Home Film News Dabangg 3 Beauty: స‌ల్మాన్ బాడీగార్డ్స్ న‌న్ను కుక్క‌లా త‌రిమేశారంటూ దబాంగ్ 3 బ్యూటీ ఆవేద‌న‌
Film News

Dabangg 3 Beauty: స‌ల్మాన్ బాడీగార్డ్స్ న‌న్ను కుక్క‌లా త‌రిమేశారంటూ దబాంగ్ 3 బ్యూటీ ఆవేద‌న‌

Dabangg 3 Beauty: బాలీవుడ్ బాయిజాన్ స‌ల్మాన్ ఖాన్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఐదు ప‌దుల వ‌య‌స్సు దాటిన కూడా ఇప్ప‌టికీ కుర్ర హీరోల‌కి పోటీగా ఉత్సాహంగా సినిమాలు చేస్తున్నారు. అయితే గ‌తంలో మాదిరిగా స‌ల్మాన్ విజ‌యాలు అందుకోలేక‌పోతున్నారు. ఒక‌ప్పుడు స‌ల్మాన్ సినిమా అంటే ఆ చిత్రం అవ‌లీల‌గా వంద కోట్లు క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టేది. ఇటీవ‌ల స‌ల్మాన్ తెలుగు సినిమాల‌లో కూడా గెస్ట్ అప్పియ‌రెన్స్ ఇస్తూ అల‌రిస్తున్నాడు. అయితే ఇటీవ‌ల  కొంద‌రు  గుర్తు తెలియని వ్యక్తులు సల్మాన్ ఖాన్ ను బెదిరిస్తూ వ‌స్తున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న‌ సెక్యూరిటీ స్ట్రిక్ట్ చేశారు. ఆ మ‌ధ్య ఓ ఈవెంట్‌లో విక్కి కౌశల్ ను కూడా స‌ల్మాన్  బాడీగార్డ్స్ తోసేయ‌డం మ‌నం చూశాం.

ప్ర‌స్తుతం సల్మాన్ ఖాన్   టైగర్ 3 అనే చిత్రం చేస్తుండ‌గా, ఈ మూవీ కోసం సినీ లవర్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కొన్నాళ్లుగా మంచి హిట్ ఇవ్వ‌లేక‌పోయిన స‌ల్మాన్ క‌నీసం ఈ చిత్రంతో అయిన అభిమానుల‌ని అల‌రిస్తాడా అని ఆశ‌గా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్.అయితే తాజాగా ఓ బాలీవుడ్ న‌టి స‌ల్మాన్ సెక్యూరిటీ వ‌ల‌న తాను ఎలాంటి ప‌రిస్థితులు ఎదుర్కొందో చెప్పి హాట్ టాపిక్‌గా నిలిచింది. బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న  హేమశర్మ తాజా ఇంటర్య్వూలో తను అవమానానికి గురైన విష‌యాన్ని చెప్పుకొచ్చి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది.

వంద మంది ముందు త‌న‌ని అవ‌మానించారంటూ త‌న బాధ‌ని బ‌య‌ట‌పెట్టింది హేమ‌శ‌ర్మ‌. ఓ సారి సల్మాన్ ఖాన్ ను కలిసేందుకు వెళ్లిన తనకు ఘోరమైన అవమానం జరిగిందని చెప్పుకొచ్చింది. సల్లూ భాయ్ న‌టించిన ద‌బాంగ్ 3లో మెరిసిన‌  హేమ శర్మ ఆ సినిమా షూటింగ్ సెట్ లో సల్మాన్ తో ఫొటో దిగేందుకు వెళ్లింద‌ట‌. అప్పుడు ఆయన బాడీగార్డ్స్ కుక్కలా తరిమేశారని, సెట్ లో సుమారు 100 మంది చూస్తుండగా అవమానించారని హేమ శర్మ  చెప్పుకొచ్చింది. సల్మాన్ ఖాన్ బాడీగార్డ్స్ తనతో దురుసుగా ప్రవర్తించిన విష‌యం న‌న్ను ఎంతో క‌లిచి వేసింది. ఆ ఘటనతో పది రోజుల వరకు నిద్ర కూడా పట్టలేదని తెలిపింది.

Related Articles

38 ఏళ్ల కెరీర్ లో విక్ట‌రీ వెంక‌టేష్ ఎన్ని సినిమాలను రిజెక్ట్ చేశారు.. అందులో హిట్లు ఎన్నో తెలుసా?

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అత్యధిక సక్సెస్ రేటు ఉన్న హీరోల్లో విక్టరీ వెంకటేష్ ఒకరు. అత్యధిక...

చిత్ర పరిశ్రమలో మరో విషాదం.. అమీర్ ఖాన్ కూతురు మృతి..కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న ఫ్యాన్స్..!

చిత్ర పరిశ్రమను వరుస‌ విషాదాలు వెంటాడుతున్నాయి. అగ్ర సెలబ్రిటీలు మరణించారు అన్న విషాదం మరవకముందే మరొక...

వార్‌2 షూటింగ్ అండ్ క్రేజీ అప్డేట్… ఎన్టీఆర్ క్యారెక్టర్ ఏంటో తెలిసిపోయిందిగా..!

టాలీవుడ్‌లో హీరోలుగా రాణించినప్పటికీ ప్రతి హీరోకి బాలీవుడ్‌లో కూడా తన సత్తా చూపించాలని ఉంటుంది. అలా...

చిరంజీవి VS పవన్.. ఎవ‌రు తగ్గట్లేదుగా..!

మెగాస్టార్ చిరంజీవి మ‌రియు ఆయన సోదరుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి తెలుగులో ఉన్న...