Home Film News Sai Pallavi: ప్ర‌శాంతంగా కనిపించే సాయి ప‌ల్ల‌వికి అలాంటి పాడు అల‌వాటు ఉందా..!
Film News

Sai Pallavi: ప్ర‌శాంతంగా కనిపించే సాయి ప‌ల్ల‌వికి అలాంటి పాడు అల‌వాటు ఉందా..!

Sai Pallavi: లేడి ప‌వ‌ర్ స్టార్ అనే బిరుదుని అతి త‌క్కువ స‌మ‌యంలో అందుకున్న న‌టీమ‌ణి సాయి ప‌ల్ల‌వి. ఆమె పేరు చెబితే ఆడిటోరియం ద‌ద్ద‌రిల్లి పోతుంది. సాయి ప‌ల్ల‌వికి కొంద‌రు హీరోల క‌న్నా ఎక్కువ ఫేమ్ ఉంది. సాయి ప‌ల్ల‌వి గ్లామ‌ర్  ప్రాధాన్య‌త పాత్ర‌ల క‌న్నా  న‌ట‌న‌కి ప్రాధాన్యం ఉన్న పాత్ర‌ల‌లో న‌టిస్తూ మెప్పిస్తుంది. ఈ అమ్మ‌డు  తెలుగులో ఫిదా సినిమాతో ఎంట్రీ ఇచ్చిన విషయం విదిత‌మే.. శేఖర్ కమ్ముల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాలో తెలంగాణ పిల్లగా కనిపించి మెప్పించింది. తొలి సినిమాలోనే అద్భుత‌మైన న‌ట‌న క‌న‌బ‌ర‌చి  తెలుగు ప్రేక్షకులకు దగ్గరైపోయింది ఈ బ్యూటీ.

సాయి పల్ల‌వి తెలుగులోనే కాదు అటు తమిళ్ లోనూ మలయాళంలోనూ సినిమాలు చేస్తూ మెప్పించింది. ఇక సాయి పల్లవి డాన్స్ కు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందన‌డంలో  ఎలాంటి అతిశ‌యోక్తి లేదు. శ్యామ్ సింగ‌రాయ్ చిత్రంలో సాయి ప‌ల్ల‌వి ఓ పాట‌కి చేసిన డ్యాన్స్ కి ప్రేక్ష‌కులు ఫిదా అయ్యారు. సాయి ప‌ల్ల‌వి త‌ప్ప ఆ పాట‌కి మ‌రెవ‌రు డ్యాన్స్ చేయ‌లేరని కామెంట్స్ చేసారు. ఎప్పుడు చాలా సైలెంట్‌గా ఉంటూ ఆచితూచి మంచి సినిమాలు చేస్తూ ఉండే సాయి ప‌ల్ల‌వికి ఓ పాడు అలవాటు ఉంద‌ట‌. అదేంటంటే ఈ అమ్మ‌డికి ఒక్కోసారి భీబ‌త్స‌మైన కోపం వ‌స్తుంద‌ట‌.

బాగా కోపం వ‌చ్చిన‌ప్పుడు సాయి పల్ల‌వి చేతిలో ఏది ఉంటే అది విసిరేస్తుంద‌ట‌.  కోపం వ‌చ్చిన‌ప్పుడు త‌న చేతిలో కాని ప‌క్క‌న కాని ఎలాంటి కాస్ట్ లీ వ‌స్తువు ఉన్నా కూడా అది ముక్క‌లు ముక్క‌లు అయిపోవ‌ల్సిందేన‌ట‌. ఎంతో ప్ర‌శాంతంగా ఉండే సాయి ప‌ల్లవిలో ఇంత ఆగ్ర‌హం కూడా ఉందా అని కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు.కాగా, సాయి ప‌ల్ల‌వి సినిమాల విష‌యానికి వ‌స్తే.. చివరిగా రానా నటించిన విరాటపర్వం సినిమాతో మెప్పించింది ఈ ముద్దుగుమ్మ‌. అనంత‌రం గార్గి అనే డబ్బింగ్ లో కనిపించి ప్రేక్షకులను అలరించింది. ఇక ఈ సినిమా తర్వాత సాయి పల్లవి ఇప్ప‌టి వ‌ర‌కు కొత్త సినిమా అనౌన్స్ చేయలేదు. సాయి పల్లవి ప్ర‌స్తుతం శివ కార్తికేయ‌న్ తో ఓ చిత్రం చేస్తుంది.

Related Articles

Hizli mobil odeme canli bahis siteleri 2023

Hizli mobil odeme canli bahis siteleri 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...