Home Film News Ileana: తొమ్మిదో నెల‌లో ఇబ్బందులు ప‌డుతున్న ఇలియానా.. ఆమె పోస్ట్ చూసి ధైర్యం చెబుతున్న నెటిజ‌న్స్
Film News

Ileana: తొమ్మిదో నెల‌లో ఇబ్బందులు ప‌డుతున్న ఇలియానా.. ఆమె పోస్ట్ చూసి ధైర్యం చెబుతున్న నెటిజ‌న్స్

Ileana: గోవా బ్యూటీ ఇలియానా ప్ర‌స్తుతం ప్ర‌గ్నెంట్ అన్న విష‌యం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం ఈ విష‌యం ప్ర‌క‌టించ‌డంతో అంద‌రు షాక్ అయ్యారు. పెళ్లి చేసుకోకుండానే ప్రెగ్నెన్సీ అంటూ ఇలియానా చెప్పడంతో ఇండస్ట్రీలో ఈ విష‌యం హాట్ టాపిక్ గా మారింది.  అయితే ఇలియానా ఇప్పటివరకు తన భర్త ఎవరు అనేది బయటపెట్టక‌పోవ‌డం విశేషం. కొద్ది రోజుల క్రితం  తన ఎంగేజ్మెంట్ రింగ్స్ పిక్స్ షేర్ చేస్తూ తన భర్త గురించి ఎమోషనల్ పోస్ట్ చేసింది. అనంత‌రం త‌న భ‌ర్త కుక్క పిల్ల‌ల‌తో ఆడుతున్న పిక్ షేర్ చేసింది. ఇందులో ఫేస్ క‌న‌ప‌డ‌కుండా చాలానే జాగ్ర‌త్త ప‌డింది. అయితే అంద‌రు హీరోయిన్ కత్రినా కైఫ్ తమ్ముడు సెబాస్టియన్ తో  ఇలియానా సహజీవనం చేస్తుంద‌ని అనుకుంటున్నారు.

ప్ర‌గ్నెంట్ స‌మ‌యం నుండి ఇలియానా త‌న‌కి సంబంధించి అనేక ఆస‌క్తిక‌ర పోస్ట్‌లు షేర్ చేస్తుంది.  తాజాగా ఆమె సోష‌ల్ మీడియాలో షేర్ చేసిన‌ ఓ ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతుంది. నాకు ఇప్పుడు తొమ్మిదో నెల కావడంతో ఏ పని చేయలేకపోతున్నాను. నీరసం చాలా బాధిస్తుందని చెప్పుకొచ్చింది. నెల‌లు నిండిన నేప‌థ్యంలో ఇలియానాకి న‌డ‌వ‌డం కూడా చాలా క‌ష్ట‌మ‌వుతుంద‌ట‌. ప్ర‌స్తుతం ఇలియానాకి  తొమ్మిదో నెల కాబ‌ట్టి మరి కొద్ది రోజుల‌లో ఆమె పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌డం ఖాయం. మ‌రి పుట్టిన బిడ్డ ఫేస్ అయిన ఇలియానా రివీల్ చేస్తుందా లేదా అనేది తెలియ‌దు.

తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరితో కలిసి నటించిన ఇలియానా  2013 సమయంలో బాలీవుడ్‍కు వెళ్లింది. అక్కడ వరుసగా సినిమాల్లో  న‌టిస్తూ ప్రేమ‌లో కూడా ప‌డింది..అటు కెరియ‌ర్  అనుకున్నంత మేర సక్సెస్ కాలేకపోయింది. మ‌రోవైపు త‌న ప్రేమ‌కి కూడా మ‌ధ్య‌లోనే బ్రేక్ ప‌డింది. అయితే ఇలియానా  కెరీర్ దాదాపు ఫేడ్ అవుట్ దశకు చేరుకుంది అని చెప్పాలి. స్టార్ హీరోయిన్ స్టేటస్ కి దూరమై చాలా కాలం అవుతుంది. ఏదో  అడపాదడపా ఆఫర్స్ తో నెట్టుకొస్తున్న ఈ భామ బిడ్డ పుట్టాక పూర్తిగా సినిమాల‌కి దూర‌మైన ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు.

Related Articles

1000 కోట్లు ఇచ్చినా సరే అలా చేయను అంటూ తెగేసి చెప్పేస్తున్న ప్రభాస్.. ఎందుకో తెలుసా..!?

ప్రస్తుతం ఇండియన్ సినిమా చిత్ర పరిశ్రమలో భారీ స్టార్‌డంతో దూసుకుపోతున్న ప్రభాస్ పెళ్లి వయసు దాటుతున్న...

మహేష్ కోసం అవతార్ డైరెక్టర్ ను తీసుకొస్తున్న రాజమౌళి.. జక్కన్న స్కెచ్ మామూలుగా లేదుగా..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సినిమా రాబోతున్నట్టు ఇప్పటికే అధికార...

రామ్ చరణ్ ఫోన్ లో ఎన్టీఆర్ నెంబర్ ఏమని ఉంటుందో తెలుసా.. భ‌లే సిల్లిగా లేదు..!

మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా రామ్ చరణ్ టాలీవుడ్ లో అడుగుపెట్టి ప్రస్తుతం పాన్ ఇండియా...

చిరు విశ్వంభ‌ర‌లో మెగా అభిమానులను ఎగ్జైట్ చేస్తున్న క్రేజీ న్యూస్..!

పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఉన్న సీనియర్ హీరోల్లో హిట్, ప్లాఫ్ లతో సంబంధం...