Home Film News Samantha: స‌మంత అమెరికా టూర్ ట్రీట్‌మెంట్ కోస‌మే కాదు, దాని వెన‌క మ‌రో రీజ‌న్ కూడా ఉంది..!
Film News

Samantha: స‌మంత అమెరికా టూర్ ట్రీట్‌మెంట్ కోస‌మే కాదు, దాని వెన‌క మ‌రో రీజ‌న్ కూడా ఉంది..!

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ స‌మంత కొద్ది రోజులుగా మ‌యోసైటిస్‌తో బాధ‌ప‌డుతున్న విష‌యం తెలిసిందే. కెరీర్ సక్సెస్ ఫుల్‌గా సాగుతున్న స‌మ‌యంలో స‌మంత మయోసైటిస్ బారిన ప‌డ‌డంతో ఇప్పుడు చికిత్స కోసం ఏడాది పాటు సినిమాల‌కి బ్రేక్ ఇచ్చిన‌ట్టు తెలుస్తుంది. ఇటీవ‌ల త‌ను క‌మిటైన సినిమా షూటింగ్స్ అన్ని పూర్తి చేసిన స‌మంత ఇప్పుడు అమెరికా బాట ప‌ట్టింది. ఎయిర్‌పోర్ట్‌లో స‌మంత‌కి సంబంధించిన ఫొటోలు ,వీడియోలు నెట్టింట వైర‌ల్ అయ్యాయి. చికిత్స కోసం స‌మంత అమెరికా వెళుతుందేమోన‌ని అంద‌రు అనుకొని ఆమె క్షేమంగా తిరిగి రావాల‌ని కోరుకున్నారు. అయితే స‌మంత అమెరికా టూర్ వెన‌క మ‌రో బ‌ల‌మైన కార‌ణం కూడా ఉంద‌ని తెలుస్తుంది.

స‌మంత‌కి ఇటీవ‌ల అరుదైన గౌర‌వం ల‌భించింది.  వరల్డ్‌ లార్జెస్ట్‌ ఇండియా డే పరేడ్ లో పాల్గొనే అవకాశం స‌మంత‌కి రాగా, ఇందులో పాల్గొనేందుకు ఇంత తొంద‌ర‌గా అమెరికా వెళ్లింది.  ఈ నెల 20వ తేదీన న్యూయార్క్‌లో జరగనున్న భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో స‌మంత సంద‌డి చేయ‌నుంది. దీనిని ప్లాన్ చేసుకొనే స‌మంత అక్క‌డికి వెళ్లింది. అయితే స‌మంత న‌టించి ఖుషి చిత్రం సెప్టెంబ‌ర్ 1న విడుద‌ల కానుండ‌గా, ఈ మూవీ ప్ర‌మోష‌న్స్‌లో స‌మంత ఇక పాల్గొనే అవ‌కాశం లేద‌ని కొంద‌రు అంటున్నారు. అమెరికా ప్రోగ్రాం గురించి మేక‌ర్స్ కి ముందే చెప్పిన నేప‌థ్యంలో వారు ఖుషీ మ్యూజిక‌ల్ క‌న్స‌ర్ట్ అంటూ ప్ర‌త్యేక ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. తాజా స‌మాచారం ప్ర‌కారం స‌మంత ట్రీట్‌మెంట్ పూర్త‌య్యాకే ఇండియాకి వ‌స్తుంద‌ని టాక్.

మరి  ఖుషి చిత్రాన్ని  ప్రేక్ష‌కుల్లోకి తీసుకెళ్ల‌డం విజ‌య్ ఒక్క‌డితో అవుతుందా అనేది చూడాల్సి ఉంది. ఇక స‌మంత‌.. వ‌రుణ్ ధావ‌న్ తో `సిటాడెల్‌` వెబ్ సిరీస్ కూడా చేయగా, ఇది కూడా త్వ‌ర‌లోనే స్ట్రీమింగ్ కానుంది. మ‌రి కొన్ని ప్రాజెక్ట్స్ స‌మంత‌ని ప‌ల‌క‌రించిన వాటిని వ‌దిలేసింది. కొన్ని ప్రాజెక్టుల కోసం నిర్వాత‌లు  అడ్వాన్సులు ఇవ్వ‌గా వాటిని కూడా  రిట‌ర్న్ చేసింది. ఇటీవ‌ల మానసిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు బాలిలో కొద్ది రోజులు వెకేషన్ ఎంజాయ్ చేసి వ‌చ్చింది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...