Home Film News Krithi Shetty: కృతి శెట్టి సినిమాల‌లోకి రాక‌ముందు ఏం చేసిందో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!
Film News

Krithi Shetty: కృతి శెట్టి సినిమాల‌లోకి రాక‌ముందు ఏం చేసిందో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

Krithi Shetty: ఉప్పెన సినిమాతో ఓవ‌ర్ నైట్ స్టార్‌గా మారిన అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి. ఈ మ‌ల‌యాళ సోయ‌గం త‌న క్యూట్ స్మైల్‌తో అందరిని క‌ట్టి ప‌డేసింది. ఉప్పెన త‌ర్వాత ఈ అమ్మ‌డికి వ‌రుస సినిమా అవ‌కాశాలు వ‌చ్చాయి. ఆ మూడు మంచి హిట్ కావ‌డంతో కృతి శెట్టి పేరు ఓ రేంజ్‌లో మారు మ్రోగింది. కెరీర్ ప్రారంభంలోనే ఈ ముద్దుగుమ్మ హ్యాట్రిక్ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకొని అంద‌రు ఆశ్చ‌ర్య‌పోయేలా చేసింది. అయితే హ్యాట్రిక్ హిట్స్ త‌ర్వాత కృతి శెట్టిని వ‌రుస ఫ్లాపులు ప‌ల‌క‌రించాయి. నితిన్, సుధీర్ బాబు, రామ్ పోతినేని లతో చేసిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర తీవ్రంగా నిరాశ‌ప‌రిచాయి.

ఈ మూడు సినిమాల తర్వాత చిన్న గ్యాప్ తీసుకున్న కృతి శెట్టి.. నాగ చైతన్యతో కలి కస్టడీ అనే బైలింగ్యువ‌ల్ సినిమా చేసింది. ఈ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోవ‌డంతో కృతి ఖాతాలో మరో ఫ్లాప్ చేరింది.దీంతో ఈ అమ్మ‌డు త‌న త‌ర్వాతి సినిమాల‌పై ఫుల్ ఫోక‌స్ పెట్టింది. అంతేకాక మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకునేందుకు తన అభిమానులను ఖుషీ చేసేందుకు సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. బ్యూటీఫుల్ డ్రెస్ లు ధరిస్తూ ఆకట్టుకునేలా ఫొటోషూట్లు చేస్తూ కుర్ర‌కారుని మ‌త్తులోకి దించుతుంది. కృతి శెట్టి సోష‌ల్ మీడియాలో షేర్ చేసే పిక్స్ కి సూప‌ర్భ్ రెస్పాన్స్ వ‌స్తుంటుంది.

అయితే కృతి శెట్టికి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట వైర‌ల్‌గా మారింది. కృతి హీరోయిన్ కాక‌ముందు కూడా రెండు చేతులా డబ్బులు బాగానే సంపాదించిందట. హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వక ముందు ఈ అమ్మ‌డికి పలు యాడ్స్ ఆఫ‌ర్స్ రాగా, వాటిలో నటించిందట కృతి. ఇప్పుడు హీరోయిన్ గా స్టార్ డమ్ వచ్చిన తర్వాత యాడ్స్ లో న‌టించేందుకు పెద్ద‌గా ఆస‌క్తి చూప‌డం లేద‌ని తెలుస్తుంది. అయితే కృతి ఈ మ‌ధ్య త‌న రెమ్యున‌రేష‌న్ కూడా భారీగా పెంచింద‌ని టాక్ న‌డించింది. ప్ర‌స్తుతం కృతికి తెలుగులో పెద్దగా ఆఫ‌ర్స్ ఏమి లేవు. కోలీవుడ్ లో మాత్రం వరుసగా ఆఫర్లు వ‌స్తున్నాయ‌ని, ఇప్పటికే దళపతి విజయ్ సినిమాలో ఎంపికైందని టాక్ న‌డుస్తుంది.. మరోవైపు విశాల్ సరసన , సూర్య సరసన ఛాన్స్ ద‌క్కించుకుంద‌ని టాక్.

Related Articles

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...

Samantha: స‌మంత మేనేజ‌ర్ మోసం.. అడ్డంగా బుక్ అయ్యాడుగా…!

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న క్యూట్‌నెస్ తో పాటు...