Home Film News Trisha: సైలెంట్‌గా పెళ్లి పీట‌లెక్కిన త్రిష‌.. అంద‌రికి పెద్ద షాకిచ్చేసిందిగా..!
Film News

Trisha: సైలెంట్‌గా పెళ్లి పీట‌లెక్కిన త్రిష‌.. అంద‌రికి పెద్ద షాకిచ్చేసిందిగా..!

Trisha: చెన్నై సుంద‌రి త్రిష ఒక‌ప్పుడు టాలీవుడ్‌లో వ‌రుస సినిమాల‌తో సంద‌డి చేస్తూ ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గా ఎంట‌ర్‌టైన్ చేసిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. స్టార్ హీరోలంద‌రితో జ‌త‌క‌డుతూ మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు ద‌క్కించుకుంది. అయితే 40 ఏళ్లు వ‌చ్చిన కూడా త్రిష గ్లామ‌ర్ చెక్కు చెద‌ర‌లేదు. అంతే అందంతో క‌నిపిస్తూ ఉంది. సౌత్ ఇండస్ట్రీలో ఉండే దాదాపు అన్ని భాషల్లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న త్రిష ఇప్ప‌టి వ‌ర‌కు పెళ్లి చేసుకోక‌పోవ‌డం అభిమానుల‌ని బాధిస్తుంది. గ‌తంలో బిజినెస్‌మెన్‌తో నిశ్చితార్థం జ‌రుపుకున్న‌ప్ప‌టికీ ఆ రిలేష‌న్ పెళ్లి వ‌ర‌కు పోలేదు. అప్ప‌టి నుండి త్రిష సోలోగానే ఉంటుండ‌గా,  తాజాగా ఎవరికి తెలియకుండా రహస్యంగా త్రిష పెళ్లి చేసుకుని అందరికి  పెద్ద షాకిచ్చింది త్రిష‌. ప్రస్తుతం త్రిష పెళ్లికి సంబంధించిన వీడియో నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తుంది.

త్రిష ఇటీవ‌ల మ‌ణిర‌త్నం తెర‌కెక్కించిన పొన్నియ‌న్ సెల్వ‌న్ చిత్రంలో న‌టించి మంచి ప్ర‌శంస‌లు ద‌క్కించుకుంది. ఇప్పుడు ప‌లు త‌మిళ సినిమాల‌తోను బిజీగా ఉంది. ఈ స‌మ‌యంలో త్రిష సైలెంట్‌గా పెళ్లి పీట‌లెక్కింద‌ని చెబుతున్నారు. అయితే అస‌లు విష‌యం ఏంటంటే ఆమె పెళ్లి చేసుకుంది రీల్ లైఫ్ లో, రియ‌ల్ లైఫ్‌లో కాదు.  జీఆర్టి జ్యువెలర్స్ అనే ఆభరణాలను ప్రమోట్ చేస్తూ  త్రిష ఓ యాడ్ చేయ‌గా, ఇందులో పెళ్లి కూతురిగా ముస్తాబై ఎంతో అందంగా క‌నిపిస్తుంది. త్రిషని ఇలా చూసి పెళ్లి క‌ళ వ‌చ్చింద‌ని కొంద‌రు చెప్పుకొస్తున్నారు. అయితే త్రిష పెళ్లి   రియల్ లైఫ్ లో కాదు రీల్ లైఫ్ లో అని తెలిసి అభిమానులు నిరాశ చెందుతున్నారు.  త్రిష పెళ్లి ఎప్పుడు జ‌రుగుతుందా అని ఆమె అభిమానులు వేయికళ్ల తో ఎదురుచూస్తున్నారు.

1999 జోడి సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గా నటించి చిత్ర ప‌రిశ్ర‌మ‌కి ఎంట్రీ ఇచ్చిన త్రిష‌.. 2002లో హీరోయిన్ గా తమిళ పరిశ్రమలోకి అడుగు పెట్టింది. అక్క‌డ ప‌లు సినిమాలు చేశాక తెలుగులో త‌రుణ్ స‌ర‌స‌న నీ మ‌న‌సు నాకు తెలుసు అనే సినిమా చేసింది. ఈ చిత్రం త‌ర్వాత త్రిష వెనక్కి చూసుకోలేదు. మంచి  మంచి హిట్స్ ద‌క్కించుకుంటూ స్టార్‌డం అందుకుంది. ప్ర‌స్తుతం త్రిష‌కి తెలుగులో ఆఫ‌ర్స్ రాక‌పోయిన త‌మిళంలో మాత్రం అడ‌పాద‌డ‌పా ఏదో ఒక ఆఫ‌ర్ ప‌ల‌క‌రిస్తూనే ఉంది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...