Home Film News Mirchi Beauty: మిర్చి బ్యూటీ పూర్తిగా ఇండ‌స్ట్రీని వదిలివేయ‌డం వెన‌క ఆ స్టార్ హీరో ఉన్నాడా..!
Film News

Mirchi Beauty: మిర్చి బ్యూటీ పూర్తిగా ఇండ‌స్ట్రీని వదిలివేయ‌డం వెన‌క ఆ స్టార్ హీరో ఉన్నాడా..!

Mirchi Beauty: డార్లింగ్ ప్ర‌భాస్ న‌టించిన మిర్చి చిత్రంలో క‌థానాయిక‌గా న‌టించిన రిచా గంగోపాధ్యాయ తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌కి గుర్తుండే ఉంటుంది. దగ్గుబాటి రానా నటించిన లీడర్ చిత్రంతో తెలుగు చిత్రసీమకు పరిచయం అయిన రిచా అనంత‌రం  మాస్ మహారాజా రవితేజ సరసన మిరపకాయ్ చిత్రంలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ చిత్రంలో రిచా  సాంప్రాదాయబద్ధమైన బ్రాహ్మాణ యువతిగా నటించి అల‌రించింది. ఈ సినిమా త‌ర్వాత‌నే  ప్రభాస్ సరసన మిర్చీ సినిమాలో క‌థానాయిక‌గా అవ‌కాశం ద‌క్కించుకుంది. మిర్చి సినిమా పెద్ద హిట్ కావ‌డంతో ఈ బ్యూటీ వ‌రుస ఆఫ‌ర్స్ త‌లుపుత‌ట్టాయి.

నాగవల్లి, సారోచ్చారు, భాయ్ తదితర చిత్రాల్లో అవ‌కాశాలు ద‌క్కించుకున్న రిచా అనంత‌రం సినిమాల‌కి దూర‌మైంది. అయితే స‌డెన్‌గా ఆమె తెలుగు తెర‌కి దూరం కావ‌డం ప‌ట్ల అనేక ప్ర‌చారాలు సాగాయి.  ఓ మూవీ  షూటింగ్ జ‌రుగుతున్న‌ సమయంలో స్టార్ హీరో త‌న‌ కార్ వ్యాన్ లో రిచాతో చాలా అసభ్యకరంగా ప్రవర్తించాడట. అలా చేసినందుకు రిచా ఆ హీరోను చెప్పుతో కొడతానంటూ గట్టి వార్నింగ్ ఇచ్చిందట. అప్పుడు ఆ హీరో రిచాని బ్లాక్ మెయిల్ చేశాడ‌ట‌.  ప్రైవేట్ వీడియోస్ తన వద్ద ఉన్నాయంటూ బెదిరించి  టార్చర్ చేసేస‌రికి చాలా ఇబ్బందులు ప‌డింద‌ట‌.

ఒక వైపు సినిమా అవ‌కాశాలు రాక‌, మ‌రోవైపు బెదిరింపులు త‌ట్టుకోలేక రిచా  ఇండస్ట్రీ నుంచి దూరమైనట్లు పలు మీడియాల్లో వార్తలు వచ్చాయి. 2013లో చ‌దువుల కోసం అని  విదేశాల‌కి వెళ్లిన రిచా 2017లో సెయింట్ లూయిస్‌లోని వాషింగ్టన్ విశ్వవిద్యాలయం నుండి ఎమ్‌బీఏ డిగ్రీని పూర్తి చేసింది. ఇక 2019లో తన చిన్ననాటి స్నేహితుడు జో లాంగేల్లా ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2021లో ఈ దంప‌తుల‌కు ఓ కుమారుడు కూడా పుట్టాడు. అత‌నికి లూకా షాన్ లాంగెల్లా అని  పేరు పెట్టారు. అప్పుడుప్పుడు సోష‌ల్ మీడియాలో త‌న ఫ్యామిలీ పిక్స్ షేర్ చేస్తూ అల‌రిస్తూ ఉంటుంది. ఇప్పుడు  రిచా  విదేశాల్లో భ‌ర్త, కుమారుడితో హ్యాపీ  జీవితం గ‌డుపుతుంది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...