Home Film News Chiranjeevi-Pawan Kalyan: చిరంజీవికి ఎదురు తిరిగిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌…రూమ్ లో వేసి మ‌రి.
Film News

Chiranjeevi-Pawan Kalyan: చిరంజీవికి ఎదురు తిరిగిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌…రూమ్ లో వేసి మ‌రి.

Chiranjeevi-Pawan Kalyan: టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో మెగా ఫ్యామిలీకి ప్ర‌త్యేక గౌరవం ఉంటుంది. అందుకు కార‌ణం ఆ ఫ్యామిలీ నుండి వ‌చ్చిన ప్ర‌తి హీరో మంచి స‌క్సెస్‌లు అందుకుంటూ ముందుకు పోవ‌డం, ఎలాంటి వివాదాల జోలికి వెళ్ల‌పోవ‌డమే. చిరంజీవి త‌ర్వాత ఆయ‌న త‌మ్ముడిగా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ప‌వ‌న్ సినిమాల‌లో రాణిస్తాడా, అన్న‌కి త‌గ్గ త‌మ్ముడిగా అనిపించుకుంటాడా అనే సందేహం అంద‌రిలో ఉండేది. కాని ఆయ‌న ఇప్పుడు చిరంజీవిని మించి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి అభిమానులు కాదు. భ‌క్తులు ఉంటారు. ఆయ‌న పేరు చెబితే పూన‌కం వ‌చ్చిన‌ట్టు ఊగిపోతూ ఉంటారు. ప్ర‌స్తుతం రాజ‌కీయాల‌లోను ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని సీఎంగా చూడాల‌ని ఆయ‌న అభిమానులు ఎంత‌గానో కోరుకుంటున్నారు.

అయితే తాజాగా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట వైర‌ల్‌గా మారింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి చిన్న‌ప్ప‌టి నుండి చ‌దువు మీద అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. త‌మ్ముడిని క‌నీసం సినిమాల‌లోకి అయిన తీసుకొస్తే బాగుంటుంద‌ని చిరంజీవి అనుకునేవాడ‌ట‌. కాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాత్రం ఎప్పుడు ఏదో ఒక పుస్త‌కం ప‌ట్టుకొని ఆధ్యాత్మికతలోనే మునిగి పోయేవారట‌. అయితే  పవన్ కళ్యాణ్ ని హీరో చేద్దామని క‌థ‌లు గురించి వెతుకున్న స‌మ‌యంలో ఓ సారి ప‌వ‌న్ ఏకంగా చిరంజీవికే ఎదురు తిరిగార‌ట‌. సినిమాలు అంటే ఇంట్రెస్ట్ లేద‌న్నా కూడా ఎందుకు నా కోసం క‌థ‌లు వెతుకున్నావు అని కోపంగా అన్నాడ‌ట‌. అంతేకాకుండా  తాను బౌద్ధమతంలోకి వెళ్లి సన్యాసిగా మారిపోతాను అంటూ చిరంజీవి ద‌గ్గ‌ర చాలా కోపంగా మాట్లాడ‌ట‌.

త‌ర్వాతి రోజు ఇంటి నుండి కూడా ప‌వ‌న్ వెళ్లాడ‌ట‌. అయితే త‌ర్వాత  త‌మ్ముడి జాడ‌ని కనుక్కొని ఇంటికి తీసుకొచ్చి ఎక్క‌డికి వెళ్ల‌కుండా  రూమ్ లో వేసి పెట్టి పెద్ద తమ్ముడు నాగబాబుని కాపలా ఉంచాడ‌ట చిరు. ఇక అదే స‌మ‌యంలో  పవన్ కళ్యాణ్  అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి స్టోరీ త‌న ద‌గ్గ‌రికి రావ‌డం, అది త‌న‌ తమ్ముడికి సెట్ అవుతుంది అని భావించిన చిరంజీవి పవన్ కళ్యాణ్ ని హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఈ సినిమా మంచి విజ‌యం సాధించి ప‌వ‌న్‌కి కూడా మంచి పేరు తీసుకురావ‌డంతో హీరోగా కొన‌సాగాడు. కాగా, ప‌వ‌న్ చాలా సంద‌ర్భాల‌లో తాను అస్స‌లు హీరో కావాల‌ని అనుకోలేద‌ని చెప్ప‌డం మ‌నం చూశాం.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...