Home Film News Mahesh Babu: మ‌హేష్ బాబు త‌న భార్య‌కి ఇచ్చిన ఫ‌స్ట్ గిఫ్ట్ ఏంటో తెలిస్తే ఆశ్య‌ర్య‌పోతారు..!
Film News

Mahesh Babu: మ‌హేష్ బాబు త‌న భార్య‌కి ఇచ్చిన ఫ‌స్ట్ గిఫ్ట్ ఏంటో తెలిస్తే ఆశ్య‌ర్య‌పోతారు..!

Mahesh Babu: టాలీవుడ్‌లో మోస్ట్ ల‌వ‌బుల్ కపుల్ అంటే ఠ‌క్కున గుర్తొచ్చే జంట మ‌హేష్ బాబు, న‌మ్ర‌త‌. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఇప్ప‌టికీ చాలా అన్యోన్యంగా క‌లిసి జీవిస్తున్నారు. పెళ్లైన త‌ర్వాత న‌మ్ర‌త పూర్తిగా సినిమాలు మానేసి కుటుంబ బాధ్య‌త చూసుకుంటుంది. ఇక మ‌హేష్ సినిమా షూటింగ్‌కి బ్రేక్ వ‌స్తే ఫ్యామిలీతో షికారుకి వెళుతుంటాడు. కొద్ది రోజుల క్రిత‌మే వారు హైద‌రాబాద్‌లో ల్యాండ్ అయ్యారు. నమత్రా – మహేశ్ లా పెళ్లి జరిగి 18 ఏళ్లు గ‌డిచిన వీరిద్ద‌రి మ‌ధ్య ఎలాంటి మ‌న‌స్ప‌ర్ధ‌లు లేవు. న‌లుగురికి ఆద‌ర్శంగా ఉండేలా ఈ జంట ఉంటున్నారు. 2000లో వచ్చి న వంశీ చిత్రంతో వీరిద్దరూ ఒక్కటి కాగా,  2005 వ‌ర‌కు ప్రేమ‌లో మునిగి తేలారు.

ఆ త‌ర్వాత ఇరు కుటుంబ స‌భ్యుల‌ని ఒప్పించి  ముంబైలో పెద్దల సమక్షంలోనే పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి ఫొటోలు అప్పుడప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంటాయి. ఇక రీసెంట్‌గా  ఓ జ్యూయెల్లరీ ఓపెనింగ్ కు వచ్చిన నమ్రతా మహేశ్ తనికిచ్చిన ఫస్ట్ గిఫ్ట్ గురించి చెబుతూ అంద‌రికి షాకిచ్చింది.  వెడ్డింగ్ రింగ్‌ని మ‌హేష్‌కి త‌న‌కు మొద‌ట బ‌హుమ‌తిగా ఇచ్చాడ‌ని పేర్కొన్న న‌మ్ర‌త‌.. త‌న‌కు  నగలపై పెద్దగా ఆసక్తి ఉండదని  పేర్కొంది. సింపుల్ గానే ఉండేందుకు తాను ఎక్కువ ఇష్ట‌ప‌డ‌తాన‌ని చెప్పిన న‌మ్ర‌త‌..పెద్ద‌గా షాపింగ్స్ కి కూడా వెళ్ల‌న‌ని పేర్కొంది.

ఎనిమిదేళ్ల వ‌యస్సు ఉన్న‌ప్పుడు త‌న త‌ల్లి ఇచ్చిన  సాయిబాబా బంగారు ఉంగరం అంటే త‌న‌కు  చాలా ఇష్టమని న‌మ్ర‌త చెప్పుకొచ్చింది. ఇప్ప‌టికీ ఆ ఉంగ‌రం త‌నతోనే ఉంటుంద‌ని పేర్కొంది. ఇక  భ‌విష్య‌త్‌లో  మహేశ్ బాబుతో కలిసి నటించే ఛాన్స్ ఉందా? అనే ప్రశ్నకు స్పందించిన న‌మ్ర‌త‌.. త‌నకు సినిమాల్లోకి రావాలనే ఉద్దేశం లేదని పేర్కొంది. 23 ఏళ్లుగా నటనరంగానికి దూరంగా ఉంటున్న న‌మ్ర‌త‌.. ప్రొడ్యూసర్ గా మాత్రం గతేడాది ‘మేజర్’ సినిమాను ప్రేక్షకులకు ముందుకు తీసుకొచ్చి మంచి విజ‌యం త‌న ఖాతాలో వేసుకుంది. ఇక మ‌హేష్ బాధ్య‌త‌ల‌తో పాటు,  వ్యాపారాలు, పిల్లలు సితారా, గౌతమ్ లను చూసుకుంటూ బిజీగా గ‌డుపుతుంది న‌మ్ర‌త‌.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...