Home Film News Bigg Boss 7: వెయిటింగ్‌కి పులిస్టాప్.. బిగ్ బాస్ 7 ప్రోమో విడుద‌ల‌..కౌంట్ డౌన్ స్టార్ట్
Film News

Bigg Boss 7: వెయిటింగ్‌కి పులిస్టాప్.. బిగ్ బాస్ 7 ప్రోమో విడుద‌ల‌..కౌంట్ డౌన్ స్టార్ట్

Bigg Boss 7: బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదం పంచే రియాలిటీ షోల‌లో బిగ్ బాస్ ఒక‌టి. విదేశాల‌లో మొద‌లైన ఈ షో మెల్ల‌గా హిందీలో అడుగుపెట్టి అక్క‌డ మంచి ఆద‌ర‌ణ ద‌క్కించుకొని  ఆ త‌ర్వాత ప‌లు భాష‌ల‌కి పాకింది. తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం ఇలా ప‌లు ప్రాంతీయ భాష‌ల‌లో మంచి టీఆర్పీ ద‌క్కించుకుంది. తెలుగు విష‌యానికి వ‌స్తే ఇక్క‌డ ఈ షో ఆరు సీజ‌న్స్‌తో పాటు ఒక ఓటీటీ సీజ‌న్ పూర్తి చేసుకుంది. త్వ‌ర‌లోనే సీజ‌న్ 7 ప్రారంభం కానుంద‌ని కొద్ది రోజులుగా వార్త‌లు వినిపిస్తుండ‌గా, ఎట్ట‌కేల‌కు మేక‌ర్స్ ప్రోమోతో క్లారిటీ ఇచ్చారు. ఈ ప్రోమోతో షో త్వ‌ర‌లోనే మొద‌లు కానుంద‌ని క్లారిటీ వ‌చ్చింది.

అయితే తాజాగా విడుద‌లైన ప్రోమోలో  ఎలాంటి డిటైల్స్ షేర్ చేయలేదు. కేవలం సీజన్ 7 లోగో ఆవిష్కరించి,  హోస్ట్ ఎవరనే సస్పెన్స్ మాత్రం కొన‌సాగించారు. తొలి సీజ‌న్ ఎన్టీఆర్ హోస్ట్ చేయ‌గా, ఆ సీజ‌న్ మంచి హిట్ అయింది. ఇక సీజన్ 2 హోస్ట్ గా హీరో నాని వ్యవహరించ‌గా,  సీజన్ 3 నుండి నాగార్జున కొనసాగుతూ వ‌స్తున్నారు. అయితే ఆరు సీజ‌న్స్‌ల‌లో మొద‌టి ఐదు సీజన్స్ మంచి ఆద‌ర‌ణ ద‌క్కించుకున్నా ఆరో సీజ‌న్ మాత్రం దారుణ‌మైన రేటింగ్ ద‌క్కించుకుంది.  కనీసం సీరియల్ కి వచ్చే రేటింగ్ కూడా రాక‌పోవ‌డం నిర్వాహ‌కుల‌కి షాకింగ్‌గా మారింది.

సీజ‌న్ 6లో  వీకెండ్స్ కి కూడా కూడా 4 రేటింగ్ దాటలేకపోయింది. చెప్పాలంటే సీజన్ 6 మొత్తం విమ‌ర్శ‌లు ఎక్కువ వినిపించాయి. స్ట్రాంగ్ కంటెస్టెంట్స్‌ని బ‌య‌ట‌కు పంపించ‌డం, అన్ని ముందుగానే లీక్ కావడం, తెలియని కంటెస్టెంట్స్ హౌజ్‌లో అడుగుపెట్ట‌డం, షో మ‌రీ లేట్ గా ప్ర‌సారం కావడం వంటివి సీజ‌న్ 6 రేటింగ్ మ‌రింత త‌గ్గేలా చేశాయి. సీజ‌న్ 6 ఫెయిల్యూర్స్ నుండి కొన్ని   పాఠాలు నేర్చుకున్న నిర్వాహకులు సీజన్ 7 గట్టిగా ప్లాన్ చేశారని తెలుస్తుంది. నాగార్జున స్థానంలో వేరే హోస్ట్‌ని తీసుకోవ‌డంతో పాటు కంటెస్టెంట్స్ విష‌యంలో కూడా ప్ర‌త్యేక శ్ర‌ధ్ద పెట్టార‌ని టాక్ .తాజాగా విడుద‌లైన ప్రోమోలో లోగో త‌ప్ప ఎలాంటి ఇన్ఫ‌ర్మేష‌న్ ఇవ్వ‌ని నిర్వాహ‌కులు త‌ర్వాతి ప్రోమోలో మాత్రం హోస్ట్ ఎవ‌ర‌నేది త‌ప్పక రివీల్ చేయ‌నున్నారు.

Related Articles

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...

Samantha: స‌మంత మేనేజ‌ర్ మోసం.. అడ్డంగా బుక్ అయ్యాడుగా…!

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న క్యూట్‌నెస్ తో పాటు...