Home Film News Adipurush Collections: ఆదిపురుష్ తొలి రోజు ఎంత రాబట్టింది.. ఊహించిన క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయా..!
Film News

Adipurush Collections: ఆదిపురుష్ తొలి రోజు ఎంత రాబట్టింది.. ఊహించిన క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయా..!

Adipurush Collections: ప్రభాస్, కృతి సనన్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో వాల్మీకి రామాయణం గ్రంధం ఆధారంగా రూపొందిన చిత్రం ఆదిపురుష్‌. ఈ సినిమాను మోడర్న్ లుక్, హై టెక్నాలజీ, గ్రాఫిక్ ఎఫెక్ట్స్‌తో  అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెరకెక్కించారు. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్‌, ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ టీ సిరీస్ రూపొందించిన  ఈ సినిమా భారీ స్థాయిలో విడుద‌లైంది.  సుమారు 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందిన‌ ఈ సినిమాకు భారీ డిమాండ్, క్రేజ్ ఏర్పడ్డ నేప‌థ్యంలో దేశవ్యాప్తంగా 6500 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని 7500 స్క్రీన్లకుపైగా రిలీజ్ చేశారని స‌మాచారం

అయితే ప్ర‌భాస్ మూవీకి అడ్వాన్స్ బుకింగ్ అంత కాలేద‌ని తెలుస్తుంది. ప్రభాస్ మూవీకి మొత్తంగా  చూసుకొంటే రికార్డు అడ్వాన్స్ బుకింగ్ అనేది దక్కలేదు. బాహుబలి చిత్రంకి సంబంధించి 6.5 లక్షల టికెట్లు అమ్మితే.. పఠాన్ చిత్రం 5.56 లక్షల టికెట్లు, కేజీఎఫ్ 2 మూవీ 5.05 లక్షలు, బ్రహ్మాస్త్రం 3.02 టికెట్లను అమ్ముడు పోయాయి. ప్ర‌భాస్ తాజా చిత్రం ఆదిపురుష్ మూవీ ఆ రేంజ్ టికెట్ల అమ్మకాలను రాబట్టలేకపోయింది. ఇక ఆదిపురుష్  చిత్రం అన్ని ప్రాంతీయ భాష‌ల‌లో విడుద‌లై డివైడ్ టాక్ ద‌క్కించుకుంది. సినిమా ఫ‌స్ట్ హాఫ్ ప‌ర్వాలేద‌నిపించిన సెకండాఫ్ మాత్రం కాస్త తేడా కొట్టింది.

ఆదిపురుష్ చిత్రానికి ముందు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ ని చూసి ట్రేడ్ వర్గాలు ఈ చిత్రానికి తొలి  రోజు 130 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వస్తుందని అంచనా వేశారు. అయితే  మూవీకి డివైడ్ టాక్ రావడం తో నూన్ షోస్ కాస్త డల్ అయ్యాయి, మ్యాట్నీ షోస్ పరిస్థితి కూడా అలాగే క‌నిపించింది. ఫ‌స్ట్ షో నుండి మాత్రం  థియేట‌ర్స్ కి జ‌నాల తాకిడి పెరిగింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాక‌, హిందీ లో కూడా మూవీని వీక్షించేందుకు జ‌నాలు పోటెత్తారు.. ఒక్కసారిగా బుకింగ్స్ ట్రెండ్ మ‌రింత పెరిగిపోవడం తో ఈ చిత్రానికి మొదటి రోజు ఏకంగా 150 నుండి 160 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయ‌ని అంటున్నారు.

Related Articles

దివంగత శ్రీదేవికి.. ఎన్టీఆర్ దేవర సినిమాకు ఉన్న లింక్ ఏంటో తెలుసా..? కొరటాల స్కెచ్ మామూలుగా లేదుగా..!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్లో ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ దేవర.. పాన్ ఇండియా...

అది నాకు ఎప్పుడో తెలుసు.. నాగచైతన్య హీరోయిన్ సాయి పల్లవి గురించి సమంత హాట్‌ కామెంట్స్..!

ప్రస్తుతం ఇదే వార్త చిత్ర పరిశ్రమలో ఎంతో వైరల్ గా మారింది. ఇన్ని రోజులు ఎంతో...

బిగ్ బ్రేకింగ్: “షణ్ముఖ్” కేసులో బయటపడ్డ కొత్త కోణం.. అన్నిటికీ కారణం “యాంకరే” నా..?

షణ్ముఖ్ జస్వంత్ ఈ పేరు గురించి అందరికీ ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. యూట్యూబ్లో వచ్చిన...

హీరో తేజ స‌జ్జ త‌ల్లిదండ్రులు ఎవ‌రు.. సినిమా ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. !?

తేజ స‌జ్జ‌.. ప్ర‌స్తుతం ఈ యువ హీరో పేరు మారుమోగిపోతోంది. 2024లో సంక్రాంతి పండుగ కానుక‌గా...