Home Film News Devi Sri Prasad: పుష్ప సింగ‌ర్‌తో దేవి శ్రీ ప్ర‌సాద్ పెళ్లి.. ఇలా లీకైన మ్యాట‌ర్…!
Film News

Devi Sri Prasad: పుష్ప సింగ‌ర్‌తో దేవి శ్రీ ప్ర‌సాద్ పెళ్లి.. ఇలా లీకైన మ్యాట‌ర్…!

Devi Sri Prasad: సౌత్ సినీ ప‌రిశ్ర‌మ‌లో తన సంగీతంతో కుర్రకారును ఒక ఊపు ఊపిన సంగీత దర్శకుడు,గాయకుడు దేవి శ్రీ ప్ర‌సాద్. ఆయ‌న సంగీతానికి ప‌రవశించ‌ని వారు లేరు. ఎంతో మంది స్టార్ హీరోల‌కి సంగీతాన్ని అందించిన దేవి శ్రీ ప్ర‌సాద్.. నీకోసం, ఆనందం, ఖడ్గం,బొమ్మరిల్లు నువ్వొస్తానంటే నేనొద్దంటానా, మన్మధుడు,ఆర్య , సరేలేరు నీకెవ్వరు, వాల్తేరు వీరయ్య వంటి ఎన్నో సూప‌ర్ హిట్ చిత్రాల‌కి సంగీతం అందించి స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ప్ర‌స్తుతం గ‌తంలో మాదిరిగా అంత స్పీడ్ చూపించ‌క‌పోయిన కూడా అడ‌పాద‌డ‌పా ఏదో ఒక సినిమాతో ప‌ల‌క‌రిస్తూనే ఉన్నాడు. అయితే దేవి శ్రీ ప్ర‌సాద్ పర్సనల్ లైఫ్ ఇప్పుడు అంత ఆశాజనకంగా లేదనే చెప్పాలి.

నాలుగు ప‌దుల వ‌య‌స్సు దాటిన దేవి శ్రీ ప్ర‌సాద్ ఇంకా పెళ్లి జోలికి వెళ్ల‌డం లేదు. అందుకు కార‌ణం ఛార్మీ అని అప్ప‌ట్లో అనేక ప్ర‌చారాలు సాగాయి. చార్మిని దేవి శ్రీ ప్ర‌సాద్ ఎంతో ఘాడంగా ప్రేమిస్తే ఆమె అతన్ని మోసం చేసి వెళ్ళిపోయిందని, అప్పటినుండి ప్రేమ పెళ్లి పై తనకి నమ్మకం పోయిందని అనేక వార్త‌లు వచ్చాయి. ఇక దేవి శ్రీ ప్ర‌సాద్ ఫ‌లానా హీరోయిన్‌ని పెళ్లి చేసుకోబోతున్నాడంటూ కూడా ప్ర‌చారాలు సాగాయి. కాని ఏ రోజు దేవి త‌న పెళ్లిపై నోరు విప్ప‌లేదు. ఇక ఇప్పుడు దేవి శ్రీ స్టార్ సింగ‌ర్ సోద‌రిని వివాహం చేసుకోబోతున్నాడంటూ ఓ ప్ర‌చారం న‌డుస్తుంది.

 

సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన పుష్ప చిత్రంలో స‌మంత చిందులేపిన ఊ అంటావా మావా.ఉ ఉ అంటావా మావా.అనే పాటని మంగ్లీ సోద‌రి ఇంద్రావ‌తి పాడిన విష‌యం మ‌న‌కు తెలిసిందే. ఈ పాట‌తో ఓవర్ నైట్ లో స్టార్ సింగర్ అయిపోయిన ఇంద్రావతి రీసెంట్‌గా దేవి శ్రీ ప్రసాద్‌కి బ‌ర్త్ డే శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ కొన్ని ఫొటోల‌ని తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది.ఈ పిక్స్ చూసిన నెటిజ‌న్స్ కొన్ని క్రేజీ కామెంట్స్ పెడుతున్నారు. మీ జంట చాలా బాగుంది.మీ ఇద్దరి పెళ్లి ఎప్పుడు.ఏజ్ జస్ట్ ఒక నెంబర్ మాత్రమే అంటూ కామెంట్ల‌తో రెచ్చిపోతున్నారు. మంగ్లీ చెల్లెలు ఇంద్రావతి తో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ పెళ్లి పీటలెక్కబోతున్నాడు అంటూ కూడా కొంద‌రు వార్త‌లు పుట్టిస్తున్నారు. మ‌రి దీనిపై వీరిద్ద‌రిలో ఎవ‌రైన స్పందిస్తారా అనేది చూడాలి

 

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...