Home Film News Dhanraj: మా నాన్న ఎలా ఉంటాడో కూడా నాకు తెలీదు.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన ధనరాజ్..
Film News

Dhanraj: మా నాన్న ఎలా ఉంటాడో కూడా నాకు తెలీదు.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన ధనరాజ్..

Dhanraj: బుల్లితెర ప్రముఖ కామెడీ ఎంటర్ టైనర్ జబర్థస్త్ షోతో ఎంతోమంది కమెడియన్స్ పాపులారిటీ దక్కించుకున్నారు. సినిమాల్లోనూ రాణిస్తున్నారు. వారిలో ధనరాజ్ కూడా ఒకరు. ఆయన జబర్థస్త్ నుండి సినిమాల్లోకి వెళ్లి కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. బిగ్ బాస్ షోతో ధనరాజ్ పాపులారిటీని సంపాదించుకున్నారు. ఆయనకు అభిమానుల సంఖ్య కూడా ఎక్కువే. రీసెంట్ గా జరిగిన ఓ ఈవెంట్ లో ధనరాజ్ మాట్లాడుతూ.. తన ఫ్యామిలీ గురించి ఎమోషనల్ కామెంట్స్ ప్రజంట్ వైరల్ అవుతున్నాయి.
ఈ ఈవెంట్ లో కమెడియన్ ధనరాజ్ మాట్లాడుతూ.. మా నాన్న ఎలా ఉంటాడో కూడా నాకు తెలియదని అన్నారు. ఎప్పుడూ నాన్నను ఊహించుకుంటూ ఉంటానని అన్నారు. ప్రపంచంలో తనకు రక్త సంబంధం అనేది లేదంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ఇక తనకంటూ ఎవరైనా రక్త సంబంధం ఉన్నారంటూ అది వీళ్లేనని తన ఫ్యామిలీ మెంబర్స్ ను చూపించారు. ధనరాజ్ కొడుకు మాట్లాడుతూ.. డాడీ, తమ్ముడు, మమ్మీ వీళ్లే నా ప్రపంచం అన్నారు. ఫ్యామిలీ నంబర్ 1 పేరుతో ఈ ఈవెంట్ ను ఓ ప్రముఖ ఛానెల్ లో ఆర్గనైజ్ చేశారు. ఈ ప్రోగ్రామ్ జీ తెలుగు ఛానల్ లో ఆదివారం ఉదయం 11 గంటలకు వస్తుందని ప్రోమోలో తెలిపారు.
దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాోల తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోకు ఇప్పటికే లక్షల్లో వ్యూస్ వచ్చాయి. ధనరాజ్ ఎమోషనల్ అవ్వడంతో ఆయన అభిమానులు బాధపడుతున్నారు. అన్న నీకు మేము ఉన్నాం అన్నా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ధనరాజ్ కు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన క్రేజ్ ఉంది. ఆయన కెరీర్ లో మంచి మంచి ప్రోగ్రామ్స్, సినిమాలు చేసి సక్సెస్ అవ్వాలని అభిమానులు పోస్టులు పెడుతున్నారు. మరి ఈ ప్రోగ్రామ్ ఫుల్ ఎపిసోడ్ చూడాలంటే ఆదివారం వరకు ఆగాల్సిందే.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...