Home Film News Shanmukh Jaswanth: వీల్ చైర్‌లో ష‌ణ్ముఖ్ జ‌స్వంత్‌.. ఏమైంది అంటూ ఆరాలు తీస్తున్న అభిమానులు
Film News

Shanmukh Jaswanth: వీల్ చైర్‌లో ష‌ణ్ముఖ్ జ‌స్వంత్‌.. ఏమైంది అంటూ ఆరాలు తీస్తున్న అభిమానులు

Shanmukh Jaswanth: యూట్యూబ‌ర్ ష‌ణ్ముఖ్ జ‌స్వంత్ గురించి కొత్త‌గా చెప్పాల్సిన ప‌నిలేదు. బిగ్ బాస్‌లో మనోడు సిరితో క‌లిసి చేసిన ర‌చ్చ‌కు ఫుల్ పాపులారిటీ ద‌క్కించుకున్నాడు. ప్రొఫెషనల్‌గా పని చేస్తోన్న సమయంలోనే  దీప్తీ సునయన ప్రేమలో పడిన షణ్ముఖ్ జస్వంత్ ఆమెతో చాలా రోజుల పాటు స‌ర‌దాగా సంతోషంగా ఉన్నారు.. అయితే  వీళ్లిద్దరూ వ్యక్తిగతంగా కంటే జోడీగానే ఫుల్‌ పాపులర్ అయ్యారు. అనేక వెబ్ సిరీసులు, కవర్ సాంగ్స్ లో జంటలుగా నటించి తెగ అల‌రించారు..ష‌ణ్ముఖ్ క‌ష్టాల‌లో ఉన్న‌ప్పుడు కూడా దీప్తి అత‌నికి చాలా అండ‌గా నిలిచింది. అయితే బిగ్ బాస్ త‌ర్వాత ఈ జంట మ‌ధ్య గ్యాప్ వ‌చ్చింది. ఎవ‌రి లైఫ్ వారు లీడ్ చేస్తున్నారు.

బిగ్ బాస్ తెలుగు ఐదో సీజన్‌లోకి కంటెస్టెంట్‌గా వెళ్లిన‌ షణ్ముఖ్ జస్వంత్ .. సిరి హన్మంత్‌తో ఎప్పుడూ కలిసే ఉండడం.. కలిసే ఆడడం.. కలిసే తినడం.. కలిసే పడుకోవడం వంటివి చేయ‌డం జ‌నాల‌కి చిరాకు తెప్పించింది. తరచూ ముద్దులు.. హగ్గులు చేసుకోవడం వంటివి చేయ‌డంతో బ్యాడ్ ఇమేజ్‌ను కూడా మూట‌గ‌ట్టుకున్నాడు. దీంతో దీప్తి కూడా అత‌నితో రిలేష‌న్‌కి పులిస్టాప్ పెట్టింది. సోషల్ మీడియాలో ప్రకటన చేస్తూ త‌న బ్రేక‌ప్ విష‌యాన్ని తెలియ‌జేసింది దీప్తి. ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తున్నానని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్టును షేర్  చేశాడు ష‌ణ్ముఖ్‌. ఈ పోస్ట్ అప్పట్లో ఎంత వైర‌ల్ అయిందో మ‌నకు తెలిసిందే.

అయితే ప్ర‌స్తుతం ప‌లు ఇంట్రెస్టింగ్ వీడియోలు చేస్తూ అలానే సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలియ‌జేస్తున్నారు. తాజాగా ష‌ణ్ముఖ్‌ తన ఇన్‌స్టాలో ఒక స్టోరీ పంచుకున్నాడు.అందులో తను తన తాతయ్య కోసం వీల్ చైర్ తీసుకొని రాగా దాంట్లో కాసేపు కూర్చొని సరదాగా ఆడుకుంటూ సంద‌డి చేశాడు. తను ఇంట్లో ఉంటే చిన్నపిల్లలాగా అల్లరి చేస్తాన‌ని అన్నాడు. మొత్తానికి ఆ వీడియో బాగా వైరల్ అయింది.అయితే కొంద‌రు స‌డెన్‌గా ష‌ణ్ముఖ్‌ని అలా వీల్ చైర్‌లో చూసి అత‌నికి ఏమైందా అని ఆందోళ‌న చెందుతున్నారు. విష‌యం తెలుసుకొని ముసిముసి న‌వ్వులు న‌వ్వుకుంటున్నారు.  కొంతమంది హేటర్స్ ఎప్పటిలాగే  అత‌నిని తెగ ట్రోల్ చేస్తున్నారు..

Related Articles

దివంగత శ్రీదేవికి.. ఎన్టీఆర్ దేవర సినిమాకు ఉన్న లింక్ ఏంటో తెలుసా..? కొరటాల స్కెచ్ మామూలుగా లేదుగా..!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్లో ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ దేవర.. పాన్ ఇండియా...

అది నాకు ఎప్పుడో తెలుసు.. నాగచైతన్య హీరోయిన్ సాయి పల్లవి గురించి సమంత హాట్‌ కామెంట్స్..!

ప్రస్తుతం ఇదే వార్త చిత్ర పరిశ్రమలో ఎంతో వైరల్ గా మారింది. ఇన్ని రోజులు ఎంతో...

బిగ్ బ్రేకింగ్: “షణ్ముఖ్” కేసులో బయటపడ్డ కొత్త కోణం.. అన్నిటికీ కారణం “యాంకరే” నా..?

షణ్ముఖ్ జస్వంత్ ఈ పేరు గురించి అందరికీ ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. యూట్యూబ్లో వచ్చిన...

హీరో తేజ స‌జ్జ త‌ల్లిదండ్రులు ఎవ‌రు.. సినిమా ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. !?

తేజ స‌జ్జ‌.. ప్ర‌స్తుతం ఈ యువ హీరో పేరు మారుమోగిపోతోంది. 2024లో సంక్రాంతి పండుగ కానుక‌గా...