Home Film News Daggubati: త్వ‌ర‌లోనే రానా త‌మ్ముడి పెళ్లి.. శ్రీరెడ్డి ఊరుకుంటుందా?
Film News

Daggubati: త్వ‌ర‌లోనే రానా త‌మ్ముడి పెళ్లి.. శ్రీరెడ్డి ఊరుకుంటుందా?

Daggubati: రామానాయుడు వార‌స‌త్వంతో ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన వెంక‌టేష్‌, సురేష్ బాబు టాలీవుడ్‌లో మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించుకున్నారు.వెంక‌టేష్ హీరోగా మంచి పేరు తెచ్చుకోగా, సురేష్ బాబు టాలీవుడ్ ప్ర‌ముఖ నిర్మాత‌ల‌లో ఒక‌రిగా ఉన్నారు. ఇప్పుడు సురేష్ బాబు వార‌సులుగా ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రానా, అభిరామ్ స‌త్తా చాటే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. రానా న‌టుడిగా, నిర్మాత‌గా ఇండ‌స్ట్రీలో నిల‌దొక్కుకున్నారు. ఇక అభిరామ్ ఇప్పుడిప్పుడే బుడిబుడి అడుగులు వేస్తున్నారు. ఇటీవ‌ల అభిరామ్ హీరోగా వ‌చ్చిన అహింస అనే చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర దారుణంగా బోల్తా కొట్టింది. ఈ సినిమాని తేజ తెర‌కెక్కించినప్ప‌టికీ మూవీ నెగెటివ్ టాక్ తెచ్చుకుంది.

అయితే ఇప్పుడు అభిరామ్ పెళ్లికి సిద్ధ‌మైన‌ట్టు తెలుస్తుంది.  అభిరామ్ పేరు చెప్పగానే అందరికీ గుర్తుకు వచ్చేపేరు శ్రీరెడ్డి. శ్రీరెడ్డి విషయంతోనే అభిరామ్ పేరు తెగ మారుమ్రోగింది.  సినిమాల్లో అవకాశాల కోసం ఇండస్ట్రీకి వచ్చిన శ్రీరెడ్డిని అభిరామ్ మోసం చేశాడ‌ని తెగ ప్ర‌చారం జ‌రిగింది. శ్రీరెడ్డి కూడా ఇదే విష‌యం తెలియ‌జేస్తూ.. అభిరామ్‌తో దిగిన  ప్రైవేట్ ఫోటోలను షేర్ చేస్తూ ఒక్క‌సారిగా ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ అయింది. శ్రీరెడ్డి ఇష్యూతో అభిరామ్ పేరు అంద‌రి నోళ్ల‌లో నాన‌గా, ఇక అహింస చిత్రంతో మ‌నోడికి కొంత గుర్తింపు ద‌క్కింది.  తొలి సినిమా ఫ్లాప్ కావ‌డంతో త‌దుపరి సినిమాతో ఎలా అయిన హిట్ కొట్టాల‌ని అనుకుంటున్నాడు.

ఇక ఇదే స‌మ‌యంలో  దగ్గుబాటి అభిరామ్ మరికొన్ని రోజుల్లోనే పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధ‌మ‌య్యాడ‌నే ఓ వార్త నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. మ‌రి దగ్గుబాటి అభిరామ్ పెళ్లి చేసుకోబోయే యువ‌తి మ‌రెవ‌రో కాదు.. రామానాయుడు తమ్ముడు కూతురి బిడ్డ  అంటే అభిరామ్ కి వరుసకు మరదలు అవుతుంది. ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ నడుస్తుంది కాబట్టి వీలైనంత తొంద‌ర‌గా అభిరామ్  ఎంగేజ్మెంట్ చేసి పెళ్లి కూడా చేసేయాలని దగ్గుబాటి ఫ్యామిలీ ఆలోచిస్తున్న‌ట్టు టాక్ వినిపిస్తుంది. మ‌రి నిజంగా అభిరామ్ పెళ్లి క‌నుక జ‌రిగితే శ్రీరెడ్డి ఎంత ర‌చ్చ చేస్తుందోనంటూ కొంద‌రు ముచ్చ‌టించుకుంటున్నారు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...