Home Film News Rana Wife: హీరోయిన్స్‌ని మించిన అందంతో సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్న రానా భార్య‌
Film News

Rana Wife: హీరోయిన్స్‌ని మించిన అందంతో సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్న రానా భార్య‌

Rana Wife: లీడ‌ర్ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి ప‌రిచ‌యమైన ద‌గ్గుబాటి రానా బాహుబలి సినిమాతో పాన్ ఇండియా రేంజ్ పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఇక రెండేళ్ల క్రితం క‌రోనా స‌మ‌యంలో రానా, మిహీకాలు వివాహం చేసుకున్నారు. వీళ్ళిద్దరిది ప్రేమ వివాహం కాగా, అప్ప‌టి  కరోనా పరిస్థితుల్లో కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య వీళ్ల పెళ్లి జరిగింది. వీరి పెళ్లి విష‌యం అప్ప‌ట్లో తెగ హాట్ టాపిక్ కూడా అయింది. ఇక మిహీకా వెండితెరపైకి రాకున్నా సోషల్‌ మీడియాలో తరచూ యాక్టీవ్‌గా ఉంటూ ఆస‌క్తిక‌ర పోస్ట్‌లు చేస్తూ నెటిజ‌న్స్ ని అల‌రిస్తూ ఉంటుంది.

రానా భార్య మిహీకా బజాజ్ మోడ్రన్ అమ్మాయి కాగా,ఈ అమ్మ‌డు  బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ ఫ్యామిలీకి బంధువు కూడా. అప్ప‌ట్లో చాలా మోడ్ర‌న్‌గా ఉండే మిహీకా పెళ్లి త‌ర్వాత ప‌ద్ద‌తిగా బ‌ట్ట‌లు ధ‌రించింది. అయితే తాజాగా మోడ్ర‌న్ డ్రెస్‌లో మిహీకా స్ట‌న్నింగ్స్ లుక్స్ తో క‌నిపించి కుర్ర‌కారుకి షాక్ ఇచ్చింది. ఇటీవ‌ల  తన భర్తతో వెకేషన్ కోసం లండన్ ట్రిప్ కు వెళ్లిన మిహికా బజాజ్ అక్క‌డ హ్యాపీ మూమెంట్స్‌తో పాటు మెమోర‌బుల్ మూమెంట్స్‌కి సంబంధించిన పిక్స్ సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ఈ పిక్స్ లో మిహికా హాఫ్ షోల్డర్స్ డ్రెస్ తో తన థైస్ అందాలు కనిపించేలా వ‌య్యారాలు పోయింది. మిహికీనా ఇలా చూసి ప్ర‌తి ఒక్క‌రు షాక్ అవుతున్నారు.

రానా భార్యేనా ఈమె, నిజంగా న‌మ్మ‌బుద్ది కావ‌డం లేదంటూ కామెంట్ చేస్తున్నారు. టాలీవుడ్‌లో హీరోల వైఫ్స్ ఈ రేంజ్‌లో అందాలు ఆర‌బోయ‌డం చాలా త‌క్కువ. బ‌న్నీ భార్య స్నేహా రెడ్డి సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఘాటు అందాల‌తో ర‌చ్చ చేస్తుంటుంది. ఇప్పుడు మిహీకా కూడా అలా చేయ‌డంతో ఈ విషయం చ‌ర్చనీయాంశంగా మారింది. ఇక ఇదిలా ఉంటే మిహీకా ప్రెగ్నెంట్ అంటూ ఆ మ‌ధ్య ప్ర‌చారాలు రాగా, వాటిని మిహీకా ఖండించింది.  నేను ప్రెగ్నెంట్‌ అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. నేను పెళ్లి చేసుకుని చాలా సంతోషంగా ఉన్నాను. నిజంగా నేను ప్రెగ్నెంట్‌ అయితే ఆ విషయాన్ని అందరితో పంచుకుంటాన‌ని పేర్కొంది మిహికా.

Related Articles

Hizli mobil odeme canli bahis siteleri 2023

Hizli mobil odeme canli bahis siteleri 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...