Home Special Looks శ్రీదేవి డెత్ మిస్టరీ వీడినట్టేనా?!
Special Looks

శ్రీదేవి డెత్ మిస్టరీ వీడినట్టేనా?!

Was Sridevi Death Mystery Revealed

ఫిబ్రవరి 24 , 2018 న చనిపోయిన ఆమె మరణంపై అనేక అనుమానాలు వెల్లువెత్తాయి. పెద్దగా వయసు కూడా లేని శ్రీదేవి చనిపోయింది అంటే అందరూ షాక్ కి గురయ్యారు. మీడియా దీన్ని భూతద్దంలో చూపెట్టే ప్రయత్నం చేసింది. చాలామంది ఖచ్చితంగా ఏదో కుట్ర జరిగే ఉంటుందని భావించారు. కానీ, అంతిమంగా శ్రీదేవి డెత్ ని ఎలా ఫైనలైజ్ చేశారన్న విషయం మీద ఎంతో మందికి అనుమానాలు కూడా ఉన్నాయి.

రిపోర్ట్స్ ప్రకారం ఫిబ్రవరి 20 న ఆమె తన చిన్న కూతురు ఖుషితో కలిసి దుబాయ్ వెళ్లారు. అక్కడొక తన బంధువు ఒకరిది పెళ్లి జరుగుతోంది. మరో రెండు రోజులు దుబాయ్ లోనే ఉండి.. త్వరలో తన పెద్ద కూతురి 21 వ పుట్టిన రోజు కోసం షాపింగ్ చేయాలి అనుకుంది. అప్పటికి బోనీ కపూర్ ఆమె వెంట లేడు. 24 రోజున ఆమెతో మాట్లాడిన బోనీ ఆ సాయంత్రానికి తన లక్నో మీటింగ్ ముగించుకుని దుబాయ్ చేరుకున్నాడు. శ్రీదేవిని కలుసుకుని ఒక అరగంట పాటు మాట్లాడుకున్న తర్వాత.. డిన్నర్ కి వెళ్లాల్సిన టైమ్ లో ఆమె ఫ్రెష్ అప్ అవడానికి బాత్ రూమ్ కి వెళ్ళి.. ఎంతసేపటికీ తిరిగి రాకపోవటంతో బోనీకి అనుమానం వచ్చింది.

ఇక అంతే, నేరుగా బయటికి వచ్చింది మరణ వార్త మాత్రమే. ముందు ఆమె గుండెపోటుతో చనిపోయిందేమో అనుకున్నారు. కానీ, తర్వాత దుబాయ్ పోలీసుకు చేసిన ఫోరెన్సిక్ తర్వాత తేలింది ఆమె ప్రమాదవశాత్తు మునిగే చనిపోయారని. కానీ, దీనివెనక ఏదో ఉంది అన్న అనుమానం ఎవ్వరికీ పోలేదు. కొందరు తమకి అవైలబుల్ గా ఉన్న ఇన్ఫో తో ముందుకు వచ్చి.. ఇది ఖచ్చితంగా హత్యేనని, దోషులైన వాళ్ళని గుర్తించి శిక్షించాలని గొడవ చేశారు.

నిజానికి శ్రీదేవిని హత్య చేయడానికి ఆస్కారం ఉన్న పరిస్తితులు కూడా ఉన్నాయి. ఆమె నటిగా రాణించిన టైమ్ లో వస్తున్న ఆదాయాన్నంత తన తండ్రి మేనేజ్ చేస్తూ ఉండేవాళ్ళట. ఆయన నమ్మకంగా స్నేహితులు, బంధువుల దగ్గర ఉంచిన బ్లాక్ మనీ (అప్పట్లో నటీ నటులకి టాక్స్ ఎగ్గొట్టడం కోసం బ్లాక్ మనీనే ఇచ్చేవాళ్ళట) అంతా వాళ్ళే దోచేశారు. శ్రీదేవి తండ్రి చనిపోగానే వాళ్ళు ఆ పని చేశారు. ఆ తర్వాత వాళ్ళ లేచిపోయి పెళ్లి చేసుకున్న తన చెల్లి రూపంలో కూడా ఒక కోర్టు కేస్ ఎదుర్కుంది శ్రీదేవి. వాళ్ళమ్మని మోసం చేసి.. ఆస్తంతా తన పేరు మీద రాయించుకున్నట్లు నింద మోసి ఎంతో బాధ అనుభవించింది అని చెప్తారు.

బోనీ కపూర్ ని పెళ్లి చేసుకునే సమయానికి ఆమె దగ్గర డబ్బులే లేవంటే నమ్మక తప్పదు. అంతకుముందే మిథున్ చక్రవర్తిని పెళ్లి చేసుకున్నట్లు వార్తల్లో వినిపించినా.. ఆ రిలేషన్ లో నిజం ఉంటే.. ఆమె అక్కడ కూడా ఎంతో పెయిన్ అనుభవించి ఉంటారు. ఇలాంటి కారణాలెన్నో ఆమెని కుంగదీసి చివరికి ఆల్కహాల్ కి కూడా అడిక్ట్ చేసాయి. చిన్నవయసులో సినిమాల్లోకి రావడం మూలాన ఆమెకి అందరిలా పెరిగే అవకాశం రాలేదు. చాలా తొందరగా పరిచయమైన ఫేమ్ ని నిలబెట్టుకోవడానికి ఆమె చాలా కష్టపడింది. అందంపై మక్కువతో కాస్మెటిక్ సర్జరీలు కూడా చేయించకున్న శ్రీదేవి మానసికంగా చాలా వేదనతో ఉండటం అలా ఆకస్మికంగా చనిపోవడానికి కారణమయ్యాయని ఆమెని ఎంతగానో ఆరాధించిన ఆర్జీవీ ఆమె మరణానంతరం చెప్పుకొచ్చాడు. ఆమె ఎలా చనిపోయినా.. అర్థాంతరంగా వేదనతో చనిపోవడం బాధాకరం.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Jabardasth Anchor: జాకెట్ విప్పి మరీ యువ‌త‌ని రెచ్చ‌గొడుతున్న జ‌బ‌ర్ధ‌స్త్ యాంక‌ర్..క్రేజీ కామెంట్స్‌తో నెటిజ‌న్స్ ర‌చ్చ‌

Jabardasth Anchor: బుల్లితెర కామెడీ షోలో కామెడీనే కాదు గ్లామ‌ర్ షో కూడా భీబ‌త్సంగా ఉంది....

‘నిజం’ సినిమాలో తనని మోసం చేశారన్న రాశి!

ఆమె ఒకప్పుడు స్టార్ హీరోయిన్. కానీ తర్వాత అవకాశాలు తగ్గిపోతూ వచ్చాయి. మళ్ళీ సినిమాల్లో కనిపిస్తుందో...

ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్లుగా మారిన హీరోలు!

హిందీ, తెలుగు, తమిళ్, మలయాళ ఇలా ఏ భాషలో చూసినా సాధారణంగా ఒక విషయం గమనిస్తూ...

రాబోయే నెలల్లో భారీ అంచనాలతో రాబోతున్న సినిమాలివే..

సినీ అభిమానులు కరోనా కారణంగా చాలా కాలంగా థియేటర్ లో సినిమాలు చూడటాన్ని బాగా మిస్...