Home Film News Chaitanya: విడాకుల త‌ర్వాత చైత‌న్య తొలి పోస్ట్‌.. విడిపోయి మంచి ప‌ని చేశావ్ అంటూ నెటిజ‌న్స్ కామెంట్స్
Film News

Chaitanya: విడాకుల త‌ర్వాత చైత‌న్య తొలి పోస్ట్‌.. విడిపోయి మంచి ప‌ని చేశావ్ అంటూ నెటిజ‌న్స్ కామెంట్స్

Chaitanya: కొద్ది రోజుల క్రితం నిహారిక‌, చైత‌న్య‌లు త‌మ విడాకుల విష‌యాన్ని అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. 2020 డిసెంబర్‌లో చైతన్య జొన్నలగడ్డతో ఏడ‌డుగులు వేసిన నిహారిక అప్పటినుంచి వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ వ‌చ్చింది. పెళ్లైన రెండేళ్ల త‌ర్వాత ఇద్ద‌రి మ‌ధ్య అనేక విబేధాలు వ‌చ్చాయి. దీంతో అనూహ్యంగా వీళ్లిద్దరి డివోర్స్ తీసుకొని అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. ఇద్దరు భిన్న నేపథ్యాల నుండి వ‌చ్చిన వారు కావడంతో పరిస్థితులు అర్థం కావడానికి, అర్థం చేసుకోవడంలో ఇబ్బంది తలెత్తిన నేపథ్యంలో గ్యాప్‌ పెరిగడం వ‌ల‌న విడాకులు తీసుకొని ఉంటార‌ని అంద‌రు భావిస్తున్నారు.

గత కొన్ని రోజులుగా నిహారిక, చైత‌న్య‌లు దూరంగా ఉంటున్నారనే ప్ర‌చారం జరిగింది. చైతన్య.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెళ్లి ఫోటోలు ఎప్పుడైతే డిలీట్ చేశాడో అప్ప‌టి నుండి ఈ ప్ర‌చారం జ‌రిగింది. నిహారిక కూడా త‌న పెళ్లి ఫోటోలు, చైతన్యతో ఉన్న ఫోటోలను డిలీట్ చేయ‌డంతో ఇక వీరిద్ద‌రు విడాకులు తీసుకున్న‌ట్టు క‌న్‌ఫాం అయింది. అయితే జూలై 5న అటు చైతన్య, ఇటు నిహారిక పరస్పరం తమ అంగీకారంతో విడాకులు తీసుకుంటున్నట్టు సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేశారు. త‌మ‌కి కొంత ప్రైవ‌సీ ఇవ్వాలని కూడా కోరారు.

 

అయితే విడాకుల ప్ర‌క‌ట‌న త‌ర్వాత తొలిసారి చైత‌న్య త‌న ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టాడు. త‌న 33వ బర్త్ డే సంద‌ర్భంగా వెకేషన్‌లో ఉన్న ఫోటోని పంచుకుంటూ ఆల్ త్రీస్ ఇన్ స్టయిల్‌ అని క్యాప్షన్ రాసుకొచ్చాడు. చైత‌న్య కామెంట్‌తో పాటు ఆయ‌న కూర్చున్న తీరు చూసి నెటిజ‌న్స్ ప‌లు రకాల కామెంట్స్ చేస్తున్నారు. నిహారిక నుండి విడిపోయి మంచి పనిచేశావని, ఇప్పుడు ఫ్రీ అయ్యావని, ఇప్పుడు ఇక ఫుల్ ఎంజాయ్ చేయ‌మ‌ని అంటున్నారు. నువ్వు ఇప్పుడు చాలా ల‌క్కీ ప‌ర్స‌న్. ఆమెతో విడిపోయి జీవితం నిల‌బెట్టుకున్నావు. ఇప్ప‌టి నుండి అయిన జాగ్ర‌త్త‌గా ఉండు అంటూ నెటిజ‌న్స్ ప‌లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక విడాకుల తర్వాత నిహారిక కూడా ఫ్రీ బర్డ్ లా ఎంజాయ్‌ చేస్తుంది. ఆమె దుస్తులు, గ్లామర్ షో పీక్స్ లో ఉంది.

 

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...