కొన్ని సినిమాలు మీడియా ద్వారా త్వరలో విడుదల అవుతున్నాయి అనే పుకార్లు వినిపిస్తాయి. కానీ.. ఉన్నట్టుండి అవి ఆగిపోయినట్టు వార్తలొస్తాయి. తర్వాత వాటి మీద ఎలాంటి చర్చా ఉండదు. అందరూ అలా మర్చిపోతారు. కొత్తగా వచ్చే సినిమాలు మళ్ళీ వాటి గురించి ఆలోచించే అవకాశాన్ని ఇవ్వవు. ఐతే, ఒక సినిమా ఆగిపోవడానికి ప్రధాన కారణం ఆర్థిక సమస్యలే అని చెప్పొచ్చు. అలాంటి ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆగిపోయి… తర్వాత చాలా కాలానికి రిలీజైన సినిమాల గురించి ఇప్పుడు మాట్లాడదాం.
నాగార్జున – ఢమరుకం
నట సామ్రాట్ వినూత్నంగా కనిపించిన ఈ సినిమా రెండు సంవత్సరాల పాటు కేవలం ఆర్థిక కారణాల వల్ల ఆగిపోయింది. మూవీ అనౌన్స్ చేసిన చాలా కాలానికి గానీ.. ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాలేదు.
ప్రభాస్ – రెబల్
బాహుబలి ఫేమ్ ఒకప్పుడు సినిమా ఆర్థిక ఇబ్బందుల వల్ల రిలీజ్ కాని పరిస్థితులని ఫేస్ చేసాడంటే నమ్మగలమా. ప్రభాస్ నటించిన రెబల్ సినిమా డబ్బు సమస్యల వల్ల పోస్ట్ ప్రొడక్షన్ ని చాలా కాలం నిలిపివేసింది. దర్శకత్వం వహించిన రాఘవ లారెన్స్ ఈ మూవీని చాలా లేట్ గా రిలీజ్ చేశాడు.
బాలయ్య – మహారధి
నందమూరి సింహం కూడా ఒక టైమ్ లో ఇలాంటి పరిస్తితిని ఎదుర్కున్నారు. బాలకృష్ణ హీరోగా, మీరా జాస్మిన్ జంటగా నటించిన ఈ మూవీ కూడా కొన్నేళ్ళ పాటు ఆగిపోయింది. పి. వాసు డైరెక్ట్ చేసిన ఈ మూవీ రిలీజ్ కి ముందు మనీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది.
నాగ చైతన్య – ఆటోనగర్ సూర్య
యువసామ్రాట్ కొడుకు కూడా ఈ పరిస్తితిని ఎదుర్కున్నాడు. రెండేళ్ల పాటు విడుదలకి నోచుకోలేదు ఆటోనగర్ సూర్య సినిమా.
చిరంజీవి – అంజి
ఆత్మలింగం కాన్సెప్ట్ తో వచ్చిన ఈ మూవీ కూడా చాలా కాలం రిలీజ్ అవకుండా ఆగిపోయింది. కోడి రామకృష్ణ డైరెక్ట్ చేసిన ఈ సినిమా షూటింగ్ 1998 లోనే మొదలయింది కానీ 2004 దాకా ఆర్థిక ఇబ్బందుల వల్ల విడుదల అవకపోవడం విశేషం.
గోపీచంద్ – ఆరడుగుల బుల్లెట్
పూర్తి యాక్షన్ ఫిల్మ్ గా వచ్చిన ‘ఆరడుగుల బుల్లెట్’ సినిమా కూడా ఇంకా రిలీజ్ కాలేదు. ఈ మూవీ నిజానికి నాలుగేళ్ల క్రితమే రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ ఇంకా అవకపోవడానికి ఆర్థిక కారణాలే అని చెప్తున్నారు. ఈ మూవీని డైరెక్ట్ చేసింది మాస్ డైరెక్టర్ బి. గోపాల్. ఆయన ఇంద్ర, సమర సింహా రెడ్డి, నరసింహనాయుడు వంటి సినిమాలు చేశారు.
.. .. .. .. ఇలా చాలా సినిమాలే మధ్యలో ఆగిపోవడమో లేదా చాలా లేట్ గా రిలీజ్ అవడమో జరిగింది.
Julayi Movie: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ రైటర్ కమ్ డైరెక్టర్‌ల కాంబినేషన్‌లో వచ్చిన యాక్షన్ కామెడీ ఫిలిం..…
Nandamuri Kalyan Ram: నందమూరి ఫ్యామిలీ నుండి థర్డ్ జనరేషన్ హీరోగా ‘తొలిచూపులోనే’ మూవీతో ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ రామ్..…
Bigg Boss Telugu 6 Promo: Worlds బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ న్యూ సీజన్ వచ్చేస్తోంది. ‘బిగ్…
Mahesh Babu: ‘సూపర్ స్టార్’, ‘నటశేఖర’ కృష్ణ గారి నటవారసుడు.. చిన్నతనంలోనే స్టార్ డమ్ తెచ్చుకున్న ‘ప్రిన్స్’.. రీల్ లైఫ్‌తో…
Mahesh Babu: ఆగస్టు 9.. సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు.. ఘట్టమనేని అభిమానులకు పండుగరోజు.. 2022 ఆగస్టు 9న…
Bimbisara: ‘బింబిసార’గా బాక్సాఫీస్ బరిలో సందడి చేస్తున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. భారీ బడ్జెట్‌తో, టైమ్ ట్రావెల్ బ్యాక్ డ్రాప్‌లో,…
This website uses cookies.