Home Film News Honey Rose: సర్జరీ చేయించుకోబోతున్న హనీరోజ్.. విషయం తెలిసి జాగ్రత్తలు చెబుతున్న నెటిజన్స్
Film News

Honey Rose: సర్జరీ చేయించుకోబోతున్న హనీరోజ్.. విషయం తెలిసి జాగ్రత్తలు చెబుతున్న నెటిజన్స్

Honey Rose: బబ్లీ బ్యూటీ హనీ రోజ్ వీరసింహారెడ్డి చిత్రం తర్వాత ఒక్క‌సారిగా లైమ్ లైట్‌లోకి వ‌చ్చింది. ఆల‌యం, ఈ వ‌ర్షం సాక్షిగా వంటి చిత్రాలలో న‌టించిన కూడా పెద్ద‌గా గుర్తింపు తెచ్చుకోలేక‌పోయింది. దాదాపు ఎనిమిదేళ్ల త‌ర్వాత వీర‌సింహారెడ్డి చిత్రంలో న‌టించిన ఈ అందాల భామ బాల‌య్య త‌ల్లిగా, భార్య‌గా అద‌ర‌గొట్టి మంచి మార్కులు ద‌క్కించుకుంది. ఈ సినిమా త‌ర్వాత హనీరోజ్‌కి సినిమా అవ‌కాశాలు అయితే పెద్ద‌గా రాలేదు కాని, , షాపింగ్ ఓపెనింగ్స్‌కి సంబంధించిన ఆహ్వానాలు చాలానే వ‌చ్చాయి. ఆ స‌మ‌యంలో హ‌నీ రోజ్‌ని చూడ‌డానికి అభిమానులు పెద్ద ఎత్తున వ‌చ్చారు.

ఇక ఈ అమ్మ‌డు సోష‌ల్ మీడియాలో అందాల ఆర‌బోత‌తో ప్ర‌తి ఒక్క‌రిని మంత్ర ముగ్ధుల‌ని చేస్తుంది. కేక పెట్టించేలా ఈ బ్యూటీ హాట్ లుక్స్ ఉండ‌డంతో కుర్ర‌కారు పిచ్చెక్కిపోతున్నారు. హనీరోజ్ ను చూసిన అభిమానులు అయితే అప్సరస దిగివచ్చిందా అనుకొని, ఆమె వెంటపడ్డంత పని అయితే చేశారు. రాను రాను హ‌నీరోజ్‌కి టాలీవుడ్ లో డిమాండ్ పెరుగుతుంది. కాక‌పోతే మేక‌ర్స్ మాత్రం వారి ఆశ‌లు అడియాశ‌లు చేస్తున్నారు. అందుకు కార‌ణం ఇప్ప‌టి వ‌ర‌కు హ‌నీరోజ్‌ని ఏ తెలుగు సినిమాలో ఎంపిక చేయ‌లేదు. సోష‌ల్ మీడియాలో విధ్వంసం సృష్టిస్తున్న ఈ భామ సినిమాలకి ఎంపిక కాక‌పోవ‌డం ఫ్యాన్స్ కి కాస్త నిరాశ‌ని క‌లిగిస్తుంది.

 

అయితే తాజాగా హ‌నీరోజ్‌కి సంబంధించిన ఓ వార్త నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. కొంద‌రు హీరోయిన్స్ మాదిరిగా హనీ రోజ్ కూడా అందం కోసం సర్జరీ చేయించుకోనున్నార‌ని ప్రచారం జరుగుతుంది. ఈ వార్త‌లు జోరుగా సాగుతున్న నేప‌థ్యంలో హనీ స్పందించారు. నేను ఎలాంటి సర్జరీలు చేయించుకోవ‌డంలేదు. చేయించుకోను కూడా. నాది సహజ అందమే. నేను గ్లామర్ కోసం కేవ‌లం కాస్మెటిక్ వాడతాను, సర్జరీలను ఆశ్రయించను అంటూ హ‌నీ రోజ్ చెప్పుకొచ్చింది. అభిమానులు సైతం అలాంటి వాటి జోలికి వెళ్లి లేని పోని స‌మ‌స్య‌లు తెచ్చుకోవ‌ద్దు అంటూ స‌ల‌హాలు ఇస్తున్నారు. ఇక హనీ రోజ్ తదుపరి మూవీ టైటిల్ రాచెల్ కాగా, తెలుగులో ఈ చిత్రానికి రాహేలు అనే టైటిల్ ఖరారు చేశారు. పాన్ ఇండియా మూవీగా ఇది తెలుగు తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది.

 

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...