Home Film News Pawan Kalyan: నిజంగానే ప‌వ‌న్ క‌ళ్యాణ్ రెండు చెప్పులు కొట్టేశారా.. ఆయ‌న మాటల్లో అంతరార్థం ఏంటి?
Film News

Pawan Kalyan: నిజంగానే ప‌వ‌న్ క‌ళ్యాణ్ రెండు చెప్పులు కొట్టేశారా.. ఆయ‌న మాటల్లో అంతరార్థం ఏంటి?

Pawan Kalyan: ప‌వర్ స్టార్ పవ‌న్ క‌ళ్యాణ్ గ‌త రెండు రోజులుగా రాజ‌కీయాల‌తో బిజీబిజీగా ఉన్నారు. ప్ర‌జ‌ల స‌మస్య‌లు అడిగి తెలుసుకుంటూ వాటికి సత్వ‌ర‌మే ప‌రిష్కారం చూపేలా ప్ర‌య‌త్నిస్తున్నారు. అయితే గ‌త రాత్రి పిఠాపురం స‌భ‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఒక‌వైపు ఆవేశంగా మాట్లాడుతూనే మ‌ధ్య‌లో కామెడీ పంచ్‌లు కూడా విసిరారు. విష‌యంలోకి వెళితే పవన్ షురూ చేసిన వారాహి విజయయాత్రలో భాగంగా కత్తిపూడిలో తొలి బహిరంగ సభను నిర్వహించారు.అప్పుడు ఆయన వైసీపీ సర్కారుపై ఘాటైన‌ విమర్శలు చేశారు. దీంతో  ప్రెస్ మీట్ పెట్టిన పేర్ని నాని  అప్పుడెప్పుడో పవన్ చెప్పులు చూపించి వార్నింగ్ ఇచ్చిన వైనాన్ని.. గుర్తు చేస్తూ.. తన రెండు చెప్పుల్ని చూపించి.. మక్కెలు ఇరగదీస్తానంటూ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.

ఇది ప‌వ‌న్ దృష్టికి  చేరిన‌ట్టు ఉంది. అందుకే ఆయ‌న  పిఠాపురంలో శుక్రవారం రాత్రి నిర్వహించిన స‌భ‌లో పేర్ని నానికి త‌న‌దైన స్టైల్‌లో పంచ్ ఇచ్చాడు.  మొన్న అన్నవరం శ్రీ సత్యదేవుడి దర్శనానికి వెళ్లినప్పుడు నాకు ఎంతో ఇష్టమైన రెండు చెప్పుల్ని ఎవరో కొట్టేశారని అన్నాడు.  ఆ తర్వాత నాకు ఎవరో చెప్పారు.. మీ చెప్పులు టీవీలో ఓ వ్యక్తి చేతిలో కనిపించాయి అని. ఆ చెప్పులంటే నాకు చాలా ఇష్టం. దయచేసి ఆయన దగ్గర తీసుకొని నా చెప్పులు నాకు ఇప్పించండి అని ప‌వ‌న్ క‌ళ్యాణ్ చాలా కామెడీగా త‌న‌దైన శైలిలో పంచ్‌లు ఇచ్చారు.   వైసీపీ నేతలు చెప్పులు ఇలా చెప్పులు కాజేస్తే ఎలా? దయచేసి ఆ చెప్పులు మాత్రం మర్చిపోకుండా నాకు ఇప్పించండి అని అన్నారు.

గుళ్లలో చెప్పులు కూడా పట్టుకుపోయేలా ఈ వైసీపీ నాయకులు తయారయ్యారు అంటూ ప‌వ‌న్ ఇచ్చిన పంచ్‌కి  జనసైనికుల్ని.. పవన్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. మా నాయ‌కుడు ఒకే ఒక్క పంచ్ ఇస్తే వైసీపీ వాళ్ల‌కి సౌండ్ ఉండ‌దు అంటూ సోష‌ల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఏదిఏమైన ఇప్పుడు ఏపీలో రాజ‌కీయ వాతావ‌ర‌ణం చాలా వాడి వేడిగా సాగుతుంది. ఒక‌రిపై ఒక‌రు దారుణ‌మైన కామెంట్స్ చేసుకుంటూ హాట్ టాపిక్‌గా నిలుస్తున్నారు.

Related Articles

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...

Samantha: స‌మంత మేనేజ‌ర్ మోసం.. అడ్డంగా బుక్ అయ్యాడుగా…!

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న క్యూట్‌నెస్ తో పాటు...