Home Film News Srireddy: ద‌మ్ముంటే ఆదిపురుష్ డైరెక్ట‌ర్‌ని కొట్టండంటూ శ్రీరెడ్డి షాకింగ్ కామెంట్స్…!
Film News

Srireddy: ద‌మ్ముంటే ఆదిపురుష్ డైరెక్ట‌ర్‌ని కొట్టండంటూ శ్రీరెడ్డి షాకింగ్ కామెంట్స్…!

Srireddy: యంగ్ రెబ‌ల్ స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా జూన్ 16న భారీ ఎత్తున విడుద‌లైన విష‌యం తెలిసిందే. సంక్రాంతికి విడుద‌ల కావ‌ల‌సిన ఈ చిత్రం ప‌లు కార‌ణాల వ‌ల‌న నిన్న విడుద‌లైంది. అయితే భారీ అంచ‌నాల‌తో వ‌చ్చిన ఈ సినిమా కొంద‌రిని తీవ్రంగా నిరాశ‌ప‌ర‌చింది. ఈ సినిమాపై కొంద‌రు సినీ అభిమానులు, నెటిజన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. రామాయణం ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో పాత్రలను సరిగా తీర్చిదిద్దలేదని దర్శకుడు ఓం రౌత్ పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. రావ‌ణుడి పాత్ర‌తో పాటు క‌థ‌ని చాలా వ‌క్రీక‌రించార‌ని మండిప‌డుతున్నారు. సోష‌ల్ మీడియాలో ద‌ర్శ‌కుడిని దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.  రామాయణంలో ఉన్న కథను పూర్తిగా మార్చేసి తనకు నచ్చినట్టు సినిమా తీశారంటూ ఓం రౌత్ ని ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు.

చిత్వీరంలో ఎఫ్ఎక్స్, రావణుడి పాత్ర బాలేదంటూ కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు. థియేట‌ర్ బ‌య‌ట కూడా కొంద‌రు ఇదే కామెంట్స్ చేస్తున్నారు.నిన్న ఓ సినీ ప్రేక్ష‌కుడు ఆదిపురుష్ చిత్రం ఏమి బాలేద‌ని కామెంట్ చేయ‌గా, ఆ వ్య‌క్తిని ప్ర‌భాస్ అభిమానులు చిత‌కబాదారు. అందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాని షేక్ చేసింది. దీనిపై శ్రీరెడ్డి ఘాటుగా స్పందించింది.అరేయ్, ప్రభాస్ ఫ్యాన్స్ కి దమ్ము ఉంటే వెళ్ళి ఆ దర్శకుడు ఓం రౌత్‌ ను కొట్టండని చురకలు అంటించింది.  ఐ మాక్స్ దగ్గర పిల్లల మీద కాదు మీ ప్రతాపం చూపేంచేందంటూ రెచ్చిపోయింది. రామాయణం తియ్యాలంటే అది రాజమౌళి నే అంటూ పోస్ట్‌ పెట్టింది శ్రీరెడ్డి.

ఆదిపురుష్ చిత్రంకి మిక్స్ డ్ టాక్ వ‌చ్చిన కూడా క‌లెక్ష‌న్స్ ప‌రంగా దూసుకుపోతుంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్ అభిమానులు థియేటర్స్ ద‌గ్గ‌ర నానా హంగామా చేశారు.  కొంద‌రు చేతులు కూడా కోసుకొని ర‌క్తంతో ప్ర‌భాస్ పోస్ట‌ర్ కి ర‌క్త తిల‌కం దిద్దారు.ఇక ఈ చిత్రం దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్ తో  తెరకెక్కింది. టి సిరీస్ బ్యానర్లో భూషణ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రంకి అజయ్-అతుల్ సంగీతం అందించారు. జూన్ 16న వరల్డ్ వైడ్ ఐదు భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేశారు. ఆదిపురుష్ చిత్రంపై ఏర్పడిన భారీ హైప్ వలన సినిమాకి పెద్ద మొత్తంలో ఓపెనింగ్స్ దక్కాయి.  వీకెండ్ ముగిస్తే కాని సినిమా హిట్టా,ఫ‌ట్టా అనే దానిపై అవ‌గాహ‌న వ‌స్తుంది.

Related Articles

Как играть в слоты Pinup казино?

Как играть в слоты Pinup казино?

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...