Home Film News Faima: ప్ర‌వీణ్‌కి బ్రేక‌ప్ చెప్పిన ఫైమా..వేరే వ్య‌క్తిని పెళ్లి చేసుకోవడంతో అంతా షాక్..!
Film News

Faima: ప్ర‌వీణ్‌కి బ్రేక‌ప్ చెప్పిన ఫైమా..వేరే వ్య‌క్తిని పెళ్లి చేసుకోవడంతో అంతా షాక్..!

Faima: బుల్లితెర ప్రేక్షకుల‌కి పైమా- ప్ర‌వీణ్‌ల గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ప‌టాస్ షోలో వీరిద్దరు క‌లిసి తెగ సంద‌డి చేశారు. ఆ స‌మ‌యంలోనే వీరిద్ద‌రి ప‌రిచ‌యం ప్రేమ‌గా మారింది.ఇక అప్ప‌టి నుండి ఎంతో అన్యోన్యంగా ఉంటూ వ‌స్తున్న ఈ జంట అప్పుడ‌ప్పుడు వెరైటీ వీడియోలు కూడా చేస్తూ త‌మ అభిమానుల‌ని అల‌రిస్తున్నారు. బిగ్ బాస్ స‌మ‌యంలో ఫైమా ప‌లుమార్లు ప్ర‌వీణ్‌ని గుర్తు తెచ్చుకుంది. ఆయ‌న త‌న‌కి ఎంత స్పెష‌ల్ అనేది చెబుతూ క‌ష్టాల‌లో ఉన్న‌ప్పుడు ప్ర‌వీణ్ చేసిన సాయం గురించి కూడా అంద‌రి ముందు తెలియ‌జేసింది. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట ఇప్పుడు బ్రేక‌ప్ చెప్పుకున్నార‌నే వార్త ఇప్పుడు సోష‌ల్ మీడియాని షేక్ చేస్తుంది.

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఫైమా.. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్ట్ చేస్తూ.. అందులో ‘బేబి సినిమా చూసిన తర్వాత ఫైమా, ప్రవీణ్ బ్రేకప్’ అని రాసింది. ఇది చూసి అందరూ షాక్ అయ్యారు అదేంటి త్వ‌ర‌లో పెళ్లి చేసుకుంటార‌నుకున్న ఈ జంట బ్రేక‌ప్ చెప్పుకోవ‌డ‌మేంట‌ని ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు.. అయితే త‌ర్వాత తెలిసింది ఏంటంటే.. వీళ్లిద్దరూ కలిసి ‘బేబి’ మూవీ స్ఫూఫ్ వీడియో చేయ‌గా, అందుకు సంబంధించిన ప్రమోషన్‌లో భాగంగానే ఫైమా ఈ పోస్ట్ చేసినట్లు నెటిజ‌న్స్‌కి అర్ధ‌మైంది . ఫైమా, ప్రవీణ్ కలిసి ‘బేబి’ స్ఫూఫ్ వీడియోను చేయడం బాగానే ఉన్నా అందులో  వేరే వ్యక్తితో ఫైమా పెళ్లికి రెడీ అయినట్లు కూడా  ఓ పోస్టర్ వేశారు.

ఇక పోస్టర్‌లో  ఉన్న వ్యక్తి ముఖాన్ని ఫొటోషాప్ ద్వారా ఎడిట్ చేసి.. దానిని  హైలైట్ చేస్తూ ఫైమా అతడిని పెళ్లి చేసుకోబోతుంది అంటూ సోషల్ మీడియాలో విస్తృత ప్ర‌చారం చేస్తున్నారు.అస‌లు విష‌యం తెలుసుకున్న వారు హ‌మ్మ‌య్య అనుకుంటున్నారు, తెలియని వాళ్లు మాత్రం షాక్‌లో ఉన్నారు. ప్ర‌స్తుతం ప్ర‌వీణ్ జ‌బ‌ర్ధ‌స్త్ షోతో బిజీగా ఉండ‌గా, ఫైమా మాత్రం మా టీవీలో దున్నేస్తుంది. ‘స్టార్ మా పరివారంతో పాటు ప‌లు షోలు చేస్తున్న ఫైమా ఎన్నో స్పెషల్ ఈవెంట్లలో కూడా పాల్గొంటోంది.  సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటూ.. యూట్యూబ్ ద్వారా అల‌రించే ప్ర‌య‌త్నం చేస్తుంది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...