Home Special Looks ‘నువ్వు జీరో ఐతే నీ వెనక ఏ హీరో ఉండడు..’ : తెరవెనక ప్రపంచం గురించి పూరీ జగన్నాథ్!
Special Looks

‘నువ్వు జీరో ఐతే నీ వెనక ఏ హీరో ఉండడు..’ : తెరవెనక ప్రపంచం గురించి పూరీ జగన్నాథ్!

Puri Jagannath About Realitiles Of Film Industry

పూరీ జగన్నాథ్. ఇప్పటివరకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక డైరెక్టర్ గా ఎక్కువ సక్సెస్ చూసిన వ్యక్తుల్లో ఒకరు. ఒక హీరోకి ఉన్నంత క్రేజ్ ఆయనకి స్క్రీన్ మీద కనిపించకపోయినా ఉంది. టాలెంట్ ని, పట్టుదలని నమ్ముకొమ్మని చెప్పే పూరీ జీవితం మరీ అంత సులువుగా నిర్మించుకున్నది ఏమీ కాదు. మొదట్లో ఎంతో సక్సెస్ చూసిన తర్వాత స్వంత డబ్బులతో సినిమా తీసి, ఎలా దెబ్బతిన్నాడో.. తిరిగి మళ్ళీ ఎలా లైమ్ లైట్ లోకి వచ్చాడో తెలుసుకుందాం. పూరీ జగన్నాథ్ కి చిన్నప్పటి నుంచి సినిమాలంటే పిచ్చి. ఆ ఇష్టంతోనే ఎప్పటికైనా.. తాను కూడా ఒక సినిమా తీయాలని అనుకున్నాడు. అందుకే ఎప్పుడూ సినిమాల గురించే ఆలోచిస్తూ ఉండేవాడు.

అలా ఉంటున్న పూరీని చూసి వాళ్ళ అమ్మా నాన్నలే స్వయంగా ఈ ఇండస్ట్రీలోకి వెళ్ళు నీకు లైఫ్ అక్కడే ఉండొచ్చు అని చెప్పి పంపారట. ఇక అప్పటినుంచి సినిమాలే తన జీవితం అనుకున్నాడు. మెల్లగా చిన్న చిన్న ప్రయత్నాల ద్వారా డైరెక్షన్ గురించి తెలుసుకున్నాడు. 2000 సంవత్సరం నుండి బద్రి, బచ్చి, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, శివమణి వంటి సినిమాలు అన్నీ హిట్లుగా నిలిచినా కూడా 2004 లో వచ్చిన ఆంధ్రావాలా మూవీ ఆయన్ని పూర్తిగా నష్టాల్లోకి నెట్టేసింది. కావాల్సిన వాళ్ళే తన దగ్గర ఉన్న డబ్బంతా పోగొట్టుకునేలా చేశారట. ఒక చిన్న అద్దె ఇల్లు తీస్కుని అందులో కుటుంబంతో కష్టాల్లో ఉన్నప్పుడు అతనికి ఎవ్వరూ సహాయం చేయలేదట. చాలామంది హీరోలకే హిట్లు ఇచ్చినప్పటికీ వాళ్ళు మళ్ళీ ఈయన వైపు చూడలేదని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.

నిజజీవితంలో చాలామంది వాళ్ళు పైకి కనిపించే దానికి పూర్తి భిన్నంగా ఉంటారని, వాళ్ళు ఎంత గొప్పవాళ్లుగా కనిపించినా వాళ్ళలో నిజానికి ఎలాంటి గొప్ప లక్షణాలు కూడా ఉండవని చెప్పుకొచ్చాడు. చాలా స్వార్థపూరితంగా ఉండే సమాజంలో సొంతగా ఎంతో ఆలోచించుకుని.. తెలివిగా నిర్ణయాలు తీసుకోవాలని తన అభిమనులకి సూచించాడు. అలాగే, స్వయంగా డైలాగ్స్ కూడా రాసే పూరీ జగన్నాథ్.. పూరి మ్యూజింగ్స్ పేరుతో యూట్యూబ్ లో ఒక ఛానల్ అలాగే సినిమాల్లోనూ ఇలాంటి వాటిని బాగా అర్థమయ్యేలా చెప్పేలా హీరోలతో డైలాగ్స్ చెప్పిస్తూ ఉంటాడు. ఇందుకు బెస్ట్ ఉదాహరణ.. బిజినెస్ మేన్ మూవీ.

“ఎవరి మాటా వినొద్దు. మనిషి మాట అస్సలు వినొద్దు.”
“ఎవడి సినిమా ఆడిదే. ఎవడి సినిమాకి ఆడే హీరో.”

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Jabardasth Anchor: జాకెట్ విప్పి మరీ యువ‌త‌ని రెచ్చ‌గొడుతున్న జ‌బ‌ర్ధ‌స్త్ యాంక‌ర్..క్రేజీ కామెంట్స్‌తో నెటిజ‌న్స్ ర‌చ్చ‌

Jabardasth Anchor: బుల్లితెర కామెడీ షోలో కామెడీనే కాదు గ్లామ‌ర్ షో కూడా భీబ‌త్సంగా ఉంది....

‘నిజం’ సినిమాలో తనని మోసం చేశారన్న రాశి!

ఆమె ఒకప్పుడు స్టార్ హీరోయిన్. కానీ తర్వాత అవకాశాలు తగ్గిపోతూ వచ్చాయి. మళ్ళీ సినిమాల్లో కనిపిస్తుందో...

ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్లుగా మారిన హీరోలు!

హిందీ, తెలుగు, తమిళ్, మలయాళ ఇలా ఏ భాషలో చూసినా సాధారణంగా ఒక విషయం గమనిస్తూ...

రాబోయే నెలల్లో భారీ అంచనాలతో రాబోతున్న సినిమాలివే..

సినీ అభిమానులు కరోనా కారణంగా చాలా కాలంగా థియేటర్ లో సినిమాలు చూడటాన్ని బాగా మిస్...