Home Film News Shankar: మ‌ళ్లీ మ‌ళ్లీ అదే త‌ప్పు చేస్తున్న శంక‌ర్.. ఫైట్ కోసం అన్ని కోట్లు అవ‌స‌ర‌మా?
Film News

Shankar: మ‌ళ్లీ మ‌ళ్లీ అదే త‌ప్పు చేస్తున్న శంక‌ర్.. ఫైట్ కోసం అన్ని కోట్లు అవ‌స‌ర‌మా?

Shankar: ఇండియ‌న్ స్టార్ డైరెక్ట‌ర్స్‌లో శంక‌ర్ ఒక‌రు. ఎన్నో అత్య‌ద్భుత‌మైన సినిమాలు తెర‌కెక్కించిన శంక‌ర్ ఇటీవ‌లి కాలంలో పెద్ద పెద్ద సినిమాలు చేసి చేతులు కాల్చుకుంటున్నారు. అయితే శంకర్ సినిమాల‌లో ఒక స్పెషాలిటీ ఉంటుంద‌నే విష‌యం మ‌నకు తెలిసిందే. సినిమా థీమ్‌తో సంబంధం లేకుండా భారీ సెట్స్‌లో లావిష్‌గా సాంగ్స్‌ షూట్‌ చేయటం శంకర్ ప్ర‌త్యేక‌త అని చెప్పాలి. ఏ హీరో అయిన కూడా శంకర్‌ సినిమా సాంగ్‌ అంటే… ప్రేక్ష‌కులని మరో ప్రపంచంలో విహరించేలా చేస్తారు.దీని కోసం శంక‌ర్ భారీగా ఖ‌ర్చు పెడతారు కూడా. ఇప్పుడు గేమ్ చేంజర్‌ సినిమాలో ఒక ఫైట్ కోసం భారీగా ఖర్చు చేస్తున్నారట శంకర్‌. ఇప్పుడు ఈ విష‌యం సినీ ప‌రిశ్ర‌మ‌లో హాట్ టాపిక్‌గా మారింది.

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌లో శంక‌ర్ తెర‌కెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం గేమ్ చేంజ‌ర్. పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ మూవీగా చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ నటిస్తున్న సినిమా కావ‌డంతో చిత్రంపై అంచ‌నాలు ఓ రేంజ్‌లో ఉన్నారు. చిత్రాన్ని భారీ యాక్షన్ మూవీగాశంక‌ర్ తెర‌కెక్కిస్తుండ‌గా, ఇందులో రామ్ చరణ్ సరసన రెండోసారి బాలీవుడ్ బ్యూటీ కియారా ఆద్వానీ క‌థానాయిక‌గా నటిస్తోంది. గ‌త రెండేళ్ల నుండి ఈ మూవీ షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఇప్పుడు చివ‌రి ద‌శ‌కు చేరిన‌ట్టు తెలుస్తుండ‌గా, 2023 చివరికల్లా సినిమా పూర్తి చేసి రిలీజ్ చేయాల‌ని అనుకుంటున్నార‌ట‌.

 

చిత్రానికి సంబంధించి తాజాగా ఓ వార్త సోష‌ల్ మీడియాని షేక్ చేస్తుంది. సినిమా క్లైమాక్స్‌ ఫైట్స్‌ కోసం శంకర్ భారీగా ప్లాన్ చేసార‌ని స‌మాచారం. దాదాపు 500 మంది ఫైటర్లతో రామ్ చరణ్ పోరాట సన్నివేశాలు శంక‌ర్ చిత్రీక‌రించార‌ని, ఈ యాక్షన్ సీక్వెల్స్‌ తెలుగు సినిమాలో మునుపెన్నడూ చూడని విధంగా ఉంటాయ‌ని అంటున్నారు. ఈ ఒక్క ఫైట్ కోసమే భారీగా ఖ‌ర్చు చేసిన‌ట్టు స‌మాచారం. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండ‌గా, శంకర్‌ మార్క్‌ గ్రాండియర్‌తో రూపొందుతున్న ఈ సినిమా కోసం భారీగా ఖర్చు పెడుతున్నార‌ట‌. ఈ చిత్రం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై 50వ సినిమాగా రూపొందుతుండంతో ఈ సినిమాని చాలా ప్ర‌స్టీజియ‌స్‌గా భావిస్తున్నారు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...