచ్చి డీజీపీ ఆఫీస్ లో మాణిక్యం, కుంచిత పాదం ఫిర్యాదు కూడా చేశారు. ఫిర్యాదులో వారు విఘ్నేష్ శివన్, నయనతారలతో పాటు విగ్నేష్ శివన్ తల్లి మీనా కుమారి, కూతురు ఐశ్వర్యల మీద కూడా చర్యలు తీసుకోవాలని రాసుకొచ్చారు.

ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వార్త నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. అయితే ఇప్పుడు ఈ వివాదాన్ని న‌య‌న‌త‌రా, విఘ్నేష్ శివ‌న్ దంప‌తులు ఎలా సాల్వ్ చేసుకుంటారా అని ఆలోచ‌న‌లు చేస్తున్నారు. ఇక న‌య‌న‌తార పెళ్లైన త‌ర్వాత కూడా వ‌రుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఒక‌వైపు లేడి ఓరియెంటెడ్ పాత్ర‌లు చేస్తూనే మ‌రోవైపు క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ప్ర‌స్తుతం బాలీవుడ్  హీరో షారూఖ్ ఖాన్ ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందుతున్న జ‌వాన్ చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తుంది న‌య‌న్. ఇక విఘ్నేష్ శివ‌న్ ఇటీవ‌ల ద‌ర్శ‌కుడిగా పెద్ద‌గా స‌క్సెస్ లు అంద‌కోవ‌డం లేదు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...