Home Film News No Entry For Dalits: ఆదిపురుష్ థియేట‌ర్స్‌లోకి ద‌ళితుల‌కి ఎంట్రీ లేదా.. నిజ‌మేంటంటే.!
Film News

No Entry For Dalits: ఆదిపురుష్ థియేట‌ర్స్‌లోకి ద‌ళితుల‌కి ఎంట్రీ లేదా.. నిజ‌మేంటంటే.!

No Entry For Dalits: ప్ర‌స్తుతం ఎక్క‌డ చూసిన ఏ నోట విన్నా కూడా ఆదిపురుష్ చిత్రం గురించే చ‌ర్చ న‌డుస్తుంది. రామాయ‌ణ ఇతిహాసం నేప‌థ్యంలో రామాయ‌ణం చిత్రం తెర‌కెక్కించ‌గా, ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక‌ని రీసెంట్‌గా తిరుప‌తిలో అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హించారు. ఈవెంట్ కి తిరుప‌తి మొత్తం క‌దిలి వ‌చ్చిందా అన్న‌ట్టుగా ప్రాంగ‌ణం మొత్తం జ‌న‌సందోహంతో నిండిపోయింది. ఇక ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌తో ఆదిపురుష్‌పై అంచ‌నాలు భారీగా పెర‌గ‌డంతో పాటు సినిమా ప్రీరిలీజ్‌ బిజినెస్ కూడా భారీగా జ‌రిగిన‌ట్టు తెలుస్తుంది.. ఈవెంట్‌లో `జై శ్రీరామ్‌` నినాదాలు హోరెత్తాయి. ఈవెంట్ కి ముఖ్య అతిథిగా వ‌చ్చిన చిన‌జీయ‌ర్ స్వామి రాముడే అసలైన బాహుబలి అని చెప్ప‌డం వివేషం.

గ‌త కొద్ది రోజులుగా `ఆదిపురుష్‌` హంగామా ఓ వైపు పీక్‌లోకి వెళ్తున్న నేపథ్యంలో కొంద‌రు ప‌నిగ‌ట్టుకొని చిత్రంపై నెగెటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు. రామాయ‌ణం నేప‌థ్యంలో చిత్రం తెర‌ర‌కెక్కింది కాబ‌ట్టి మతానికి, కులాలకు ముడిపెట్టి గొడ‌వ‌లు క్రియేట్ చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే `ఆదిపురుష్‌` ప్రదర్శించే థియేటర్లలోకి దళితులకు అనుమతి లేదనే కొత్త పోస్ట్ సృష్టించారు. ఇందులో `రామాయణ పారాయణం జరిగే చోట పవిత్రంగా ఉండాలనేది మా నమ్మకం, ఈ నమ్మకాన్ని గౌరవిస్తూ, ప్రభాస్‌ రాముడిగా నటించిన ఆదిపురుష్‌ సినిమా ప్రదర్శించే థియేటర్లలో దళితులకు ప్రవేశం లేదు. ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ స్థాయిలో ధర్మం కోసం నిర్మించిన ఈ సినిమాని హిందువులు అందరూ తప్పకుండా వీక్షించాలి` అని ఈ పోస్ట్ లో రాసి ఉంది.

 

ఈ పోస్ట్‌ని యూవీ క్రియేషన్స్, పీపుల్స్ మీడియాఫ్యాక్టరీ, `ఆదిపురుష్‌` టీమ్‌ వెల్లడించినట్టుగా సృష్టించారు. కొద్ది నిమిషాల‌లోనే ఈ పోస్ట్ వైర‌ల్ కావ‌డంతో దీనిపై ఆదిపురుష్ టీం స్పందించింది. ఇది ఫేక్‌ న్యూస్‌ అని, ఇలాంటివి వాటిని నమ్మవద్దని తెలియ‌జేసింది. `ఆదిపురుష్‌` టీమ్‌ కుల, వర్ణ, మతం ఆధారంగా ఎలాంటి వివక్షను చూపకుండా సమానత్వం కోసం దృఢంగా నిలుస్తుందని పేర్కొంది. ఈ చెడును ఎదురించే క్రమంలో మాకు కూడా సహాయం చేయాలని కోరింది. `ఆదిపురుష్‌` ప్రతి భారతీయుడిది అని, చెడుపై మంచి గెలుస్తుందని చిత్ర బృందం వెల్ల‌డించింది. సుమారు ఐదు వందల కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఆదిపురుష్ సినిమా జూన్‌ 16న భారీ ఎత్తున రిలీజ్ కానుంది.

Related Articles

దివంగత శ్రీదేవికి.. ఎన్టీఆర్ దేవర సినిమాకు ఉన్న లింక్ ఏంటో తెలుసా..? కొరటాల స్కెచ్ మామూలుగా లేదుగా..!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్లో ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ దేవర.. పాన్ ఇండియా...

అది నాకు ఎప్పుడో తెలుసు.. నాగచైతన్య హీరోయిన్ సాయి పల్లవి గురించి సమంత హాట్‌ కామెంట్స్..!

ప్రస్తుతం ఇదే వార్త చిత్ర పరిశ్రమలో ఎంతో వైరల్ గా మారింది. ఇన్ని రోజులు ఎంతో...

బిగ్ బ్రేకింగ్: “షణ్ముఖ్” కేసులో బయటపడ్డ కొత్త కోణం.. అన్నిటికీ కారణం “యాంకరే” నా..?

షణ్ముఖ్ జస్వంత్ ఈ పేరు గురించి అందరికీ ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. యూట్యూబ్లో వచ్చిన...

హీరో తేజ స‌జ్జ త‌ల్లిదండ్రులు ఎవ‌రు.. సినిమా ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. !?

తేజ స‌జ్జ‌.. ప్ర‌స్తుతం ఈ యువ హీరో పేరు మారుమోగిపోతోంది. 2024లో సంక్రాంతి పండుగ కానుక‌గా...